Nirbhaya case: HC says all 4 convicts to be executed together ‘నిర్భయ’ కేసు: దోషులకు వారం గడువు.. అందరికీ ఒకేసారి ‘ఉరి’

Nirbhaya case delhi hc asks convicts to file any plea within a week

Nirbhaya convicts, Execution, Justice Suresh Kait, Delhi High Court, Tihar Jail authorities, Nirbhaya case convicts, Tihar jail, Nirbhaya convicts hanging, Nirbhaya case, Nirbhaya convicts mercy petition, Satish Kumar Arora, Supreme Court, Additional Registrar, deputation basis, nirbhaya murder case Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, Supreme Court, gang-rape, Mount Elizabeth Hospital, Tihar jail, Crime

The Delhi High Court on Wednesday directed the Nirbhaya convicts, waiting on death row, to file any application they want within a week after which authorities should act.

‘నిర్భయ’ కేసు: దోషులకు వారం గడువు.. అందరికీ ఒకేసారి ‘ఉరి’

Posted: 02/05/2020 03:42 PM IST
Nirbhaya case delhi hc asks convicts to file any plea within a week

దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో ఢిల్లీ హైకోర్టు దోషులకు వారం రోజుల వ్యవధిని కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. కేటాయించిన వ్యవధిలోగా దోషులు తాము దాఖుల చేయదలుచుకున్న పిటీషన్లను న్యాయస్థానంలో సమర్పించాలని పేర్కోంది. ఈ సమయంలో దోషులు తమకు న్యాయపరంగా అర్హమైన అన్ని హక్కులను, అన్ని మార్గాలను వినియోగించుకోవాలని న్యాయస్థానం సూచించింది. దోషులు దాఖలు చేసిన పిటీషన్లపై న్యాయస్థాన తీర్పులు వెలువరిచిన తరువాత అధికారులు దోషులపై దాఖలైన డెత్ వారెంట్లపై చర్యలు తీసుకోవచ్చునని పేర్కోంది.

నిర్భయ కేసులోని దోషులకు ఉరిశిక్ష అమలులో జారీ అయిన డెత్ వారెంట్ పై స్టే విధించడాన్ని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తరుపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వేసిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థాని దానిని కొట్టివేసింది. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. శిక్ష నుంచి తప్పించుకునేందుకు, శిక్ష అమలలో జాప్యం జరిగేలా వ్యవహరిస్తూ.. కాలయాపన చేస్తున్నారని.. దీంతో విలువైన న్యాయస్థాన సమయం కూడా వృధా అవుతుందని సాలిసిటర్ జనరల్ తన పిటీషన్లో పేర్కోన్నారు. ఇక ఈ కేసులోని నలుగురు దోషులకు వేర్వేరు తేదీల్లో ఉరి వేయాలన్న ప్రతిపాదనను కూడా కోట్టివేసింది.  

ఈ కేసులో దోషులైన నలుగురు ఒకే నేరానికి పాల్పడినందున.. ఈ తరహా కేసులలో మరణశిక్షను కూడా అందరికీ కలిపి ఒకేసారి విధించాల్సి వుంటుందని, వేర్వేరుగా శిక్షను అమలు చేయడం చట్టప్రకారం సాధ్యం కాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఇక ఈ కేసులో ఢిల్లీలోని పాటియాల కోర్టు జారీ చేసిన స్టేను యథాతధంగా కోనసాగిస్తూ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ కుమార్ ఖైత్ తాజా ఉత్తర్వులను జారీ చేశారు. ఈ కేసులోని దోషులకు తొలుత జనవరి 22న ఉరి శిక్ష విధించాలని న్యాయస్థానం డేత్ వారెంట్ జారీ చేయగా, అది కాస్తా వాయిదా పడి ఫిబ్రవరి 1వ తేదికి చేరింది. ఇక తాజాగా జారీ అయిన డెత్ వారెంట్లపై ఢిల్లీ న్యాయస్థానం స్టే విధించింది. కాగా, తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఇక ఈ నెలలో దోషులకు శిక్ష అములు గ్యారంటీ అన్న సంకేతాలు వెలువడినట్లు అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles