YS Jagan takes a nap in Assembly అసెంబ్లీలో కునుకుతీసిన సీఎం జగన్..

Ap cm ys jagan takes a nap in assembly during hot debate on capital

YS Jagan, Nap in Assembly, jagan sleeps in Assembly, Amaravati, Tension, Amaravati farmers, Galla Jayadev, Guntur, TDP MP, Lathi Charge, high power committe, ap cabinet, mandadam, tension, Tension, Temples, joint action committee, YS Jagan, Capitals, Visakhapatnam, kurnool, committee report, executive capital, legislative capital, judicial capital, vanta varpu, Amaravati bandh, Jagan Mohan reddy, Vijayawada, farmers, Capital city, Amaravati, agitation, Andhra Pradesh, Politics

Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy repeats the same scene, which he had done as an opposition leader during summer Assembly session of 2017 on March 18th and today also he does the same. He takes a nap during Assembly session while hot debate is going-on on Capitals of the State.

ITEMVIDEOS: అప్పుడు ప్రతిపక్షనేతగా.. ఇప్పుడు సీఎంగా.. అసెంబ్లీలో కునుకుపాట్లు

Posted: 01/20/2020 05:57 PM IST
Ap cm ys jagan takes a nap in assembly during hot debate on capital

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానుల విషయంతో పాటు అధికార వికేంద్రీకరణ అంశమై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడి వేడిగా చర్చ జరుగుతోంది. ఈ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను గతంలో ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు చేసిన పనినే రిపీట్ చేశాడు. అదేంటి.. అప్పట్లో ఏం చేశాడనేగా మీ డౌట్.? అక్కడికే వస్తున్నాం. సరిగ్గా 2017 మార్చి 18వ తేదీని అసెంబ్లీలో వేసివికాల సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టాల్సిన జగన్.. ఊరూరా పాదయాత్రలు చేస్తూ.. అలసిపోయి కూడా అసెంబ్లీకి హాజరయ్యారు.

అయితే అసెంబ్లీలో చల్లని ఏసీకి ఆయన కాస్తా కునుకు తీశాడు. అప్పట్లో దీనిపై టీడీపీ శ్రేణులు, మిగిలిన విపక్ష పార్టీల నేతలు కూడా జగన్ ను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేశాయి. అయితే కొందరు మాత్రం జగన్ కు మద్దతుగానే పోస్టులు పెట్టారు. అయితే తాజాగా ఇవాళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో కూడా జగన్ అలేగే కునుకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఓ వైపు అమరావతిలో రైతులు రోడ్లపైకి వచ్చి అందోళనలు చేస్తుంటే.. మరోవైపు మీరు నిద్రపోతారా.? అంటూ సీఎం జగన్ ను నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకరి తర్వాత మాట్లాడుతుండగా.. మంత్రి బుగ్గన సభ దృష్టికి పలు విషయాలను తీసుకువస్తున్న సమయంలో, సీఎం జగన్ కాసేపు తలవాల్చారు. ఓవైపు రాజధానులపై అసెంబ్లీలో కీలక చర్చ, బయట రాజధాని రైతుల ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రం యావత్తూ సమావేశాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. అలాగే రాజకీయాల్లో నాయకులు చేసే ప్రతి చర్యనూ ప్రత్యర్థులు ఓ కంట కనిపెట్టి ఉంటారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కునుకుపాటుపై ప్రత్యర్థులు సెటైర్ వేసేస్తున్నారు.  

జగన్ కునుకుతీత ఫొటో మీడియాలో వచ్చిన వెంటనే మాజీ మంత్రి, టీడీపీ నాయకులు నారా లోకేశ్ స్పందించారు. ‘‘ఓ పక్క రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు రోడ్డెక్కి అసెంబ్లీని ముట్టడిస్తుంటే.. మరో పక్క రాష్ట్రం మొత్తం టీవీలు చూస్తుంటే.. ఈ మనిషికి ఇలా ఎలా నిద్రపడుతోంది?’’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్టుకు ‘సేవ్ అమరావతి, నా రాజధాని అమరావతి, ఏపీ విత్ అమరావతి’ అని హ్యాష్ ట్యాగ్‌లు జోడించారు.

అలాగే సీఎం జగన్ కునుకుపాటుపై నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది ప్రజాసమస్య వేదికనా? లేక శయన పాన్పు వేదికనా అంటూ ఓ జనసేన అభిమాని పోస్టు చేశారు. ‘‘రైతులకి నిద్ర లేకుండా చేసారుగా.. మీకు ఎక్కడున్నా ఇట్టే నిద్ర పట్టేస్తుంది జగన్ గారు’’ అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు. ఇలా ఎవరికి తోచినట్లు వారు సీఎం జగన్‌పై ప్రత్యర్థి పార్టీలకు చెందిన కార్యకర్తలు పోస్టులు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles