sunita moves High Court for CBI probe into Viveka's murder వైఎస్ వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు ఎందుకంటే: సునీత

Ys viveka daughter moves high court for cbi probe into her dad s murder case

YS Vivekananda Reddy, Murder, Daughter, Narreddy Sunitha,Chandrababu Naidu, Security, CBI, High Court, YSRCP Government, YS Jagan, AP CM, Andhra Pradesh, Politics

In a development that caused embarrassment to Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy, his cousin Narreddy Sunitha moved the High Court seeking a CBI probe into the murder of her father YS Vivekananda Reddy, a former Parliamentarian, last year.

వైఎస్ వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు ఎందుకంటే: సునీత

Posted: 01/30/2020 11:27 AM IST
Ys viveka daughter moves high court for cbi probe into her dad s murder case

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించనందునే తన తండ్రి హత్యకేసును సిబిఐకి అప్పగించాలని కోరుతున్నట్లు వివేకా కూతురు సునీత తెలిపారు. ఈ మేరకు ఆమె హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాచ్ మెన్ రంగన్న ఇంటిని చూసుకోకుండా రాత్రంతా ఎలా నిద్రపోయారు.? హత్య గురించి తెలియదని రంగన్న అంటున్నారు. ఆ రోజు రాత్రి ఏమైనా అరుపులు.. కేకలు విన్నారా.? అన్న విషయాలను కూడా ఆయన వెల్లడించలేదని అమె పేర్కోన్నారు.

ఇక తాను పి.రాజశేఖర్ అనే వ్యక్తి ఎప్పుడు వస్తారనే విషయాన్ని తెలుసుకునేందుకు 2019 మార్చి 14న తాను ఫోన్ చేసిన విషయాన్ని కూడా రంగన్న నిరాకరిస్తున్నారని, ఈ విషయాన్ని కూడా పోలీసులు ఇప్పటి వరకు తేల్చలేకపోయారని అమె అన్నారు. తన తండ్రి తల, శరీరంపై లోతైన గాయాలు వున్నాయని, వాటి సంఖ్యను గమనిస్తే.. ఈ దాడిలో ఒకరు కంటే ఎక్కువ మంది పోల్గొన్నట్లు తెలుస్తోందని అన్నారు. అగంతకుల దాడి నుంచి వివేక తప్పించుకునేందుక కూడా ప్రయత్నించినట్లు అర్థమవుతోందని.. ఆ సమయంలోనూ వాచ్ మెన్ రంగన్న ఏం చేస్తున్నారని.. అసలు రంగన్న వుండగా అగంతకులు ఎలా వచ్చారు.. ఎలా తప్పించుకున్నారని అని కూడా సునిత ప్రశ్నిస్తున్నారు.

వివేకా మృతదేహంపై గాయాలున్నా గుండెపోటుతో మరణం అంటూ మీడియాలో ఎలా ప్రసారమైంది.? హత్య జరిగిన మరుసటి రోజున ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సిఐ ఘటనాస్థలికి వెళ్లి వివేకా ఒంటిపై వున్న గాయాలను పరిశీలించిన తరువాత కూడా అది అనుమానాస్పద మరణంగా ఎలా నమోదు చేశారు. హత్య జరిగి మనిషి చనిపోయిన తరువాత డాక్టర్ వివేకా మృతదేహం వున్న పడకగదిలో ఎందుకున్నారు.? గదిలో రక్తపు మరకలను శుభ్రం చేయాలని లక్ష్మమ్యను ఎర్రగంగిరెడ్డి ఎందుకు ఆదేశించారు. సాక్ష్యాధారాలను మాయం చేశారన్న అభియోగాలను ఎందుకు మోపలేదు.? అని సునిత తన పిటీషన్ లో పేర్కోన్నారు.

ఇక విచారణ చేస్తున్న సిట్ ను మూడు పర్యాయాలు ఎందుకు మార్చారని.. అడిషనల్ డీజీ స్థాయి అధికారి నుంచి దానిని ఎస్పీ స్థాయి అధికారికి మార్చడానికి కారణాలను ఏంటని ప్రశ్నించారు. వివేకా హత్యకేసు జరిగి 10 నెలలు గడుస్తున్నా.. పురోగతి గురించి పోలీసులు ఎందుకు మాట్లాడటం లేదు? హత్యలో ప్రధాన అనుమానితుడైన వైసీపీ నేత పరమేశ్వరరెడ్డి... హత్య జరిగిన తర్వాత ఉదయం ఆసుపత్రిలో చేరి ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని ఎందుకు కలిశారు? ఇలా పలు అనుమానాలను సునీత తన పిటిషన్ లో వ్యక్తం చేశారు. వీటన్నింటి నేపథ్యంలో విచారణ సవ్యంగా జరగాలన్నా, వాస్తవాలు వెలుగులోకి రావాలన్నా సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరారు.

ఇక దీంతో పాటు తన తండ్రిని హతమార్చిన హంతకుల నుంచి తమకు కూడా ప్రాణహాని వుందని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు, తన భర్త నర్రెడ్డి రాజశేఖర్ కు సాయుధ రక్షణ కల్పించాలని కోరుతూ గతేడాది నవంబరు 21న డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు రాసిన లేఖను కూడా జతపర్చారు. వివేకా హత్య కేసును సీబీఐకు అప్పగించాలని విన్నవిస్తూ రెండు రోజుల కిందట హైకోర్టులో వేసిన పిటిషన్‌తో పాటు ఈ లేఖను ఆమె జతపరిచారు. ఇక ఈ కేసులో కీలకమైన శ్రీనివాసరెడ్డి హత్య నేపథ్యంలో.. పరమేశ్వరరెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, రంగయ్యల ప్రాణాలకు కూడా ముప్పు ఉందన్న అమె లేఖలో అనుమానాన్ని వ్యక్తం చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Vivekananda Reddy  Narreddy Sunitha  Chandrababu  Security  CBI  High Court  YS Jagan  Andhra Pradesh  Politics  

Other Articles