No Coronavirus case in Hyderabad: central team తెలంగాణలో కరోనా వైరస్ నమోదు కాలేదు

Corona alert central team reviews safe situation in hyderabad

coronavirus, Rajiv Gandhi International airport, national centre for disease control, coronavirus in hyderabad, Coronavirus alert in Hyderabad, Coronavirus alert, coronavirus patients, central doctors team coronavirus, Hyderabad, Telangana

A three-member central team reviewed the preparedness of the state health authorities in dealing with a possible outbreak of corona virus, amid mounting concern they said there is no single case registered in Hyderabad.

తెలంగాణలో కరోనా కలకలం.. నిజం కాదన్న జాతీయ వైద్యబృందం

Posted: 01/28/2020 06:14 PM IST
Corona alert central team reviews safe situation in hyderabad

కరోనా వైరస్‌ సోకిందన్న వార్తల నేపథ్యంలో ఒక్కసారిగా తెలంగాణ మరీ ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ ప్రాంతంలో కలకలం రేగింది. అయితే అది కేవలం అనుమానాలు మాత్రమేనని, ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ బృందం చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలతో పాటు వైద్యులు కూడా ఊపిరి తీసుకున్నారు. అంతేకాదు తెలంగాణలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదన్న విషయాన్ని కేంద్ర వైద్యుల బృందం స్ఫష్టం చేసింది. కరోనా ప్రభావం కనిపిస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చిన వైద్యుల బృందం ఈరోజు ఫీవర్‌ ఆస్పత్రిని సందర్శించింది.

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకులు అనురాధతో కలిసి కేంద్ర వైద్య బృందం ఫీవర్‌ ఆస్పత్రిని సందర్శించింది. తాజాగా తెలంగాణలోనూ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోందన్న వార్తల నేపథ్యంలో అక్కడ రోగులకు కల్పిస్తున్న వైద్య సేవలు, వసతులపై వైద్య బృందం పరిశీలించింది. అనంతరం రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకులు అనురాధ మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రిలో చేరినంత మాత్రాన కరోనా వైరస్‌ బారినపడినట్లు కాదని అన్నారు. విమానాశ్రయంలో స్క్రీనింగ్‌ ఏర్పాటు చేశామన్నారు.

ఫీవర్‌ ఆస్పత్రిలో ఇప్పుడున్న వసతులతో పాటు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ కి సూచించినట్లు అనురాధ తెలిపారు. కరోనా వైరస్ కు సంబంధించి చికిత్స అందించే విధానంపై ఫీవర్ ఆస్పత్రి వైద్యులకు సూచనలు చేసినట్లు చెప్పారు. త్వరలో కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రితో భేటీ అవుతామని పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఎవరూ అసత్యాలను ప్రచారం చేసి ప్రజల ప్రశాంతతను దెబ్బతీయవద్దని అమె కోరారు.

ఇప్పుడున్న రోగులతోపాటు మంగళవారం మరో ముగ్గురు రోగులు ఆస్పత్రిలో చేరినట్లు ఫీవర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్ శంకర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ముగ్గురు రోగుల పరిస్థితి నిలకడగా ఉందన్నారు. హైదరాబాద్‌లో మొత్తం వంద పడకలతో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసినట్లు అశోక్‌ పేర్కొన్నారు. పరీక్షల నిమిత్తం పంపే రక్తనమూనాలను కొరియర్ ద్వారా పంపుతున్నట్లు చెప్పారు. కరోనా వైరస్‌కు సంబంధించి ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని సూపరింటెండెంట్‌ అశోక్‌ వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles