Sri Vari darshan within hours to devotees of Ammavaru అమ్మవారి కటాక్షంతో.. గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం

Devotees of tiruchanoor ammavaru to get tirumala sri vari darshanam within hours

Padmavati Temple, Tiruchanoor, APTDC, Piligrims, Tirumala darshan, Tirumala Package, AP Tourism, Tirumala tirupati devasthanam, TTD Board, Diety Sri Venkateshwara swamy, Vada Prasadam, Kalyanam Laddu Prasadam, recommendation letters, SriVari darshanam, Dharma reddy, devotional

The Andhra Pradesh Tourism corporation board tie-up with Tiruchanoor Padmavati Ammavaru and Tirumala tirupati devasthanam, has bought a new scheme for the devotees. If devotees book a room at Tiruchanoor Padmavati Amma Temple, APTDC will take them to tirumala and make darsham within hours.

పద్మావతి అమ్మవారి కటాక్షంతో.. గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం

Posted: 02/28/2020 11:07 AM IST
Devotees of tiruchanoor ammavaru to get tirumala sri vari darshanam within hours

సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెలసినన ఇల వైకుంఠపురంగా భక్తుల కొంగుబంగారంగా నిలిచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ తిరువేంకటేశ్వరుడి దర్శన భాగ్యం కలగాలంటే.. గంటల కొద్ది సమయం పడుతుంది. ఒక్కోసారి 24 నుంచి 36 గంటల సమయం కూడా పడుతుంది. అలాంటి శ్రీవారి దర్శనం మీకు కేవలం రెండు మూడు గంటల్లో కలగాలంటే.. పద్మావతి అమ్మావారి కటాక్షం కలగివుండాలి. అదేంటి అంటే.. తిరుపతికి రెండు కిలోమీటర్ల దూరంలో వున్న తిరుచానూరు పద్మావతి అమ్మవారు అనుగ్రహిస్తే దర్శనం ఇలా వెళ్లి అలా దర్శనం చేసుకోవచ్చు.

అయితే అమ్మవారి అనుగ్రహం కలగాలంటే.. భక్తులు తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి దగ్గరలో నిర్మించిన ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ వసతి సముదాయంలో రూమ్ బుక్ చేసుకుంటే సరి. ఇక్కడ రూమ్ బుక్ చేసుకున్న వారిలో రోజుకు 2 వేల మందిని తిరుమలకు తీసుకుని వెళ్లి, వారికి త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. భక్తులకు ఈ సౌకర్యం మార్చి నెల తొలి వారంలో భవంతి ప్రారంభమైన తరువాత నుంచి అందుబాటులోకి రానుంది.

తిరుమలకు వెళ్లే భక్తులకు ప్రత్యేకఏర్పాట్లు చేస్తున్నామని, టూరిజం బస్సుల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి, తిరుచానూరులో బస చేసే వారికి తొలి ప్రాధాన్యం ఉంటుందని అధికారులు వెల్లడించారు. వీరికి సొంతంగా వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఆపై తిరుమలకు తీసుకుని వెళ్లి, స్వామి దర్శనం చేయిస్తామని తెలిపారు. ఇందుకోసం రూ. 70 కోట్లతో తిరుచానూరులో 7 అంతస్తుల భవనంగా నిర్మించిన 'పద్మావతి నిలయం'ను అద్దెకు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ నూతన భవనంలో 80 ఏసీ, 120 నాన్ ఏసీ రూములు వున్నాయని.. వీటిల్లో అన్ని సదుపాయాలతో పాటు, గ్రౌండ్ ఫ్లోర్ లో రెస్టారెంట్ సౌకర్యం కూడా ఉంటుంది.

చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్, కుంభకోణం, మైసూరు తదితర ప్రాంతాల నుంచి, ఏపీటీడీసీ అందించే వివిధ ప్యాకేజీలను తీసుకుని వచ్చే దాదాపు 1000 మందికి ఇక్కడే బస అందించి, ఆపై దర్శనం చేయిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు భక్తులు ఆన్ లైన్ లో ముందస్తు బుకింగ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీటీడీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఏటా కోటి రూపాయల అద్దె చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుని ఈ వసతి సముదాయాన్ని పర్యాటక అభివృద్ధి సంస్థ తీసుకోవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Padmavati Temple  Tiruchanoor  APTDC  Piligrims  Tirumala darshan  Tirumala Package  AP Tourism  

Other Articles