dont allocate farmers land to poor: pawan kalyan రైతులకు, పేదలకు మధ్య పేచీ పెడుతున్న ప్రభుత్వం: పవన్ కల్యాణ్

If govt is really on the side of poor don t allocate farmer s land pawan kalyan

Pawan Kalyan, JanaSena, Farmers, agriculture land, houses for poor, assigned land, Vijayawada, Amaravati, Andhra Pradesh, Politics

Janasena Party leader and Telugu film star Pawan Kalyan on Wednesday suggested the Andhra Pradesh Government not to allocate the house for poor in the lands which were given by the farmer for the construction of capital.

రైతులకు, పేదలకు మధ్య పేచీ పెడుతున్న ప్రభుత్వం: పవన్ కల్యాణ్

Posted: 02/26/2020 04:20 PM IST
If govt is really on the side of poor don t allocate farmer s land pawan kalyan

అమరాతి ప్రాంత రైతుల నుంచి రాజధాని నిర్మాణం కోసం సమీకరించిన భూముల్లో కొద్ది మొత్తాన్ని పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాలని జగన్ సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. జగన్ సర్కారు క్రితం రోజున జారీ చేసిన ఉత్తర్వులను పరిశీలించిన ఆయన ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 1251 ఎకరాల్లో 54 వేల మందికి పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించడాన్ని ఎవరూ వ్యతిరేకించరని అయితే.. ఈ విషయంలోనూ తెరపైకి కొన్ని వివాదాలు వస్తాయని, వాటిని కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.  

రాజధాని కోసం తమ పోలాలను రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని.. అంతేకానీ పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం మాత్రం కాదని ఆన్నారు. ఈ నేపథ్యంలో తమ స్థలాల్లో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించడం, అందుకు సంబంధించి పట్టాలను కూడా విడుదల చేయడంతో రాజధాని ప్రాంత రైతులకు.. ఇళ్ల పట్టాలు పోందిన రైతులకు మధ్య వివాదాలు వచ్చే అవకాశాలు లేకపోలేదని అన్నారు. నిర్దేశిత అవసరాల కోసం తాము అప్పగించిన భూములను ఇతర అవసరాలకు కేటాయించిన పక్షంలో వివాదాలు రేగడం సర్వసాధారణం అని ఆయన అన్నారు.  

ఇల్లు లేని పేదలకు స్థలం కేటాయించడాన్ని ఎవరూ తప్పు పట్టరని.. చిత్తశుద్ది ఉంటే ఎలాంటి వివాదాలు లేని భూములనే వారికి ఇవ్వాలి అన్నారు జనసేనాని. ఓవైపు భూములు ఇచ్చిన రైతులు ఉద్యమాలు చేస్తుంటే.. మరోవైపు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయడం ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే అవుతుందన్నారు. రాజధాని కోసం ఉద్దేశించిన భూములను లబ్ధిదారులకు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని.. తదుపరి వచ్చే చట్టపరమైన చిక్కులతో పేదలు ఇబ్బందులు పడతారని పవణ్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

ఇక పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన లబ్దిదారులతో పాటు మిగిలిన పదకొండు జిల్లాల స్థలాల కేటాయింపులో వివాదాలు వున్నాయని అన్నారు. ఈ జిల్లాల్లోనూ స్థలాల కోసం ఇచ్చిన భూములు చుట్టూ వివాదాలు ఉన్నాయన్నారు పవన్.. పేదలకు అందించే స్థలాలన్నీ అసైన్డ్‌ భూములను, స్మశాన భూములను, పాఠశాల మైదానాలు వున్నాయని అన్నారు. ఇవన్నీ ఇళ్ల స్థలాలుగా మార్చాలని నిర్ణయించడం ఈ పథకంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందని అన్నారు. ప్రభుత్వం పేదలకు నిజంగా లబ్ది చేయాలనుకుంటే ఇలాంటి స్థలాలను ఎవరూ కేటాయించరని జనసేన అధినేత పవన్ విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles