IT raids on Kadapa TDP president's residence టీడీపీ నేత ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ సోదాలు

It raids on kadapa tdp president srinivasulu reddy s residence

Srinivasula Reddy, TDP, IT Raids, Kadapa TDP President, RK Infra Corp P Ltd, Jubiliee Hills, Panjagutta, Kadapa news, Andhra Pradesh, Crime

The Income Tax officials conducted a series of raids at the residence of Telugu Desam President Srinivasula Reddy in Kadapa district on Thursday morning. A team of 10 IT officers examined several documents related to Srinivas Reddy and inquired about the records of his businesses.

టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడి ఇంటిపై ఐటీ సోదాలు

Posted: 02/06/2020 01:31 PM IST
It raids on kadapa tdp president srinivasulu reddy s residence

ఐటీ శాఖను కేంద్రం తమ రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపుకు వినియోగిస్తుందన్న అరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో.. గత కొన్ని రోజులుగా కేవలం సినీపరిశ్రమ వర్గానికి చెందిన ప్రముఖుల వరకే పరిమితమైయ్యాయి. కాగా రాష్ట్రంలోని రాజకీయ నేతలపై ఐటీ అధికారుల దృష్టి మళ్లింది. తాజాగా కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి నివాసంలోఇవాళ తెల్లవారుజామున ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. 10 మంది ఐటీ అధికారులు బృందం ఆయన నివాసంలో తనిఖీలు చేశారు.

ఇక కడప జిల్లా ద్వారకానగర్ లోని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో తెల్లవారు జామునుంచి జరుగుతున్న సోదాలలో భాగంగా ఐటీ అధికారుల బృందం పలు దస్త్రాలను పరిశీలించింది. ఆయన వ్యాపారానికి సంబంధించిన రికార్డులను తనిఖీ చేసింది. సకాలంలో ఆదాయపుపన్ను చెల్లిస్తున్నారా? అనే వివరాలను అధికారులు పరిశీలన జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఇంటి తలుపులు మూసివేశారు. ఇక ఇంట్లోకి ఎవరూ వెళ్లకుండా.. ఐటీ అధికారుల బృందం తనిఖీలకు అడ్డుపడకుండా ఇంటి బయట పోలీసులు మోహరించారు.

రాజకీయ నేత ప్రవృత్తిగా పెట్టుకున్నా.. ఆయన మాత్రం ప్రముఖ కాంట్రాక్టరన్న విషయం తెలిసిందే.రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా శ్రీనివాస్ రెడ్డి కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. పన్ను ఎగవేతకు సంబంధించిన సమాచారం మేరకు సోదాలు చేస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇంట్లోని పలు రికార్డులు, కంప్యూటర్లు, హార్డ్‌ డిస్క్‌లు పరిశీలించారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంతో పాటు పంజాగుట్టలో శ్రీనివాసుల రెడ్డికి చెందిన ఆర్‌.కె.ఇన్ఫ్రా కార్ప్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్యాలయంలో కూడా సోదాలు కొనసాగుతున్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles