PM Modi attacks Congress on CAA in LokSabha నెహ్రూ కూడా మతవాదేనా.? కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన ప్రధాని మోడీ

Nehru was in favour of protecting minorities in pak was he communal pm modi attacks congress on caa

Narendra Modi on Jawaharlal Nehru, Narendra Modi on Mahatma Gandhi, Narendra Modi on Hinduism, PM Modi in Parliament, PM modi on Father of Nation, Narendra Modi, Mahatma Gandhi, Father of Nation, Jawaharlal Nehru, BJP, Congress, Ananth Kumar Hedge, Lok Sabha, Parliament, National, Politics

Pandit Nehru himself was in favour of protecting minorities in Pakistan, I want to ask Congress, was Pandit Nehru communal? Did he want a Hindu Rashtra?: Those who are talking about respect for the Constitution never even implemented it in Jammu and Kashmir for so many decades: PM Modi on CAA

ITEMVIDEOS: నెహ్రూ కూడా మతవాదేనా.? కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన ప్రధాని మోడీ

Posted: 02/06/2020 02:52 PM IST
Nehru was in favour of protecting minorities in pak was he communal pm modi attacks congress on caa

పౌరహక్కు సవరణ చట్టాన్ని తీసుకురావడంతో పలు దేశాలలో వున్న మైనారిటీలకు భారత్ ఆశ్రయం కల్పిస్తోందని ప్రధాని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెబుతూ.. లోక్ సభలో మాట్లాడిన ఆయన రాహుల్ గాంధీపై ట్యూబ్ లైట్ వ్యంగాన్ని ప్రదర్శించారు. సీఏఏ వ్యతిరేక నిరసనల్లో కొందరు నేతలు పాల్గోని సెల్పీలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఇక మరికొందరు ప్రత్యర్థులు మాత్రం యువతను తప్పదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఊటంకించారు.

ప్రధానిని మరో ఆరు, ఏడు నెలల తరువాత బయటకే రారని అన్నారు. తమకు ఉపాధి చూపించాలని యువత ఆయనను కర్రలతో కొట్టడంతో తగిలిన గాయాలకు ఆయన తన ఇంటి నుంచి బయటకు రారని అన్నారని.. ప్రధాని తెలిపారు. అయితే తాను ఈ సమయాన్ని మరిన్ని సూర్య నమస్కారాలు చేయడం కోసం వినియోగిస్తానని ప్రధాని అన్నారు. ఈ సూర్య నమస్కారాలతో తాను తిట్లు వినబడకుండా, దెబ్బలు తగలకుండా తయారవుతానని అన్నారు. అయితే ఆరు నెలల ముందుగానే తనకు అడ్వాస్ నోటీసు ఇచ్చినందుకు కృతజ్ఞడనని చమత్కరించారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధాని మోడీ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపగా.. ఆయన రాహుల్ పై ట్యూబ్ లైట్ అంటూ విమర్శలు చేశారు. తాను అరగంట నుంచి సీఏఏపై మాట్లాడుతుండగా, అవతలి పార్టీ నేతలకు ఇప్పుడు వెలిగిందని, అరగంట నుంచి కరెంటు పాస్ అవుతూ ఇప్పుడు అభ్యంతరం చెప్పేలా చేసిందని అన్నారు. చాలా ట్యూబ్ లైట్లు ఇలానే వున్నాయని ఆయన వ్యంగోక్తులు విసిరారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ లోని మైనార్టీలను రక్షించాలని దివంగత ప్రధాని నెహ్రూ కూడా కోరుకున్నారని మోదీ చెప్పారు. ఆయన కూడా మతవాదా.? అని ప్రశ్నించారు.

రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నవారు జమ్ముకశ్మీర్ లో దశాబ్దాల పాటు దాన్ని అమలు చేయలేదని... జమ్ముకశ్మీర్ అల్లుడు, కాంగ్రెస్ నేత శశి థరూర్ అయినా ఈ విషయంలో కొంచెమైనా ఆవేదన వ్యక్తం చేయాలని ఎద్దేవా చేశారు. సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు చేసిన వారిని మీరు జైలుకు పంపలేదని... పైగా ఆ అల్లర్లకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిని కూడా చేశారని మండిపడ్డారు. మరి మీరు చెబుతున్న రాజ్యాంగం అప్పుడేమైందని.? న్యాయం, చట్టం ఏమైందని ప్రశ్నించారు.

మహాత్మాగాంధీపై విమర్శలు గుప్పించారంటూ బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డేకు వ్యతిరేకంగా లోక్ సభలో విపక్ష సభ్యులు ఆందోళన చేయడంతో ప్రధాని నరేంద్రమోదీ లేచి నిల్చుని... అంతేనా? ఇంకా ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. 'మహాత్మాగాంధీ అమర్ రహే' అంటూ నినదించారు. మోదీ ఈ మేరకు స్పందించిన కొన్ని నిమిషాల తర్వాత లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదురి మాట్లాడుతూ, ఇది ట్రైలర్ మాత్రమేనని చెప్పారు. వెంటనే మోదీ కల్పించుకుని... ఇది మీకు ట్రైలర్ మాత్రమే కావచ్చు... మాకు మాత్రం మహాత్మాగాంధీ అంటే ఒక జీవితం అని చెప్పారు. మరి బీజేపి సభ్యుడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.

ఇక లోక్ సభ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బయటకు రాగానే మీడియా ఆయనను చుట్టుముట్టి ఆయనపై ప్రధాని మోడీ చేసిన వ్యంగస్త్రాలపై ప్రశ్నించింది. కాగా దానిపై స్పందించేందుకు నిరాకరించిన రాహుల్.. దేశంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా మారుతుందని.. ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో సాగుతోందని విమర్శించారు. ఈ విషయాలపై ప్రధాని ఎప్పుడు స్పందించరని.. అయితే దేశప్రజల దృష్టి మరల్చేందుకు మాత్రం ఆయన నిత్యం శ్రమిస్తూవుంటారని విమర్శించారు. అలాగే ఇప్పుడు నిరుద్యోగం, ఆర్థిక తిరోగమనంపై మాట్లాడకుండా ఇలా సమస్యను పక్కదారి పట్టించారని రాహుల్ విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh