Non-compliance: HC orders official to plant 100 trees ఐఎఏస్ అధికారికి న్యాయస్థానం చిత్రమైన శిక్ష

Kerala high court orders ias officer to plant 100 saplings over delayed action

IAS officer, Kerala High Court, plant 100 saplings, Industries Director, K Biju, Kerala Water Resources Minister, K Krishnankutty, Justice Amit Rawal, farmer, palakkad, Kerala, Politics

An IAS officer in Kerala has been asked by the Kerala High Court to plant 100 saplings. The exceptional punishment was given to Industries Director K Biju for a nearly two-decade delay in taking a final decision on a private firm's request for sales tax relaxations.

అమాత్యుడి తనయుడికి న్యాయస్థానం చిత్రమైన శిక్ష

Posted: 02/15/2020 01:43 PM IST
Kerala high court orders ias officer to plant 100 saplings over delayed action

కేరళలో ఓ ఐఏఎస్ ఆఫీసర్ కు అక్కడి హైకోర్టు చిత్రమైన శిక్ష వేసింది. ఒక ప్రైవేటు కంపెనీ పెట్టుకున్న అప్పీలుపై తగిన నిర్ణయం తీసుకోవడంలో ఏకంగా రెండు దశాబ్దాలకు పైగా జాప్యం చేయడాన్ని, నిర్లక్ష్యాన్ని తప్పుపడుతూ.. న్యాయస్థానం ఈ మేరకు శిక్షను విధించింది. ఈ శిక్ష నేపథ్యంలో ఎక్కడెక్కడ ఏయే మొక్కలు నాటారన్న వివరాలతో కూడిన నివేదికను కూడా తమకు సమర్పించాలని న్యాయస్థానం అదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఈ తరహా పరీక్షను అందుకున్న ఐఎఏస్ అధికారి ఎవరు అన్న వివరాల్లోకి ఎంట్రీ ఇస్తే..

కేరళ పరిశ్రమల శాఖ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కె.బిజును వంద మొక్కలు నాటాల్సిందిగా న్యాయస్థానం చిత్రమైన శిక్షను విధించింది. అయితే బిజుకు ఈ శిక్షను విధించడానికి కారణాలేంటీ అంటే.. కేరళలోని కోల్లాం ప్రాంతానికి చెందిన ఎస్ఎస్ కెమికల్స్ అనే కెమికల్ పరిశ్రమ తమకు పన్ను మినహాయింపులు కోరుతూ 2001లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. కాగా దీనిని పరిశ్రమల శాఖ తిరస్కరించింది. దీనిపై 2003లో పరిశ్రమ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.

తమకు పన్ను మినాయింపులు కల్పించేలా ప్రభుత్వాన్ని అదేశించాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేసింది. అయితే న్యాయస్థానం అదేశాల మేరకు పరిశ్రమల శాఖ పలు పర్యాయాలు కెమికల్ పరిశ్రమ వాదనలు విన్నప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో మరోమారు సదరు కంపెనీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమకు ఎదురైన ఇబ్బందులను న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చింది. దీంతో ఈ విషయమై స్వయంగా పరిశ్రమల శాఖ కార్యదర్శి బిజును కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని అదేశించింది.

కాగా ఈ కేసును వాయిదా వేసిన న్యాయస్థానం పరిశ్రమల కార్యదర్శిని పబ్లిక్ ప్రదేశాల్లో వంద మొక్కలు నాటి.. ఆ వివరాలను తమకు అందజేయాలని స్పష్టం చేసింది. కాగా సదరు ఐఎఏస్ అధికారి కె.బిజు.. ఆ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి కె.కృష్ణకుట్టి కుమారుడు కావడం గమనార్హం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IAS  K Krishnankutty  K Biju  Palakkad  Kerala Forest Department  Kerala  crime  

Other Articles