national flag hoisted reverse by AP Minister తలకిందులుగా జాతీయ పతాకం.. ఏపీ మంత్రి విచారం..

National flag hoisted reverse by andhra pradesh minister

Republic day, flag hoisting, reverse, Avanti Srinivas, Bheemili, Visakhapatnam CM YS Jagan, YSRCP, Andhra Pradesh, Politics

Andhra Pradesh Minister Avanthi Srinivas was in news for a wrong doing, Being a Minister he had not noticed and went ahead to Hoist the flag in resverse way at Bheemili Assembly Constituency of Vishakapatnam district.

తలకిందులుగా జాతీయ పతాకం.. ఏపీ మంత్రి విచారం..

Posted: 01/27/2020 10:55 AM IST
National flag hoisted reverse by andhra pradesh minister

దేశగణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని యావత్ దేశంలోని అనేకప్రాంతాల్లో త్రివర్ణపతాకం రెపరెపలాడింది. నాయకులతో పాటు ప్రముఖులంతా జాతీయ జెండాను ఆవిష్కరించి తమ దేశభక్తిని చాటుకున్నారు. యావత్ దేశయువత కూడా దేశభక్తిని చాటుకుంది. అయితే పలుచోట్ల అపశృతులు కూడా చోటుచేసుకున్నాయి. కాగా, మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఓ మంత్రివర్యులు అవిష్కరించిన జాతీయ పతాకం కూడా ఇలానే వార్తల్లో నిలిచింది. ఆయన మరెవరో కాదు.. ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్. దీంతో విమర్శలను చవిచూడాల్సిన పరిస్థితి ఎదురైంది.

విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీ ఆఫీసులో జరిగింది ఈ ఘటన. జెండాను ఎగరేసి దానికి సెల్యూట్ చేశారు. పైన ఎండకు జెండా ఎగరేసినప్పటికీ తలెత్తి ఎవరూ చూడలేదు. అనంతరం బోలో స్వతంత్ర భారత్ కీ.. అంటూ నినదించారు. జాతీయ పతాకానికి వందనం అర్పించారు. అంతా బాగనే ఉన్నప్పటికీ.. తాము జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగుర వేసిన విషయాన్ని గుర్తించలేకపోయారు. జాతీయ పతాకానికి వందనాన్ని అర్పించిన తరువాత వారు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. కొద్దిసేపటి తరువాత భీమిలీ అధికారులు దీన్ని గమనించారు.

ఆ వెంటనే- జాతీయ పతాకాన్ని కిందికి దించారు. సరిచేసిన తరువాత మరోసారి ఎగురవేశారు.ఈ పొరబాటు జరగడానికి అది కూడా ఓ కారణం కావచ్చు. పార్టీ శ్రేణులు చేసిన పనికి విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురుకావడంతో ఆయన వారిపై మండిపడ్డారు. ఇలా ఎందుకు జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. జాతీయ జెండా కోడ్ ఉల్లంఘించి ఇలా తలకిందులుగా వేలాడదీయడం కొత్తేం కాదు. వ్యక్తుల నిర్లక్ష్యం చాలాసార్లు ఈ పొరబాటు జరిగేలా చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles