Not right ro deprive child's access to grandparents: HC వృద్ద దంపతుల కోరిక తీర్చేలా బాంబే హైకోర్టు తీర్పు..

Not right to deprive childrens access to grandparents hc

Bombay High Court, Grand Parents, Grand Children, Justice S J Kathawalla, Justice B P Colabawalla, Mumbai-based woman, Delhi, Husband, In-Laws, Family court mumbai, Crime

Observing that it is not right to deprive access of a child to his/her grandparents, the Bombay High Court directed a Mumbai-based woman to let her 10-year- old son meet her former in-laws once a week.

వృద్ద దంపతుల కోరిక తీర్చేలా బాంబే హైకోర్టు తీర్పు..

Posted: 02/19/2020 06:36 PM IST
Not right to deprive childrens access to grandparents hc

వృద్దులకు తమ వారసులను చూడాలని ఆశను సజీవం చేస్తూ బాంబే హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. తన బిడ్డను అతని తాత, నానమ్మలు కలవకుండా అడ్డుకున్న తల్లిని సున్నితంగా మందలించింది. ఫ్యామిలీ న్యాయస్థానం ఇచ్చిన అదేశాలను ఎందుకు పాటించలేదని ప్రశ్నించింది. అంతేకాదు తాము ఇచ్చిన ఆదేశాలను పాటించని పక్షంలో జరిమానా కూడా కట్టాల్సివస్తుందని తీర్పును వెలువరించింది. తాత, నానమ్మలను కలవకుండా పిల్లలను ఆపడం సరికాదని.. వారిని కలిసేందుకు పిల్లలకు హక్కు వుంటుందని తీర్పును చెప్పింది.

భర్త చనిపోవడంతో ఆయన కుటుంబాన్ని వదిలేసి, మరో వివాహం చేసుకుని వెళ్లిపోయిన మహిళ వేసిన పిటిషన్ విషయంలో కోర్టు ఈ మేర తీర్పు వెలువరిస్తూ.. భర్త తల్లిదండ్రులు వారానికోసారి తమ మనవడిని చూసుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. వారానికో పర్యాయం వారు ఢిల్లీ నుంచి ముంబై రాలేని పక్షంలో వారు ముంబై వచ్చినప్పుడల్లా వారికి మనవడిని చూపించాలని, వారిని కలిసేందుకు వీలుకల్పించాలని న్యాయస్థానం కొడుకును కోల్పోయిన వృద్ద జీవితాలకు మనవడి ఆసరా అవసరమంటూ సంచలన తీర్పును వెలువరించింది.

ముంబైకి చెందిన ఓ మహిళకు కొన్నేళ్ల కిందట ఢిల్లీకి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. భర్త, అత్తామామలతో కలిసి ఆమె ఢిల్లీలో ఉండేది. వారికి 2009లో ఒక అబ్బాయి పుట్టాడు. అయితే ఆమె భర్త 2010లో చనిపోయాడు. తర్వాత ఆమె ఆ కుటుంబాన్ని వదిలేసి, కుమారుడిని తీసుకుని ముంబైలో తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. అప్పటినుంచీ అత్తామామలను దగ్గరికి రానీయ్యలేదు. మనవడిని చూడనివ్వలేదు. అదే సమయంలో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో తమ మనవడిని చూసుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ అత్తామామలు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు. మనవడిని చూసుకునేందుకు వారికి అవకాశం ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు తీర్పు నిచ్చింది.

ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. పెళ్లయ్యాక అత్తామామలు తనను సరిగా చూసుకోలేదని, చాలా ఇబ్బందులు పెట్టారని తన పిటీషన్ లో పేర్కోంది. తన కుమారుడు తాత, నానమ్మను ఇప్పటివరకు చూడలేదని, అందువల్ల ఇక ముందు చూసేందుకు అవకాశం ఇవ్వొద్దని కోర్టును కోరింది. కానీ ఈ వాదనలను కోర్టు తప్పుపట్టింది. అత్తామామలు సరిగా చూసుకోలేదన్న కారణంగా.. వారి మనవడిని కలవకుండా ఆపడం కుదరదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటివరకు వారు మనవడిని చూడలేకపోవడానికి తల్లిగా మీరే కారణమని స్పష్టం చేసింది. మనవడిని వారానికోసారి చూసుకోవడానికి తాత, నానమ్మలకు అవకాశం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. వారానికోసారి వారు రాలేకపోతే.. వారు ఢిల్లీ నుంచి ఎప్పుడు వస్తే అప్పుడు కలవనివ్వాలని ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles