Hyderabadi Youth lost One Lakh Rupees to SIM swap అన్ లైన్ లో రూ.500 టీషర్ట్.. కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తే.. రూ.లక్ష

Hyderabadi youth lost one lakh rupees to sim swap

Hyderabadi Youth, Maredpally youth, Q-shop, T-Shirt, call center, fraudsters, One Lakh Rupees, SIM swap, Online Fraud, cyber crooks, online banking scam, online purchasing scam, SIM swap frauds, mobile networks, criminals, personal details, technology, cyber crime Police, Hyderabad

A Hyderabadi Youth lost almost One Lakh Ruppees to SIM swap fraud. Not only digitally-illiterate people fall prey to this scam, but even tech-savvy urban youth also become victims of this fraud.

అన్ లైన్ లో రూ.500 టీషర్ట్.. కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తే.. రూ.లక్ష

Posted: 02/28/2020 11:59 AM IST
Hyderabadi youth lost one lakh rupees to sim swap

ఆన్ లైన్ మోసాలు.. అందుగలదు ఇందు లేదన్న సందేహము వలదు.. ఎందెందు వెతికినా అందందే గలదు.. అన్ లైన్ షాపింగ్ గోల్ మాల్.. అంటూ ఎప్పటికప్పుడు నేరగాళ్లు తమ ఉనికి చాటుకుంటున్నారు. ఇటీవల ఫూణేలోని ఓ 72 ఏళ్ల వృద్దుడు వారంతాన్ని ఎంజాయ్ చేయాలని బీర్ ను అన్ లైన్ లో అర్డర్ చేస్తే.. పాతిక వేల రూపాయలకు ఆన్ లైన్ కేటుగాల్లు టెండర్ వేసిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనల్లో వృద్దులో లేక గ్రామీణ నేపథ్యంలో వున్నవారు.. డిజిటల్ లావాదేవీలు తెలియని వారు మోసపోతే అర్థం కానీ.. నగరానికి చెందిన యువత కూడా ఈ మోసగాళ్ల చేతుల్లో చిక్క తమ ఖాతాలు ఖాళీ చేయించుకోవడం విస్మయానికి గురిచేస్తోంది.

అన్ లైన్ అనగానే అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించడం అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఇలా అప్రమత్తంగా లేని హైదరాబాద్ కు చెందిన యువకుడు ఆన్ లైన్ లో టీషర్ట్ ఆర్డర్ చేసిన ఓ కుర్రాడు సైబర్ క్రైం నేరగాళ్ల బారినపడి లక్ష రూపాయలు పోగొట్టుకుని లబోదిబోమంటున్నాడు. హైదరాబాద్‌ సైబర్ క్రైం పోలీసుల కథనం ప్రకారం.. మారేడ్‌పల్లికి చెందిన రవి ‘క్యూషాప్’ అనే వెబ్‌సైట్‌లో రూ.500 విలువైన ఓ టీషర్ట్‌ను ఆర్డర్ చేశాడు. బుక్ చేసిన వెంటనే రెండు రోజుల్లో షర్ట్ డెలివరీ అవుతుందని అతడి మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. అయితే, ఐదు రోజులైనా రాకపోవడంతో క్యూ షాప్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు.

అతడు ఫోన్ చేసిన వెంటనే రంగంలోకి దిగిన నేరగాళ్లు.. షర్ట్ డెలివరీలో సాంకేతిక ఇబ్బందుల కారణంగా ఆర్డర్ రద్దు చేస్తున్నట్టు చెప్పారు. మరో ఐదు నిమిషాల్లో మొబైల్‌కు మెసేజ్ వస్తుందని, అందులో వివరాలు నమోదు చేస్తే చెల్లించిన 500 రూపాయలు వెనక్కి వస్తాయని నమ్మబలికారు. అనుకున్నట్టే ఆ తర్వాత మెసేజ్ రావడం, అందులో వివరాలు నమోదు చేయడం జరిగిపోయాయి. అయితే, ఆ తర్వాత కాసేపటికే వచ్చిన మరో మెసేజ్ చూసిన రవికి మైండ్ బ్లాంక్ అయింది. లక్ష రూపాయలు డ్రా అయినట్టు బ్యాంకు నుంచి వచ్చిన మెసేజ్ చూసి షాకయ్యాడు. మోసపోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi  Maredpally  Qshop  Tshirt  call center  sim swap  cyber crime police  hyderabad  telangana  

Other Articles