BSNL cheap recharge prepaid plans బీఎస్ఎన్ఎల్ నుంచి రెండు అద్భుతమైన ఫ్లాన్లు..

Bsnl rs 108 and rs 1999 prepaid plans launched

bsnl 2019,bsnl latest news in hindi,bsnl offer,bsnl plan,bsnl news alerts,

Government telecom company BSNL has launched two new prepaid plans in view of increasing competition. In which users will get long validity with more data. The new prepaid plan launched by BSNL includes Rs 108 and Rs 1,999 plans.

బీఎస్ఎన్ఎల్ బంఫర్ ఆపర్: కారుచౌకగా డాటా.. అన్ లిమిటెడ్ కాల్స్..

Posted: 01/30/2020 06:57 PM IST
Bsnl rs 108 and rs 1999 prepaid plans launched

ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ టారిఫ్ ల విషయంలో ఎంతో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఓ వైపు ప్రైవేటు టెలికాం సంస్థలు తమ టారిఫ్ రేట్లను పెంచుకుంటూ ముందుకెళ్తుండగా, బీఎస్ఎన్ఎల్ మాత్రం అత్యంత చౌకతో తమ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఫ్రకటించే సరికొత్త ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ద్వారా కేవలం రూ.108కే 28 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటాను అందించనుంది. వారేవ్వా ఇకనేం మనం కూడా బీఎస్ఎన్ఎల్ కు మారిపోదాం అనుకుంటున్నారా.? అయితే ఇక్కడే ఒక మెలిక పెట్టింది ప్రభుత్వ టెలికాం సంస్థ.

అదేంటి అంటే.. ప్రస్తుతానికి ఈ ప్లాన్ కేవలం కేరళ, చెన్నై సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే త్వరలోనే మిగతా సర్కిళ్లలో కూడా ఈ ప్లాన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్లాన్ ద్వారా అందించే లాభాల విషయానికి వస్తే.. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. రోజుకు 1 జీబీ డేటాను బీఎస్ఎన్ఎల్ అందిస్తుంది. కాల్స్ విషయానికి వస్తే ఎయిర్ టెల్, వొడాఫోన్ తరహాలో అన్ లిమిటెడ్ కాలింగ్ ను ఇందులో అందించడం లేదు. కాలింగ్ కోసం రోజుకు 250 నిమిషాలను ఇందులో అందిస్తారు. 500 ఎస్ఎంఎస్ లను అందిస్తారు.

దీంతో పాటు బీఎస్ఎన్ఎల్ రిపబ్లిక్ డే ఆఫర్ ను కూడా అందిస్తుంది. ఈ ఆఫర్ జనవరి 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది. ఇందులో భాగంగా బీఎస్ఎన్ఎల్ రూ.1,999 ప్లాన్‌ను రీచార్జ్ చేసుకుంటే రోజుకు 3 జీబీ డేటాను 436 రోజుల పాటు అందిస్తారు. దీంతోపాటు అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్ లను అందిస్తారు. మీకు నచ్చిన పాటను రింగ్ బ్యాంక్ టోన్ గా(PRBT) పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. వీటితోపాటు బీఎస్ఎన్ఎల్ టీవీ యాప్ కు యాక్సెస్ ను కూడా దీని ద్వారా అందిస్తారు.

కాబట్టి మీరు ఏదైనా వార్షిక ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే మరో 14 నెలల పాటు మీరు మరో ప్లాన్ తో రీచార్జ్ చేసుకోవాల్సిన పని ఉండదు. అయితే అదనపు వ్యాలిడిటీ కావాలంటే మాత్రం మీరు ఫిబ్రవరి 15వ తేదీలోపు రీచార్జ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఆఫర్ అప్పటితో ముగుస్తుంది మరి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bsnl 2019  bsnl latest news in hindi  bsnl offer  bsnl plan  bsnl news alerts  

Other Articles