Will dethrone YSRCP govt: Pawan Kalyan వైపీపీ సర్కార్ పై పవన్ కల్యాణ్ ఫైర్

Amaravati will remain capital of ap pawan kalyan

Pawan Kalyan, Amaravati farmers, Mangalagiri Head Quarters, janasena, YCP Government, cm ys jagan, amaravati, YCP MLAs, Andhra Pradesh, latest news

JanaSena president Pawan Kalyan said that the downfall for the YCP government, which is synonymous with faction culture, has started. Addressing party workers at the party headquarters, he said with the announcement of shifting of the capital city, the countdown for YCP government started.

వైసీపీ ప్రభుత్వం కూలిపోయేవరకు నిద్రపోను: పవన్ కల్యాణ్

Posted: 01/21/2020 04:02 PM IST
Amaravati will remain capital of ap pawan kalyan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు అంతు లేకుండా పోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టి, నిరంకుశ ధోరణితో పాలిస్తున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు తాను నిద్రపోనని తెలిపారు. వైసీపీ పార్టీ నాశనం మొదలైందని చెప్పారు. అమరావతికి భూములు ఇచ్చిన ఆడపడుచుల చేత కన్నీరు పెట్టించారని... వారి శాపాలు ఊరికే పోవని అన్నారు. పోలీసుల ముసుగులో రౌడీ మూకలు చేరిపోయాయి. రాజధాని కోసం ఇచ్చిన భూములను పనికి రాకుండా చేసి.. రైతులపై, మహిళలపై లాఠీలు విరిగేలా కొట్టిన వారిని.. ఆ భగవంతుడు ఉపేక్షించడు’’ అని ఉద్వేగభరితంగా పవన్ ప్రసంగించారు.

మంగళగిరి జనసేన కార్యాలయంలో రాజధాని రైతులతో సమావేశం సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. కిరణ్ నాయక్ అనే రైతు గురించి చెబుతూ.. వైసీపీ సర్కార్‌పై మండిపడ్డారు. ‘ఇదా పాలన?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ నాయక్‌పై పోలీసుల లాఠీ చార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కిరణ్ రాజధాని కోసం అర ఎకరం భూమి ఇచ్చాడని.. ఆయనకు మాటలు రావని.. పోలీసులు దాడి చేస్తుంటే.. గట్టిగా అరిచి తన బాధను వ్యక్తం చేయలేకపోయాడని వాపోయారు. రైతుల కష్టాలు వింటుంటే దుఃఖం తన్నుకొచ్చిందని.. ఆ కన్నీటిని లోపలే అణచుకున్నానంటూ గద్గద స్వరంతో పవన్ వ్యాఖ్యానించారు.

కానీ కిరణ్ బాధను విశ్వాన్నేలే ఆ భగవంతుడు వింటాడు. తను బయటకు చెప్పుకోలేని బాధను ఆయన వినగలడు. ఇది వైసీపీ సర్వనాశనానికి దారి తీస్తుంది. మీకు ద్రోహం చేసిన ప్రతి ఒక్కడూ నాశనం అయ్యే వరకు జనసేన పనిచేస్తుంది. మీ కుటుంబాల్లో ఆవేదన కలిగించి.. కన్నీళ్లు పెట్టించిన ప్రతి ఒక్కరూ నాశనం అవుతారు. ఇది క్షమించలేనిదని పవన్ అవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు చేయాలని వైసీపీ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి ఇదే తొలి, చివరి అధికారమని... ఇకపై వారికి రాష్ట్రంలో అధికారం ఉండదని అన్నారు. రాజధానిని అమరావతి నుంచి ఎవరూ తరలించలేరని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Amaravati farmers  Mangalagiri  janasena  YCP Government  cm ys jagan  Andhra Pradesh  

Other Articles