Twist in Ameenpur minor girl Gang rape case వీడిన గ్యాంగ్ రేప్ మిస్టరీ.. అబద్దమాడిన మైనర్ బాలిక..

Sangareddy police chase ameenpur minor girl sexually assault twist

rape, Gangrape, Another Disha Case, minor girl, sexually assault, ameempur disha case, ameenpur gangrape, sangareddy gangrape, chakrapuri colony gangrape case, ameenpur minor gangrape, vaninagar gangrape case, sangareddy district, Telangana, Crime

Telangana police chased the sensational s*exual assault case of Ameenpur minor girl on Friday. According to the police reports, the minor girl went to a movie with a person named Sandeep and later she played a drama of s*xual assault after scared of her mother.

ITEMVIDEOS: వీడిన గ్యాంగ్ రేప్ మిస్టరీ.. అబద్దమాడిన మైనర్ బాలిక.. అమ్మ మందలిస్తుందనే..

Posted: 01/24/2020 06:53 PM IST
Sangareddy police chase ameenpur minor girl sexually assault twist

సంచలనం రేపిన అమీన్ పూర్ దిశ కేసును పోలీసులు 24 గంటలు కూడా గడవకుండానే చేధించారు. నలుగరు యువకులు తనను కారులో ఎక్కించుకుని వెళ్లి.. సమీపంలోని నిర్జన ప్రాంతంలో సామూహికంగా అత్యాచారం చేశారని, మద్యం సీసాలు కూడా ఘటనాస్థలంలోనే వున్నాయని బాలిక చెప్పిన విషయమంతా కట్టుకథగా తేల్చారు పోలీసులు. బాయ్ ఫ్రెండ్ తో సినిమాకు వెళ్లిన మైనర్ బాలిక అమ్మ మందలిస్తుందనే అబద్దమాడిందని.. అందుకోసం గ్యాంగ్ రేప్ డ్రామాకు తెరలేపిందని పోలీసులు తేలిపారు.

బాధితురాలైన మైనర్ బాలికపై అత్యాచారం జరగలేదని ప్రభుత్వాసుపత్రిలోని వైద్యులు ఇచ్చిన నివేదికతోనే నిన్న సాయంత్రామే ఈ కేసులో ట్విస్టు ఏదో వుందని గ్రహించారు పోలీసులు. అయితే బాలికను విచారించడంతో పాటు స్థానికంగా గల సీసీ కెమెరా ఫూటేజీలను పరిశీలించిన తరువాత ఈ కేసులో ఏం జరిగిందన్న విషయంలో క్లారిటీకి వచ్చారు పోలీసులు. అయితే అబద్దం చెప్పిన బాధితురాలైన మైనర్ బాలికకు పోలీసులు కౌన్సిలింగ్ కల్పించారు. అదే సమయంలో బాలికను సినిమాకు తీసుకెళ్లిన యువకుడితో పాటు బాలిక ఇంటి యజమానిపై పోస్కో యాక్టు కింద కేసులు నమోదు చేశారు.

మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిందన్న విషయంలో ఒక్కసారిగా సంచలనం రేపగా.. రంగంలోకి దిగిన సంగారెడ్డి పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అక్కడ పడివున్న మద్యం సీసాలను సేకరించారు. బాధితురాలైన బాలికను వైద్య పరీక్షల నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అమెకు పరీక్షలు చేసి అమెపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని చెప్పారు. దీంతో ఈ కేసులో ట్విస్టు తేలిసిపోవడంతో పోలీసులు మరో రకంగా బాలిక నుంచి సమాచారం రాబట్టేందుకు అమెను విచారించారు.

బాధిత బాలిక అబద్దం చెప్పింది కానీ నిజం పోలీసులకు తెలిసిపోవడంతో తప్పించుకోవాలని చూసింది. తనపై అత్యాచారయత్నం మాత్రమే జరిగిందని మాటమార్చింది. దీంతో పోలీసులు బాలికను సముదాయించి మెల్లిగా వివరాలు రాబట్టారు. అయితే కొన్ని వివరాలు మాత్రమే చెప్పిన బాలిక పూర్తివివరాలను మాత్రం వెల్లడించలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు బాలిక చెప్పిన వివరాలతో సీసీటీవీ ఫూటేజీని పరిశీలించారు. బాలికకు మున్సిఫల్ ఎన్నికల సందర్భంగా పరిచయమైన సందీప్ అనే యువకుడు పరిచయం అయ్యాడని, అతడితో కలసి గురువారం ఉదయం మార్కింగ్ షో సినిమాకు వెళ్లిందని సిసిటీవీ ఫూటేజీల ఆధారంగా నిర్థారించుకున్నారు.

అందుకోసం ఇంట్లోంచి ఒంటరిగా బయటకు వచ్చిన యువతి కొంతదూరం వరకు రాగానే అప్పటికే అక్కడి సందీప్ బైక్ పై వెయిట్ చేస్తున్నాడు. అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్లిన బాలిక.. అక్కడి నుంచి సందీప్ బైక్ ఎక్కి వెళ్లింది. మియాపూర్ లోని టాకీటౌన్ థియేటర్ లో సినిమా చూశారు. సినిమా వదిలిన అనంతరం నేరుగా కాకుండా దొడ్డి మార్గంలో అత్యాచార ఘటన జరిగిందని చెప్పిన స్థలానికి చేరకున్నాక అక్కడ బాలికను దింపేసి సందీప్ వెళ్లాడు. బాలిక మాత్రం అమ్మను తనను మందలిస్తుందని భయంతో అబద్దాలు చెప్పింది.

ఇంటికి రావడానికి ఆలస్యం కావడంతో తల్లిదండ్రులకు భయపడ్డ బాలిక.. గుర్తు తెలియని వ్యక్తులు తనను కారులో పొదల్లోకి లాక్కెల్లారని.. అక్కడ తనపై అత్యాచారం చేశారని.. అబద్ధం చెప్పిందని పోలీసులు తెలిపారు. దీంతో బాలికను సినిమాకు తీసుకెళ్ళిన సందీప్ ను  అదుపులోకి తీసుకుని విచారించగా అతను కూడా అదే విషయాన్ని చెప్పాడు. తాము ఇద్దరం కలసి సినిమాకు వెళ్లామని, సినిమా అయిపోగానే అక్కడి నుంచి తిరిగి వచ్చేశామన్నన్నారు. అయితే అత్యాచార ఘటనల్లో బాధితురాలిని.. అందులోనూ ముఖ్యంగా మైనర్ బాలిక అని కూడా చూడకుండా అమె ఫోటోలను, వీడియోలను నెట్టింట్లో పెట్టి వైరల్ చేసిన ఇంటి యజమాని రవిపై కూడా ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Nvs reddy key statements on hyderabad metro rail second phase and routes

  మెట్రో రైలు రెండో దశపై ఎన్వీఎస్ రెడ్డి కీలక ప్రకటన

  Feb 25 | హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి సంబంధించి మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. మెట్రో రెండు దశలో భాగంగా.. శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) వరకు... Read more

 • Nirbhaya case supreme court defers hearing of centre s appeal to march 5

  ‘నిర్భయ’ కేసు: దోషులకు ఈ సారైనా శిక్ష అమలయ్యేనా.?

  Feb 25 | దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులు మరోమారు శిక్ష నుంచి తప్పించుకున్నట్లేనా.? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే దోషులు శిక్షను తప్పించుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషించడంతో పాటు ఏకంగా తలను జైలు... Read more

 • Irctc archanam tour train from secundrabad to tirumala

  ఐఆర్సీటీసీ అర్చనం టూర్.. సికింద్రాబాద్ నుంచి తిరుమల

  Feb 25 | తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-ఇఆర్సీటీసీ మరో శుభవార్త చెప్పింది. తిరుమల వెళ్లాలనుకుంటున్నారా? తిరుపతి టూర్ ప్లాన్ చేస్తున్నారా? మీకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం... Read more

 • Couple from hyderabad and one other killed in car crash in dallas

  అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువారి దుర్మరణం

  Feb 25 | అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువాళ్లు దుర్మరణం పాలయ్యారు. ఎదురుగా వస్తున్న ఫోర్డ్ కారు అతివేగంగా వచ్చి తెలుగువారు ప్రయాణిస్తున్న అక్యూర కారును ఢీకొన్నడంతో.. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.... Read more

 • Us first lady melania trump arrives at govt school to attend happiness class

  ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో్ల మెలానియా.. పిల్లలతో సరదాగా..

  Feb 25 | అమెరికా ప్రథమ మహిళా మెలానియా ట్రంప్ ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. దక్షిణ మోతీబాగ్‌ ప్రాంతంలోని సర్వోదయ కో ఎడ్యుకేషనల్‌ సీనియర్‌ సెకండరీ పాఠశాలకు వచ్చిన మెలానియాకు అక్కడి విద్యార్థులు, సిబ్బంది ఘన స్వాగతం... Read more

Today on Telugu Wishesh