No CAT stay on ABV's suspension ఏబి వెంకటేశ్వర రావుకు లభించని సత్వర ఊరట..

No immediate relief to suspended ips officer in cat

Central Administrative Tribunal, AB Venkateswara Rao, Suspension, CAT Member BV Sudhakar, Senior IPS officer, Andhra Pradesh, Politics

The Central Administrative Tribunal-Hyderabad directed Andhra Pradesh government to file counter affidavit in the petition filed by senior IPS officer A.B. Venkateswara Rao who challenged his suspension. Hearing the petition filed by Mr. Rao, CAT member B.V. Sudhakar declined to stay the suspension order.

క్యాట్ లో ఏబి వెంకటేశ్వర రావుకు లభించని సత్వర ఊరట..

Posted: 02/15/2020 02:26 PM IST
No immediate relief to suspended ips officer in cat

ఆంధ్రప్రదేశ్ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు కు క్యాట్ లో సత్వర ఊరట లభించలేదు. తన సస్పెన్షన్ ఆర్డర్ పై స్టే ఇవ్వాలని కోరుతూ ఆయన చేసిన అభ్యర్థనను క్యాట్ తోసిపుచ్చింది. అవినీతి ఆరోపణలపై ఏబి వెంకటేశ్వర రావును రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు విధించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కాగా ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు కేంద్ర పరిపాలనా ట్రిభ్యునల్ (క్యాట్) ని ఆశ్రయించారు.

దీంతో క్రితం రోజున ఏబి వెంకటేశ్వరరావు పిటీషన్ పై క్యాట్ హైదరాబాద్ బెంచ్ విచారణ జరిపింది. స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన క్యాట్.. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. డిజి స్థాయి అధికారిని కేంద్రం అనుమతి లేకుండా ఎలా సస్పెండ్ చేస్తారని క్యాట్ ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ ఛీప్ ఏబి వెంకటేశ్వర రావును సస్పెండ్ చేసిన విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖకు తెలిపారా.? అని ప్రశ్నించింది.

విచారణ సందర్భంగా  ఏబీ వెంకటేశ్వరావు ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. సదరు అధికారికి గతన ఎనమిది నెలల నుండి వేతనాన్ని ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించింది. జీతం ఇవ్వకపోతే అతని కుటుంబపోషణ ఎలా సాగుతుందని కూడా ప్రశ్నించింది. అసలు ఆయనకు నెలసరి వేతనం ఎందుకు ఇవ్వడం లేదో తెలపాలని ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే క్యాట్ సందేహాలను నివృత్తి చేసేందుకు తమకు వారంరోజులు సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది  దేశాయ్ ప్రకాష్ రెడ్డి కోరడంతో, అందుకు అంగీకరించిన ట్రిబ్యునల్ తదుపరి విచారణను ఈ నెల 24 కు వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles