CBN, 17 TDP MLAs taken into police custody చంద్రబాబును డొంక రోడ్లలో తిప్పిన పోలీసులు..

Chandrababu released in mangalagiri town after midnight high drama by police

N Chandrababu detained, Andhra Pradesh Assembly, Amaravati, three capital, State Assembly, mandadam, tension, joint action committee, YS Jagan, Capitals, Visakhapatnam, kurnool, committee report, executive capital, legislative capital, judicial capital, vanta varpu, Amaravati bandh, Jagan Mohan reddy, Vijayawada, farmers, Capital city, Amaravati, agitation, Andhra Pradesh, Politics

Telugu Desam Party (TDP) chief N Chandrababu Naidu, who was detained outside the state assembly, was released after two hours in Mangalagiri town. Chandrababu Naidu, along with his convoy has left for his residence.

అర్థరాత్రి చంద్రబాబును డొంక రోడ్లలో తిప్పిన పోలీసులు..

Posted: 01/21/2020 10:44 AM IST
Chandrababu released in mangalagiri town after midnight high drama by police

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని.. మూడు రాజధానులతో అభివృద్ది జరగదని చేతులు జోడించి అడుగుతున్నాను అర్థం చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు క్రితం రోజున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని అభ్యర్థించిన విషయం తెలిసిందే. ఆ తరువాత సభలో టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో ఆయన కూడా వాకౌట్ చేశారు. అయితే ఇలా వాకౌట్ చేసిన తరువాతే అసలు హైడ్రామా సాగిందని టీడీపీ శ్రేణులు అరోపిస్తున్నారు. తమ అధినేతను అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు గంటల పాటు డొంక రోడ్లతో తిప్పారని అరోపిస్తున్నారు.

అసలేం జరిగిందంటే.. అర్థరాత్రి పోలీసులు హైడ్రామాకు తెరతీసారని, ఇందుకు వెలగపూడి సచివాలయం మౌనసాక్షిగా మారింది. అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన తరువాత, చంద్రబాబు, తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వెలగపూడి నుంచి మందడం వరకూ పాదయాత్రను తలపెట్టగా, పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డులో సీఎం కాన్వాయ్ వెళ్లనున్న కారణంగా పాదయాత్రకు, నిరసనలకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో, వారితో చంద్రబాబు వాగ్వాదానికి దిగారు. తాను పోలీసుల లాఠీచార్జ్ లో గాయపడిన రైతులను పరామర్శించేందుకు వెళుతున్నానని, తనను ఎందుకు అడ్డుకుంటున్నారని చంద్రబాబు ప్రశ్నించారు.

కాగా అదే సమయానికి అసెంబ్లీలో సీఎం జగన్ ప్రసంగం ముగియడంతో, ఆయన అదే దారిపై వస్తారని ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు, చంద్రబాబును, ఇతర నేతలను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించి, వ్యాన్ ఎక్కించారు. ఆపై చంద్రబాబును ఆయన ఇంటి సమీపం వరకూ తీసుకెళ్లిన తరువాత, కిలోమీటర్ దూరంలో వ్యాన్ దారి మళ్లించారు. రెండు గంటల పాటు డొంక రోడ్డు, ఇతర దారుల్లో 20 కిలోమీటర్లకు పైగా తిప్పారు. సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి కరకట్టవైపు కాకుండా వెంకటపాలెం వైపు వాహనాన్ని పోనిచ్చారు. ఆపై మళ్లీ మందడం పక్కనున్న కృష్ణాయపాలెంవైపు తీసుకెళ్లారు.

డొంకరోడ్డు గతుకుల్లో 3 కిలోమీటర్ల ప్రయాణం తరువాత, కృష్ణాయపాలెం నుంచి ఎర్రబాలెం మీదుగా మంగళగిరి వైపు తీసుకెళ్లారు. మంగళగిరి వీధుల్లో తిప్పుతున్న సమయంలో వ్యాన్ ను బలవంతంగా ఆపించి, కిందకు దిగిన ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవి, స్వామి తదితరులు నడిరోడ్డుపై బైఠాయించి, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆపై చంద్రబాబు మరోసారి పాదయాత్రను తలపెట్టగా, పోలీసులు మంగళగిరి పోలీసు స్టేషన్ వద్ద అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతించేది లేదని స్పష్టం చేస్తూ, పీఎస్ నుంచి ఆయన కాన్వాయ్ లోనే చంద్రబాబును ఇంటికి పంపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles