Girl students striped clothes in Gujarat's Kutch విద్యార్థినుల లోదుస్తులు విప్పించిన ప్రిన్సిపాల్ పై కేసు

Girls forced to remove innerwear in gujarat college

Sahajanand Girls Institute, bhuj stripping ncw, bhuj stripping, bhuj girls college, bhuj girls menstruating, Girl students, investigation, mensuration, Krantiguru Shyamji Krishna Verma Kutch University, Bhuj, Gujarat, Crime

Bhuj-based Shree Sahajanand Girls Institute principal Rita Raniga, coordinator Anita, peon Nayna and hostel supervisor Ramila were booked for outraging modesty of 68 girls who were traumatized after being forced to strip to check if they were menstruating. The FIR was lodged following a complaint by two victims.

ITEMVIDEOS: విద్యార్థినుల లోదుస్తులు విప్పించిన ప్రిన్సిపాల్ పై కేసు

Posted: 02/15/2020 12:41 PM IST
Girls forced to remove innerwear in gujarat college

అనాగరిక పద్దతులు, మూఢాచారాలు, సంప్రదాయాల పేరుతో గుజరాత్ లోని ఓ కళాశాల యాజమాన్యం విద్యార్థులపై అమానుష చర్యలకు పాల్పడిన ఘటనలో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ సహా కోఆర్డినేటర్ మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థులకు ఏది మంచి, ఏది చేడు అని వివరించే కళాశాలలోనే ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడి.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 68 మంది విద్యార్థుల లోదుస్తులను విప్పించి మరీ వారు రుతుస్రావంపై పరీక్షించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

దేవుడే ఆడజన్మకు ఈ వరం కల్పించాడని, ప్రకృతి సహజంగా వచ్చిన రుతుస్రావం సమయంలో తాము ఆలయాలకు ఎందుకు వెళ్లవద్దని ఓ వైపు మహిళా హక్కుల కోసం పోరాటం చేస్తున్న తృప్తి దేశాయ్ ఆలయాల్లోని గర్భగుడిలోకి కూడా అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. కాగా, రుతుస్రావం జరుగుతున్న విద్యార్థినులు కాలేజీ హాస్టల్ వంట గదిలోకి, అక్కడి దేవాలయాల్లోకి కూడా ప్రవేశించి సుచీ, శుభ్రం లేకుండా, మడీ, అచారాలను మంటగలుపుతున్నారన్న హాస్టల్ వార్డెన్ పిర్యాదుతో ప్రిన్సిఫల్ వారిపై అనైతిక చర్యకు పాల్పడింది.

ఏకంగా కాలేజీ హాస్టల్ లో ఉంటున్న 68 మంది విద్యార్థినులను తన గదికి పిలిచి వార్నింగ్ ఇచ్చిన ప్రధానోపాధ్యయురాలు.. వారిందరికీ ఒకరు తరువాత ఒకరుగా కాలేజీ బాత్ రూమ్ లోకి తీసుకెళ్లి అక్కడ వారిచేత బలవంతంగా లోదుస్తులు విప్పించి మరీ వారి రుతుస్త్రావంపై పరీక్ష చేసింది. ఈ దారుణఘటన ప్రధాని నరేంద్రమోడీ సొంతరాష్ట్రం గుజరాత్ లో శ్రీ సహజానంద్ గర్ల్స్ ఇన్స్టిట్యూట్ లో జరిగింది. ఆ కళాశాలలో వున్న నియమాలను ఉల్లంఘించి విద్యార్థినులు.. రుతుస్రావం జరిగే రోజుల్లో హాస్టల్ కిచెన్ వైపు, అక్కడున్న ఆలయం వైపు వచ్చారని.. తోటి విద్యార్థినులతో కలిసి కళాశాలలో కలియతిరిగారని పిర్యాదులపై ఈ చర్యలకు యాజమాన్యం పాల్పడింది.

అంతటితో ఆగని కళాశాల యాజమాన్యం ఈ విషయాన్ని బయటకు చెబితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పోలీసులకు పిర్యాదు చేయడానికి విద్యార్థినులు ముందుకురాలేదు. ఇది మతపరమైన విషయం కాబట్టి కంప్లైంట్ ఇవ్వకూడదని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసారని కొందరు విద్యార్థినులు వ్యాఖ్యానించడం గమనార్హం.. ఈ సంఘటన గురించి బయటకు పొక్కడంతో సదరు కళాశాల యాజమాన్యంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే కొందరు విద్యార్థినుల తల్లిదండ్రుల పిర్యాదు మేరకు జాతీయ మహిళా కమీషన్ రంగంలోకి దిగింది. యాజమాన్యం చర్యలపూ కన్నెర్ర చేసింది. పోలీసులు చర్యలు చేపట్టాలని అదేశాలు జారీ చేసింది. రంగంలోకి దిగిన మహిళా పోలీసులు కాలేజీ ప్రిన్సిపాల్ రీటా రానింగా, కోఆర్డినేటర్ అనిత, ప్యూన్ నయనాలతో పాటు హాస్టల్ ఇంచార్జ్ రమీలాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసులపై కూడా కాలేజీ యాజమాన్యం సహా పలువురు ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ కళాశాల క్రాంతిగురు శ్యాంజీ కృష్ణవర్మ కట్చ్ యూనివర్సిటీకి అనుబంధంగా వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh