Kashi Mahakal Express, IRCTC’s 3rd private train మూడో ప్రైవేటు రైలు పేరేంటో తెలుసా.?

Irctc s 3rd train kashi mahakal express to be flagged off by pm narendra modi

IRCTC Kashi Mahakal Express, IRCTC Kashi Mahakal Express route, IRCTC Kashi Mahakal Express news, Kashi Mahakal Express, indian railways news, irctc private train, Kashi Mahakal Express Jyotirlinga shrines, Kashi Mahakal Express indore to varanasi, Kashi Mahakal Express shiva devotees, pvt train connecting jyothirlinga shrines,

IRCTC Kashi Mahakal Express: Good news for Shiva devotees! The third private train, Kashi Mahakal Express is all set to be launched by IRCTC soon, will run between Indore and Varanasi and connect three Jyotirlinga shrines – Omkareshwar, Mahakaleshwar, and Kashi Vishwanath.

‘కూతకు వేళాయరా.!’ మూడో ప్రైవేటు రైలు పేరులో మార్పు.?

Posted: 02/13/2020 05:04 PM IST
Irctc s 3rd train kashi mahakal express to be flagged off by pm narendra modi

దేశంలోని సామాన్య ప్రజలను సుదూర ప్రాంతాలకు చౌకధరకే చేర్చే రవాణాసాధనం రైల్వే. ఇలాంటి రైల్వేలో విమానయానం తరహాలో వసతుల కల్పనతో అధునాతన సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది రైల్వే అనుసంధాన సంస్థ ఐఆర్సీటీసీ. దేశంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిథ్యం వహించే వారణాసీ నుంచి ఢిల్లీ వరకు ప్రయాణించే తొలి ప్రైవేటు రైలు తేజస్.. అహ్మదాబాద్ నుంచి ముంబైకి రెండో తేజస్ రైలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా మూడో ప్రైవేటు రైలు కూడా కూతకు రెడీ అయ్యింది.

ప్రదాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ రైలుకు తేజస్ అని కాకుండా  ‘కాశీ మహాకాల్‌ ఎక్స్‌ప్రెస్’ నామకరణం చేసింది ఇండియన్‌ రైల్‌ క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్సీటీసీ). ఇలా ఎందుకూ అంటే. ఈ రైలు వారణాసిలోని కాశీ విశ్వనాధుడి నుంచి ప్రారంభమై.. ఇండోర్ లోని ఓంకారేశ్వరుడి మీదుగా మధ్యప్రదేశ్ లోని మహకాళేశ్వర్ ఆలయాన్ని కలుపుతూ ప్రయాణం సాగిస్తుంది. మూడు జ్యోతిర్లాంగాల మీదుగా ప్రయాణం సాగించే ఈ రైలుకు కాశీ మహాకాల్ ఎక్స్ ప్రెస్ గా నామకరణం చేశారు. దీంతో దేశంలో మూడో ప్రైవేటు రైలు ప్రయాణానికి రంగం సిద్ధమైంది.

ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించనున్న ఈ రైలు ఈ నెల 16న ప్రారంభం కానుంది. ఈ రైలు సర్వీసు 20వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుందని అధికారులు ప్రకటించారు. కాగా, ‘కాశీ మహాకాల్‌ ఎక్స్‌ప్రెస్’ వారణాసి-ఇండోర్‌ల మధ్య వారానికి మూడు రోజుల పాటు సేవలను అందిచనుంది. మూడు జ్యోతిర్లింగాలైన ఓంకారేశ్వర్ (ఇండోర్‌, మధ్యప్రదేశ్‌)‌, మహాకాళేశ్వర్‌ (ఉజ్జయిని, మధ్యప్రదేశ్‌), కాశీ విశ్వనాథ (వారణాసి, ఉత్తర్‌ప్రదేశ్‌)లతో సహా...  ఇండోర్‌, భోపాల్‌ వంటి పారిశ్రామిక, విద్యా కేంద్రాలను కలుపుతూ ఈ రైలు ప్రయాణిస్తుందని అధికారులు వివరించారు. అంతేకాకుండా దీనిలో ప్రయాణికులకు రూ.10 లక్షల ప్రయాణ బీమా సౌకర్యం వర్తిస్తుందని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles