Karate Kalyani files complaint at cyber crime police నటి కరాటే కళ్యాణికి అగంతకుల వేధింపులు..

Actress karate kalyani files complaint at cyber crime police on abusive messages

Actress, Karate Kalyani, abusive messages, compliant, cyber crime police, Hyderabad, Telangana, Politics

Tollywood Actress Karate Kalyani files a complaint on recieving abusive messages and call from some phone numbers to at cyber crime police.

నటి కరాటే కళ్యాణికి అగంతకుల వేధింపులు.. కేసు నమోదు

Posted: 01/30/2020 12:22 PM IST
Actress karate kalyani files complaint at cyber crime police on abusive messages

హీరో రవితేజ నటించిన కృష్ణ చిత్రంలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం పక్కన బాబీ అంటూ పేరును సాగదీసే క్రమంలో ఒక్కసారిగా పాపులర్ అయిన నటి కరాటే కల్యాణికి అగంతకుల నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. గ‌త కొంత కాలంగా సినిమాలు త‌గ్గిపోవ‌డంతో బుల్లితెర‌ని న‌మ్ముకుని అక్క‌డ వ‌రుస సీరియ‌ల్స్‌లో న‌టిస్తోంది. ఎంతో ధృడంగా, దైర్యంగా కనిపించే ఈ నటిని నేరుగా ఎదుర్కొనలేక కొందరు అగంతకులు అమెను వెనక నుండి దాడి చేస్తున్నారు.

అదీనూ నేరుగా కాకుండా దొంగచాటుగా.. ఎలాంటి వివరాలు తెలియకుండా.. అమెను ఇబ్బందులను గురిచేస్తున్నారు. ఈ విషయమై అమె కొంతకాలం క్రితం హెచ్చరికలు కూడా చేశారు. అయినా అగంతకుల బద్ది మాత్రం వక్రమార్గం వీడటం లేదు. దీంతో అమె హెచ్చరికలు వచ్చిన వెంటనే కొన్ని రోజుల పాటు నెమ్మదించిన అగంతకులు.. ఆ తరువాత మరింతగా జోరు పెంచి అత్యంత గుజుస్పాకరమైన సందేశాలు అస‌భ్య‌క‌ర వీడియోలు, ఫొటోలు పంపిస్తూ అస‌భ్య ప‌ద‌జాలంతో వేధిస్తున్నారు.

దీంతో కరాటే కళ్యాణి ఇవాళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనను నిత్యం వేధిస్తున్న వారిపై కేసు న‌మోదు చేశారు. తన ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తున్నారని, పలు సైట్లలో తన మార్ఫింగ్ చేసిన ఫోటోలను కూడా అప్ లోడ్ చేశారని ఈ సందర్భంగా పోలీసులకు అమె పిర్యాదు చేశారు. గ‌త కొన్ని రోజులుగా క్రైస్త‌వ సంఘాల ప్ర‌తినిధులపేరుతో హిందువుల మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచే విధంగా వీడియోల‌ని యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ల‌లో పోస్ట్ చేస్తున్నార‌ని ఫిర్యాదు చేశారు. కాగా కళ్యాణి పిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితులు ఎవరా అన్న విషయం ఆస‌క్తిక‌రంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress  Karate Kalyani  abusive messages  compliant  cyber crime police  Hyderabad  Telangana  Politics  

Other Articles