Police body cam shows 6-year-old being arrested ఆరేళ్ల చిన్నారికి సంకెళ్లు వేసి.. పోలీస్ జీపులో..

Six year old schoolgirl arrested and cuffed with cable ties

Kaia Rolle, Handcuffed, arrest, six year old, student, school, cable, kicking, punching, distress, police misconduct, arrest, orlando police department, now, staff, teachers, police, sacked, florida, usa, us, america, crime

An American police officer has been sacked after he arrested a six-year-old girl at a school in Florida - allegedly for kicking and punching staff members. Kaia Rolle was crying and begging to be let go when she was arrested - the pictures were captured on an officer's bodycam.

ITEMVIDEOS: ఆరేళ్ల చిన్నారికి సంకెళ్లు వేసి.. పోలీస్ జీపులో..

Posted: 02/27/2020 06:05 PM IST
Six year old schoolgirl arrested and cuffed with cable ties

ఆరేళ్ల చిన్నారులు.. ఎలా అల్లరి చేస్తారంటే.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఓ ఇరవై మంది ఒకే గదిలో వుంటే.. ఆ అల్లరి హద్దుమీరి పోతుందనడంలో తప్పేంలేదు. అయినా చిన్నారుల అల్లరి ముచ్చేటేస్తుంది కానీ.. విసుగు తెప్పిస్తుందా.? కానీ ఇక్కడున్న ఓ పోలీసు అధికారికి మాత్రం విసుగు తెప్పించింది. ఆరేళ్ల చిన్నారిని అరెస్టు చేయడమేంటని విస్తుపోవాల్సిన పోలీసు అధికారి.. ఆ మేరకు పిర్యాదు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. చట్టానికి వయస్సు కూడా లేదనుకున్నాడో ఏమో కానీ.. ఆరేళ్ల చిన్నారిని అరెస్టు చేసి చేతులు వెనక్కు కట్టి టేప్ వేసి మరీ పోలీసు జీపులో తీసుకెళ్లాడు.

అంతే ఇంకేముందు ఈ దృశ్యాలు పోలీసు అధికారి బాడీ కామ్ రికార్డు చేసింది. దీంతో చిన్నారిని అరెస్టు చేసిన కారణంగా ఉద్యోగం మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటన వీడియో దృశ్యాలు నెట్టింట్లో వైరల్ గా మారడంతో సదరు పోలీసు అధికారిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటనపై బాధిత చిన్నారి బామ్మ మాట్లాడుతూ.. ఆరేళ్ల చిన్నారి తనను పోలీసులు చేతులకు సంకెళ్లు వేసి.. బాల నేరస్థులుండే జువైనల్ హోంకు తరలించారని, తన వేలిముద్రలు తీసుకున్నారని ఎవరితోనైనా ఎలా చెబుతోందని అమె ప్రశ్నించారు. ఇలా విమర్శలు వెల్లివిరియడంతో సదరు అధికారిపై చర్యలు తీసుకున్నారు.

మన పాఠశాలలో విద్యార్థులు తప్పు చేస్తే వారి తల్లిదండ్రులను పిలుస్తారు ఉపాధ్యాయులు. మరీ శృతిమించిన తప్పు చేస్తే ఫోన్ చేసి మరీ అర్జెంటుగా రమ్మని పిలుస్తారు. కానీ అమెరికాలో మాత్రం తల్లిదండ్రులకు బదులు పోలీసులకు పిర్యాదు చేస్తారు. మరీ అరేళ్ల పిల్లలు అల్లరి చేసినా..? అదే అక్కడ రివాజు. ఇదే జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాలోని ఓర్లాండో పట్టణానికి చెందిన ఆరేళ్ల అమ్మాయి.. స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో చదువుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి ఉపాధ్యాయులతో అనుచితంగా ప్రవర్తించిందనే కారణంతో ఆ పాఠశాల యాజమాన్యం.. ఆరేళ్ల చిన్నారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆరేళ్ల చిన్నారికి సంకెళ్లు వేసి, పోలీసు వాహనం ఎక్కించారు.

అరెస్టు చేసే సమయంలో ఆ చిన్నారి ఏడుస్తూ.. తనను అరెస్టు చేయొద్దంటూ పోలీసులను ప్రాధేయపడింది. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలనీ.. ఉపాధ్యాయులతో ఇకపై అనుచితంగా ప్రవర్తించనని వేడుకుంది. అయినా.. ఆ ఆరేళ్ల చిన్నారిపై పోలీసులు కనికరించలేదు. ఆ చిన్నారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాగా.. పోలీసులు ఆ చిన్నారిని అరెస్టు చేస్తున్నప్పటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసుల చర్యను నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా ఆ ఆరేళ్ల చిన్నారి ఓ నల్లజాతీయురాలు కాబట్టే.. పోలీసులు ఆ విధంగా ప్రవర్తించారంటూ కామెంట్ చేస్తున్నారు.  దీంతో స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు.. ఆరేళ్ల చిన్నారిని అరెస్టు చేసిన వారిని సస్పెండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : police misconduct  arrest  orlando police department  now  florida  school  teacher  US  crime  

Other Articles