Another farmer dies of Heart Attack in Mangalagiri అమరావతి కోసం ఆందోళన.. ఆగిన మరో రైతు గుండె..

Andhra farmer who took part in protest against amaravati capital shift move dies of heart attack

navaluru, Rangishetty Venkateshwar Rao, Nara Lokesh, Amaravati JAC, Mangalagiri magistrate, AndhraPradesh Assembly, Amaravati, three capital, State Assembly, joint action committee, YS Jagan, Capitals, Visakhapatnam, kurnool, committee report, executive capital, legislative capital, judicial capital, Vijayawada, farmers, Andhra Pradesh, Politics

Another Young farmer, who took part in the ongoing stir by Ryots against the move to shift the Andhra Pradesh capital to Visakhapatnam, died of heart attack with the forum spearheading the agitation holding the state government responsible for it.

అమరావతి కోసం ఆందోళన.. ఆగిన మరో రైతు గుండె..

Posted: 01/28/2020 05:26 PM IST
Andhra farmer who took part in protest against amaravati capital shift move dies of heart attack

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన మూడు రాజధానుల బిల్లును మండలి చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపుతూ నిర్ణయం తీసుకోవడంతో కొంత ఉపశమనం లభించినా.. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా ప్రకటించేవరకు.. సాధించేవరకు తాము అందోళన కార్యక్రమాలను విరమించబోమని అమరావతి ప్రాంత రైతులు నిరనన కార్యక్రమాలు కొనసాగిస్తూనే వున్నారు. రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని మాత్రమే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు అమరావతి సీఆర్డీఏ ప్రాంతంతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలోనూ కోనసాగుతున్నాయి.

మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా రైతులు, మహిళలతో పాటు స్థానిక విద్యార్థి, యువజన జేఏసీ నాయకులు ఆందోళన కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ‘ప్రాణాలైనా అర్పిస్తాం ... అమరావతిని సాధిస్తాం’ అంటూ నినదించారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు రాజధానిని తరలిస్తున్నారన్న మనస్తాపంతో తీవ్ర అందోళనకు గురవుతున్న రైతన్నలు ప్రాణాలను కొల్పుతున్నారు. తాజాగా మంగళగిరి మండలం నవులూరులో రంగిశెట్టి వెంకటేశ్వరరావు అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అందోళనల్లో కొనసాగిన ఆయన తవ్ర మనస్తాపానికి గురై అసువులు బాసారు. రాజధానిపై అందోళనతో ఇవాళ తెల్లవారు జామున ఆయన మృతిచెందినట్లు బంధువులు చెబుతున్నారు. మృతుడి కుటుంబాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పరామర్శించారు. మరోవైపు రాజధాని పరిధిలోని మందడం, తుళ్లూరులో దీక్షలు కొనసాగుతున్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles