India confirms its first coronavirus case in Kerala దేశంలో నమోదైన తొలి కరోనా కేసు..

Coronavirus update kerala reports first confirmed case in india

Coronavirus, Coronavirus update, Cornavirus death toll, India reports first coronavirus case, Coronavirus case in kerala, Cornavirus death toll, Coronavirus Death Count, china virus, coronavirus outbreak, Kerala

India reported its first positive case of novel coronavirus (nCoV). The Union ministry of health and family welfare in an official statement said a student from Kerala, who was studying in Wuhan University and travelled to India, has tested positive for the virus.

దేశంలో నమోదైన తొలి కరోనా కేసు.. అరోగ్యశాఖ ధృవీకరణ

Posted: 01/30/2020 05:59 PM IST
Coronavirus update kerala reports first confirmed case in india

భారతీయులు భాయందోళన నిజమైంది. ఏది జరగొద్దని.. కోరుకున్నారో.. అదే జరిగింది. విస్తృతంగా సోకుతూ.. రోజుల వ్యవధిలో మనుషుల ప్రాణాలను హరించేస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ భారత్ లోకి ప్రవేశించింది. ఇది కూడా అనుమానాస్పద కేసుగానే స్వీకరించిన వైద్యులు.. తగు పరీక్షలు చేసిన తరువాత ఇది కరోనా వ్యాధే అని నిర్థారించారు. దీంతో భారత్ లో తొలి కేసు నమోదైంది. చైనాలోని వూహన్‌(wuhan) యూనివర్సిటీలో చదువుతున్న కేరళ విద్యార్థికి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది.

విద్యార్థిని వైద్య బృందం పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే వూహన్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసిస్తున్న ఈ విద్యార్ధి కరోనా కలకలం నేపథ్యంలో అందోళనచెంది భారత్‌ తిరిగివచ్చాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి స్థిమితంగా ఉందని, వైద్యాధికారుల పర్యవేక్షణలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే త్రిపురకు చెందిన ఓ వ్యక్తి కరోనా బారిన పడి మలేషియా ఆసుపత్రిలో మృతి చెందినట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

భారత్‌లోని పలు రాష్ట్రాల్లో కరోనా లక్షణాలతో అనుమానితులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. చైనా నుంచి భారత్‌ వచ్చిన వారిలో కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారి రక్తనమూనాలను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ విభాగానికి పంపించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నివేదిక నెగిటివ్‌గా వస్తే వారిని వెంటనే డిశ్చార్జి చేస్తున్నారు. కాగా, కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ అనుమానాలతో 400మందికి పైగా వ్యక్తులను ఇళ్లలోనే ఉంచారు. డాక్టర్ల పర్యవేక్షణలో వారంతా ఉన్నారు. ఇక ఢిల్లీ, ముంబై నగరాల్లోని ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్లో ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles