TDP MP Galla Jayadev Arrested during March గుంటూరు సబ్ జైలులో ఎంపీ గల్లా.. బెయిల్ లభించేనా..?

Tdp mp galla jayadev remanded moved to guntur sub jail

Galla Jayadev detained, Guntur Sub Jail, Chalo Assembly, Amaravati JAC, Mangalagiri magistrate, bail denied, Kesineni Nani, Andhra Pradesh Assembly, Amaravati, three capital, State Assembly, mandadam, tension, joint action committee, YS Jagan, Capitals, Visakhapatnam, kurnool, committee report, executive capital, legislative capital, judicial capital, Jagan Mohan reddy, Vijayawada, farmers, Andhra Pradesh, Politics

TDP MP Galla Jayadev who participated in an Chalo assembly rally had been detained. The police registered non-bailable cases against him and arrested him. Subsequently, the police produced the MP before Mangalagiri magistrate and shifted to Guntur jail.

గుంటూరు సబ్ జైలులో ఎంపీ గల్లా.. ఖండించిన కేశినేని..

Posted: 01/21/2020 11:52 AM IST
Tdp mp galla jayadev remanded moved to guntur sub jail

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని.. డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులతో పాటు అమరావతి రాజధాని పరిరక్షణ కమిటీ జేఏసీ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడికి జేఏసీ నేతలతో పాటు టీడీపీ శ్రేణులతో కలసి బయలుదేరిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ముందుగా పోలిస్ స్టేషన్ తరలించిన తరువాత ఆయనపై నాన్ బెయిలెబుల్ కేసులను నమోదు చేసిన పోలీసులు ఇవాళ ఉదయం గుంటూరు జిల్లా సబ్ జైలుకు తరలించారు.

గల్లా జయదేవ్ విషయంలో ఏం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే.. అసెంబ్లీని ముట్టడించేందుకు బయలుదేరిన గల్లా జయదేవ్ ను పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ వరకు చేరుకున్న ఆయనపై అక్కడే పోలీసులు అనుచితంగా వ్యవహరించారు. ఆయన చోక్కాను కూడా చించారు. అయినా ఆయన అమరావతి విషయంలో వెనక్కు తగ్గకపోవడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ తరువాత పలు పోలిస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. ఈ సమయంలోనే ఆయనపై నాన్ బెయిలెబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. అర్థరాత్రి సమయంలో మంగళగిరి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.

దీంతో గల్లా జయదేవ్ కు మెజిస్ట్రేట్ 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధించారు. అర్థరాత్రి సమయం అరెస్టు చేయడంతో ఆ సమయంలో జైలుకు తరలించడం కుదరకపోవడంతో ఇవాళ ఉధయం గల్లా జయదేవ్ ను గుంటూరు సబ్ జైలుకు తరలించారు. కాగా, మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చిన సమయంలో తనకు బెయిల్ కేటాయించాలని ఆయన కోరారు. అయితే జయదేవ్ చేసిన అభ్యర్థనను మేజిస్ట్రేట్ తిరస్కరించారు. ఈ ఉదయం ఆయన మరోసారి బెయిల్ పిటిషన్ ను దాఖలు చేయనున్నారు. అంతకుముందు ఓ పోలీస్ స్టేషన్ లో గల్లా జయదేవ్ తనపై పోలీసులు చేసిన దాడి.. తగిలిన గాయాలు.. చిరిగిన చొక్కాను మీడియాకు చూపించారు.

తమ ఎంపీ గల్లా జయదేవ్ ను అరెస్ట్ చేయడాన్ని టీడీపీ పార్లమెంటు సభ్యుడు కేశినేని ఖండించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షలో భాగంగా చేశారని మండిపడ్డారు. జయదేవ్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో మూడు రాజధానుల బిల్లును ఏపీ అసెంబ్లీ అమోదించిన నేపథ్యంలో స్పందించిన ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని ఎంత మంది రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారో తాజాగా ఓ జాతీయ మీడియా నిర్వహించిన సర్వేలో స్పష్టమతుందని వెల్లడించారు.

టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ ద్వారా ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాజధాని నిర్ణయం తీసుకున్నారని విమర్శిస్తూ.. ఓ పోస్టును పెట్టారు. సీఎం జగన్, ఆయన గ్యాంగ్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం తప్పు అని ఇండియా టీవీ నిర్వహించి సర్వే స్పష్టం చేసిందని చెప్పారు. 67 శాతం మంది జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిపారు. దీంతో పాటు ఇండియా టీవీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వివరాలను షేర్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles