Blackmailing, power misuse help TRS win టీఆర్ఎస్ సమర్థ రాజకీయాలు చేయడం లేదు: కాంగ్రెస్

Blackmailing misuse of power help trs landslide win says congress

TRS, telangana municipal election results, CM KCR, KTR, Police, Liquor, Money, Congress MP, Revanth Reddy, media channels, Election commission, Telangana Congress, TRS Government, Telangana, Politics

The Congress party has termed the landslide victory of Ruling TRS in the elections to urban local bodies (ULBs) as a result of “blackmailing tactics” adopted by the ruling party and also misuse of the official machinery.

డబ్బు, మధ్యం, అధికార దుర్వినియోగమే టీఆర్ఎస్ విజయానికి కారణం: కాంగ్రెస్

Posted: 01/25/2020 09:09 PM IST
Blackmailing misuse of power help trs landslide win says congress

రాష్ట్రంలో 25కు పైగా మున్సిపాలిటీల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి 50 శాతం సీట్లు రాలేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. కారు గుర్తుకు తెలంగాణ సమాజం బ్రహ్మరథం పట్టిందని వార్తా ఛానెళ్లు ఎలా ప్రసారం చేస్తాయని ఆయన ప్రశ్నించారు. ‘సరిలేరు నీకెవ్వరూ’ అంటూ సీఎం కేసీఆర్‌కు భజన చేయడానికి కొన్ని న్యూస్ ఛానెళ్లు అమితాసక్తి కనబరుస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ.. ప్రభుత్వ పథకాలనో, కార్యకర్తలనో నమ్ముకొని విజయం సాధించలేదని.. డబ్బులు, మద్యం, పోలీసులు, అధికారుల మీద ఆధారపడి నెగ్గారని ఆయన ఆరోపించారు.

కేసీఆర్, కేటీఆర్ సమర్థత మీద ఆధారపడి ఈ ఎన్నికలు జరగలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రకటన నుంచి రిజర్వేషన్లు, ఎన్నికల తేదీలు, ఫలితాలు అన్నింట్లో అడ్డగోలుగా నియమ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. కాంగ్రెస్‌‌కు నష్టం చేకూర్చేవిధంగా ప్రవర్తించారని మండిపడ్డారు. బ్యాలెట్ పేపర్లను కూడా మాయం చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలిచినట్లు ప్రకటించారని సంచలన ఆరోపణలు చేశారు. ఏ ఎన్నికల్లో అయినా కేసీఆర్ ఎన్నుకున్న ఆయుధం ‘బ్లాక్ మెయిల్’ అని.. ఓడిపోతే పదవులు ఊడిపోతాయని తమ మంత్రులను స్వయంగా కేసీఆరే బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు.

రాష్ట్రంలో ఎక్కడా తిరగనని కేటీఆర్ చెప్పారని.. ఒక సిరిసిల్లలోనే ప్రచారం చేసుకున్నారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేటీఆర్ ప్రచారం చేసిన సిరిసిల్లలో ఆయనకు, టీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా 10 మంది స్వతంత్రులు గెలిచారని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లోనూ టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా 6 మంది స్వతంత్రులు గెలిచారని తెలిపిన రేవంత్ రెడ్డి.. బ్రేకింగ్ న్యూస్ ఇదని చెప్పారు. ‘కేసీఆర్, కేటీఆర్‌కు వాళ్ల సొంత నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఎదురైతే.. మీ న్యూస్ ఛానెళ్లలో కనీసం ఒక్క లైన్ స్క్రోలింగ్ అయినా పెట్టారా?’ అని రేవంత్ ప్రశ్నించారు.

ప్రచారం సందర్భంగా మంత్రులు మాట్లాడిన భాషపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘టీఆర్‌ఎస్ ఓడిపోతే.. మీ పని పడతాం.. బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ నోటు చేసుకుంటున్నం’ అంటూ మంత్రి ఎర్రబెల్లి ఓటర్లను బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. ఎన్నికల అధికారులు ఆయనపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదని నిలదీశారు. ఎన్నికల్లో విజయానికి కార్యకర్తలను, ప్రజలను కేసీఆర్ నమ్ముకోలేదని, డబ్బు, మద్యం, పోలీసులు, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ అధికారులపై ఆయన ఆధారపడి విజయం సాధించారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పెట్టిన పెట్టుబడి డబ్బు, పోలీసులు, మద్యం, ఎన్నికల నిర్వహణ అధికారులు అని ఆరోపించారు.

ఏమీ చేతగానట్టు ఎందుకు ఉన్నారు?

మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, గంగుల కమలాకర్ కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని రేవంత్ చెప్పారు. టీఆర్‌ఎస్‌ను గెలిపించకుంటే మున్సిపాలిటీలను ముంచుతామని బ్లాక్ మెయిల్ చేశారని తెలిపారు. వారికి నోటీసులు ఎందుకు ఇవ్వలేదని, వివరణ ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. మంత్రి మల్లారెడ్డి బేరసారాల వ్యవహారం స్వయంగా ఆ పార్టీ కార్యకర్తల ద్వారానే బయటకు వస్తే.. ఎన్నికల అధికారులు ఏమీ చేతగానట్టు అచేతనంగా ఎందుకు పడి ఉన్నారో సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.

హుజూర్ నగర్ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే బస్సు ఛార్జీలు, మందు ధరలు పెరుగుతాయని ప్రజలను హెచ్చరించామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అయినా వినకుండా అధికార పార్టీనే గెలిపించారని.. ఆ కొద్ది రోజులకే ఫలితాన్ని చూశారని చెప్పారు. కనీసం ఈ ఎన్నికల్లో అయినా గెలిపిస్తారని చూస్తే.. ఏవేవో కారణాలతో టీఆర్‌ఎస్ పార్టీయే గెలిచిందని.. త్వరలోనే ఆ ఫలితాలను కూడా చూస్తారని ప్రజలను హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles