Sonia Gandhi demands Amit Shah's resignation సీఏఏ అల్లర్లు: అమిత్ షా రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్

Sonia gandhi on delhi violence amit shah should resign

Congress, Rashtrapati Bhavan, Delhi violence,clash in delhi, northeast delhi riots, delhi riots, delhi burning, Sonia Gandhi, Manmohan Singh, Rahul Gandhi, Narendra Modi, Amit Shah, Citizenship amendment act, Delhi, National Politics, Crime

Congress president Sonia Gandhi has demanded Home Minister Amit Shah’s resignation over the ongoing violence in northeast Delhi, which has so far left 27 people dead. Ms. Gandhi asked, “Where was the Home Minister and what was he doing since last Sunday?”

సీఏఏ అల్లర్లు: అమిత్ షా రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్

Posted: 02/26/2020 05:21 PM IST
Sonia gandhi on delhi violence amit shah should resign

ఈశాన్య దిల్లీలో చోటుచేసుకున్న ఘటనలను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఖండించారు. ఇలాంటి ఘటనలు బాధాకరమన్నారు. మూడు రోజుల ఆందోళనల్లో 27 మంది చనిపోయారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఇవాళ ఢిల్లీలో సమావేశమైన సీడబ్ల్యూసీ భేటీలో ఈశాన్య ఢిల్లీలోని పరిస్థుతులపై అమె సమీక్షించారు. అనంతరం కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన సోనియా గాంధీ.. ఈ ఘటనలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు.

దేశరాజధానిలోనే ఇలాంటి హింసాత్మక ఘటనలు జరిగినా మూడు రోజులుగా ఏం జరుగుతోందని అమె ప్రశ్నించారు. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇవి జరిగాయని ఆమె ఆరోపించారు. బీజేపి నేత కపిల్‌ మిశ్రా వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. ఈ అల్లర్లను నియంత్రించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు బలగాలను మోహరించడంలో ప్రభుత్వాలు అలసత్వం వహించాయని ధ్వజమెత్తారు.

సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య దిల్లీలో గత మూడు రోజులుగా చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది మృతిచెందగా.. వందలాది మంది గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో బుధవారం రంగంలోకి దిగిన పారా మిలటరీ బలగాలు పలు చోట్ల కవాతు నిర్వహించాయి. డ్రోన్‌ కెమెరాలతో పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. భద్రతా వ్యవహారాలను కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఇప్పటివరకు ఉన్న భద్రతా బలగాల సంఖ్యను మరింత పెంచాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం 35 కంపెనీల పారా మిలటరీ బలగాలు భద్రతను చూస్తుండగా.. దీన్ని 45వరకు పెంచాలని నిర్ణయించారు. 800 మంది ప్రత్యేక కమాండోలను మోహరించనున్నట్టు కేంద్ర హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles