Bandh in Amaravati continues for second day గుంటూరు, కృష్ణలలో రెండో రోజు కొనసాగుతున్న బంద్

Bandh in amaravati continues for second day against decentralisation of capital

YS Jagan, Amaravati, Bandh, Krishna, Guntur, Amaravati JAC, Student Leaders, Farmers, Three Capitals, Mangalagiri, mandadam, Tulluru, Andhra Pradesh, Politics

The bandh call given by Amaravati Parirakshna Joint Action Committee (JAC), which is opposing the AP Decentralisation of Governance and Inclusive Development of all Regions Bill-2020, continues for the second day in Krishna and Guntur Districts.

గుంటూరు, కృష్ణలలో రెండో రోజు కొనసాగుతున్న బంద్

Posted: 01/22/2020 10:36 AM IST
Bandh in amaravati continues for second day against decentralisation of capital

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని.. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ అమరావతి సహా గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరుసగా రెండో రోజు బంద్ కొనసాగుతోంది. సదరు గ్రామస్థులు స్వచ్ఛంధంగా దుకాణాలు మూసివేసి బంద్ లో పాల్గొంటున్నారు. అమరావతి రాజధాని పరిరక్షణ సమితో పాటు అమరావతి రాజకీయ జేఏసీ పిలుపుమేరకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో స్వచ్ఛందంగా బంద్‌ కొనసాగుతోంది.

మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా విద్యార్థి, యువజన ఐకాస నాయకులు  గుంటూరులో బంద్‌ చేపట్టారు. ఎన్టీఆర్‌ కూడలి వద్ద కళాశాల, పాఠశాలల బస్సులను అడ్డుకుని విద్యార్థులను ఇళ్లకు పంపించారు. గుంటూరు  జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. కాగా, బంద్ నేపథ్యంలో గుంటూరు బృందావన్‌ గార్డెన్స్‌ ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బంద్‌ లో భాగంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ నేత జీవీ ఆంజనేయులుతో పాటు పలువురిని అరెస్టు చేసి వాహనాల్లో తరలించారు.

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో అమోదించిన మూడు రాజధానుల నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ తో తాము బంద్ నిర్వహిస్తున్నామని విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు. అప్పటి వరకు తమ పోరాటం ఆగదని విద్యార్థి నేతలు తేల్చి చెబుతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం తమ మొండి వైఖరిని వీడి ప్రజల ఆంకాక్షల మేరకు అమరావతిలో ప్రజారాజధానిని నిర్మించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... శాసనమండలి పరిణామాల ద్వారా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయగలమనే పట్టుదల పెరిగిందన్నారు. నిన్నటి వరకు రాజధాని ప్రాంతాల్లో పర్యటించిన డొక్కా మాణిక్య వరప్రసాద్‌ కీలక సమయంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడాన్ని తప్పుబట్టారు. ఇదిలావుండగా బంద్‌కు ఎలాంటి అనుమతులు లేవని గుంటూరు అర్బన్‌ ఎస్పీ రామకృష్ణ, గ్రామీణ ఎస్పీ విజయరావు తెలిపారు. బంద్‌ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని, ఆందోళనకారులు దుకాణాలు, పాఠశాలలు బలవంతంగా మూయించవద్దని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  Amaravati  Bandh  Krishna  Guntur  Amaravati JAC  Three Capitals  Andhra Pradesh  Politics  

Other Articles