అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నిత్యానంద బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై కర్ణాటక హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం తమ వాదనలు వినిపించింది. బెయిల్ రద్దుకు సంబంధించిన నోటీసులను నిత్యానందకు వ్యక్తిగతంగా ఇవ్వలేకపోయామని, నిత్యానంద ఇప్పుడు ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నాడని కర్ణాటక సర్కారు తెలిపింది.
బెయిల్ రద్దు పిటిషన్ కు సంబంధించిన నోటీసులను నిత్యానంద ఆశ్రమంలో కుమారి అర్చనానందకు ఇచ్చామని సీఐడీ విభాగం అధికారి బాలరాజ్ హైకోర్టుకు విన్నవించారు. కాగా, కుమారి అర్చనానంద ఈ విషయంలో హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశారు. పోలీసులకు తనకు బలవంతంగా నోటీసులు అందించారని అఫిడవిట్ లో పేర్కొన్నారు.
అటు, పిటిషనర్ తరపు న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ, కేసు విచారణ నుంచి తప్పించుకునేందుకే నిత్యానంద పారిపోయాడని ఆరోపించారు. నిత్యానంద ఈక్వెడార్ లో ఆశ్రయం పొందేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం విచారణ ఫిబ్రవరి 5కి వాయిదా వేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 10 | పేదలకు రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నామని గర్వంగా చెప్పుకునే దేశంలో.. రూ.20తో జాతీయ జెండాను కొంటే కానీ రేషన్ ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన ఘటన సంచలనంగా మారింది. ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్` వేళ... Read more
Aug 10 | దేశవ్యాప్తంగా వరుణుడు తన ప్రతాపాన్ని చూపడంతో అనేక రాష్ట్రాలు అతలాకులం అయ్యాయి. జనజీవనం స్థంబించింది. రవాణ సదుపాయం తెగిపోయింది. అయితే వర్షం తగ్గిన వెంటనే ఎమర్జెన్సీ డిజార్టర్ సర్వీసెస్ విభాగం అధికారులు ఎక్కడికక్కడ మరమ్మత్తులు... Read more
Aug 10 | ఎక్కడైనా చేపలు పట్టాలంటే ఎంతో కొంత కష్టపడాలి. చిన్నగా అయితే గాలం వేసి చేప పడేవరకు ఓపికగా ఎదురు చూడాలి. గాలానికి చేప తగలగానే వెంటనే లాగేసి పట్టుకోవాలి. ఇక పెద్దగా అయితే వలలు... Read more
Aug 10 | ప్రజా యుద్ధ నౌక గద్దర్ పాడిన 'బానిసలారా లెండిరా' అనే పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజెన్ల నుంచి ఈ పాటకు విపరీతమైన స్పందన వస్తోంది. ఈ పాటను గద్దర్ స్వయంగా... Read more
Aug 10 | వర్షాకాలం ప్రారంభం నుంచి తన ఉద్దృతిని కొనసాగిస్తున్న వరుణుడు తెలంగాణలో కాసింత ఊరట కల్పించాడు. తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలతో సాధారణ వర్షపాతం బదులు అత్యధిక వర్షపాతం నమోదు చేసిన వరుణుడు.. ఎట్టకేలకు... Read more