AP govt to bring Ordinance on capital bills శాసనసభ, మండలికి ప్రోరోగ్.. ఆర్డీనెన్సుకు అవకాశం..

Governor prorogues ap legislative council and assembly makes way for ordinance

AP Governor, Biswabhusan Harichandan, YS Jagan, YCP Government, ap legislative council, AP Legislative Assembly, Mohd Ahmed Shariff, CRDA Repeal bill, Decentralisation bill, Andhra Pradesh Capital, Select Committee, Andhra Pradesh, Politics

In an interesting development, the governor of Andhra Pradesh has prorogued the legislative council. Governor Biswabhusan Harichandan has issued a notification to this extent, which has become the boon for the government to bring ordinance on decentralization and CRDA repeal bills.

శాసనసభ, మండలికి దీర్ఘకాలిక సెలవు.. ఆర్డీనెన్సుకు అవకాశం..

Posted: 02/13/2020 06:59 PM IST
Governor prorogues ap legislative council and assembly makes way for ordinance

మూడు రాజధానుల పాలనా వికేంద్రీకరణ బిల్లు, రాజధాని అమరావతి అభివృద్ది మండలి ఏపీసీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై త్వరలో ఆర్డినెన్సులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం శరవేగంగా పావులు కదిపిందా.? అంటే ఔననక తప్పదు. అమరావతినే పూర్తిస్థాయి రాజధానిగా చేయాలని అక్కడి ప్రజలు గత 58రోజులుగా నిరసన దీక్షలు చేపడుతున్న క్రమంలో విపక్షపార్టీలకు చెక్ పెడుతూ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం చెక్ పెట్టిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మూడు రాజధానుల అంశంతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అర్డినెస్సును జారీ చేస్తోందన్న వార్తలు జోరందుకున్నాయి.  

శానసమండలిలో సంఖ్యాబలం వున్న విపక్ష టీడీపీ.. అభివృద్ది వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీఏ బిల్లులకు మోకాలడ్డుతోందని భావించిన ప్రభుత్వం.. వాటిని మండలిలో అమోదం చేసుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించి.. విఫలమైంది. దీంతో మండలిని రద్దు చేయాలన్న అమోదాన్ని కూడా కేంద్రానికి పంపింది. అయితే అప్పటికే ఈ రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపుతూ మండలి చైర్మన్ షరీప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వెనక్కు తగ్గిన ప్రభుత్వం.. శరవేగంగా ముందుకు దూసుకెళ్లేందుకు పావులు కదుపుతోంది.

ఈ రెండు బిల్లులపై ఇక అర్డినెన్సును తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు శాసన మండలిని కూడా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రోరోడ్ చేశారు. ఉభయ సభలకు దీర్ఘకాలిక సెలవు ప్రకటిస్తూ ఆయన బుధవారమే నోటిఫికేషన్ విడుదల చేశారు. అసెంబ్లీలో అమోదం పోందిన ఈ బిల్లులను మండలిలో అమోదం లభించకపోయినా ప్రోరోగ్ చేయడం ద్వారా వాటిపై అర్డినెన్సును రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావచ్చు.

ప్రోరోగ్ అంటే ఏమిటీ.?

ప్రొరోగ్ అంటే దీర్ఘకాలిక సెలవు అని అర్థం. సభ సమావేశాలు ముగియడం లేదా పరిసమాప్తం కావడాన్ని ప్రొరోగ్ అంటారు. పార్లమెంటు ఉభయ సభలను (లోక్ సభ, రాజ్యసభ) రాష్ర్టపతి, అసెంబ్లీ, మండలిని గవర్నర్ దీర్ఘకాలిక వాయిదా వేస్తారు. తిరిగి రాష్ర్టపతి / గవర్నర్ పిలుపు ఇచ్చేంతవరకు సభలు వాయిదా పడతాయి. అయితే ప్రొరోగ్ మేర గరిష్ట సెలవు ఆరు నెలలు మాత్రమే వాయిదా పడతాయి. ఆరు నెలల తరువాత దీర్ఘకాలిక సెలవు గడువు తీరిపోయి మళ్లీ సభల్లో సమావేశాలు పునరుద్దరణ గావించబడతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles