TTD officials desicion, cut in Kalyanosthavam Prasadam తిరుమల శ్రీవారి నిత్యకళ్యాణ ప్రసాదంలో కొత..

Devotees anger on ttd officials with cut in kalyanosthavam prasadam

TTD Board, Tirumala, lord Venkateshwara swamy, Kalyanosthavam, Prasadam, SriVari Kalyanam, Malayappa swamy, Tickets, Big Laddus, small Laddus, Vadas, Cut in Kalyanam Prasadam, Tirumala news

Devotees express theri unpleasure with Tirumala Tirupati Devasthanam desicion, which is followed since Years as a ritual for the devotees who perform Sri Vari Kalyanam at Tirumala.

టీటీడీ తాజా నిర్ణయం: తిరుమల శ్రీవారి నిత్యకళ్యాణ ప్రసాదంలో కొత..

Posted: 02/06/2020 05:44 PM IST
Devotees anger on ttd officials with cut in kalyanosthavam prasadam

కలియుగ ప్రత్యక్ష దైవం.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు నిత్యపెళ్లికొడుకు అన్న విషయం భక్త జనకోటికి తెలిసిందే. తిరుమలలో శ్రీనివాసుడి కళ్యాణం చేయించేందుకు భక్తులు పోటీపడుతుంటారు. తాజా ఉత్తర్వులు మేరకు ఇక దంపతులకు ఇచ్చే ప్రసాదంలో కోత పడింది. స్వామివారి నిత్యకళ్యాణంలో పాల్గోన్న దంపతులకు గత కొన్నేళ్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఒక చక్కని ఆనవాయితినీ కల్పించింది. వెంకట రమణుడి రమనీయమైన కళ్యాణంలో పాల్గోన్న దంపతులకు ఏ ఆర్జిత సేవకు లేని విధంగా పైపంచ, జాకెటు పీసును ఇస్తోంది టీటీడీ.

దీంతో పాటు స్వామివారి కళ్యాణోత్సవంలో జరిపిన భక్తులు.. స్వామివారి దర్శనం చేసుకన్న తరువాత ప్రత్యేక కౌంటర్ల వద్ద ఇచ్చే ప్రత్యేక ప్రసాదంలో కోత విధించి.. ప్రసాదం కావాలంటే అదనపు రుసుం చెల్లించాలని షరతు విధించింది. స్వామివారిని దర్శించుకోడానికి వచ్చే భక్తులకు ఇచ్చే లడ్డూల విషయంలో ధరలు పెంచినా భక్తజనం నిమ్మకుండటంతో టీటీడీ ఈ చర్యలకు ఉపక్రమించింది. తిరుమలకు చేరుకునేందుకు అనేక వ్యయప్రయాసలకోర్చి వచ్చే భక్తుల నెత్తిన శఠగోపాలు పెట్టడం ఎందుకని.. భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఎవరు కోరినా కోరకున్నా భక్తులు ముడుపులు కట్టి శ్రీవారి హుండీలో వేస్తున్నారని.. అయినా ఈ అదనపు ఆంక్షలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

అసలు విషయంలోకి ఎంట్రీ ఇస్తే.. ఇదివరకు స్వామివారి కళ్యాణం చేసిన దంపతులకు 2 పెద్ద లడ్డూలు, 5 చిన్న లడ్డూలు, 2 వడలను దేవస్థానం ప్రసాదంగా అందించేంది. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఇకపై రెండు చిన్న లడ్డూలను మాత్రమే ఇస్తూ కోతపెట్టింది. అంతేకాదు 2 పెద్ద లడ్డూలు, ఐదు చిన్న లడ్డూలు.. రెండు వడలు ఏకంగా పాత పద్దతిలోనే ప్రసాదం కావాలంటే మాత్రం అదనంగా ఆరువందల రూపాయలు చెల్లించాలని భక్తులకు షరతు పెట్టింది. ఇలా షరత్తు పెట్టే కన్నా స్వామి వారి అర్జిత కళ్యాణ సేవకు ధరను పెంచివుంటే బాగుండేదన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి.

ప్రసాదం కావాలంటే తప్పనిసరిగా ఆరు వందలు చెల్లించాలని ప్రసాదాన్ని విడిగా చేసి.. కళ్యాణోత్సవాన్ని విడిగా చేయడం.. కళ్యాణ ప్రసాదానికి వున్న పవిత్రతను, ప్రాశస్త్యాన్ని తగ్గించమే అవుతుందని అంటున్నారు భక్తులు. ఏళ్లుగా కళ్యాణం జరిపే భక్తులకు వస్తున్న ఆనవాయితీకి జగన్ సర్కార్ తిలోదకాలు ఇప్పించడం సహేతుకంగా లేదని భక్తులు అభిప్రాయపడుతున్నారు. శ్రీవారి మనోభావాలను పట్టించుకుని టీటీడీ నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక మరికొందరు మాత్రం.. ‘ఏం చేస్తామని నిట్టూర్చుతూ.. అదనపు డబ్బును చెల్లించి ప్రసాదాలను తీసుకుంటున్నాం’ అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles