Lathi Charge on Amaravati Farmers at assembly అమరావతి రైతులపై విరిగిన లాఠీ.. టీడీపీ ఎంపీకీ తప్పని పరాభవం

Lathi charge on amaravati farmers after ap cabinet apporves three capitals

Amaravati, Tension, Amaravati farmers, Galla Jayadev, Guntur, TDP MP, Lathi Charge, high power committe, ap cabinet, mandadam, tension, Tension, Temples, joint action committee, YS Jagan, Capitals, Visakhapatnam, kurnool, committee report, executive capital, legislative capital, judicial capital, vanta varpu, Amaravati bandh, Jagan Mohan reddy, Vijayawada, farmers, Capital city, Amaravati, agitation, Andhra Pradesh, Politics

Amaravati farmers including women and children broke police hurdles, checkposts and pickets to Andhra Pradesh Assembly second gate inspite of JAC leaders Chalo Assembly call, Police lathi charged local when they tried to enter Assembly, in which Guntur MP Galla Jayadev Shirt was also toren.

అమరావతి రైతులపై విరిగిన లాఠీ.. టీడీపీ ఎంపీకీ తప్పని పరాభవం

Posted: 01/20/2020 03:14 PM IST
Lathi charge on amaravati farmers after ap cabinet apporves three capitals

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆయ ప్రాంత రైతులు చేస్తున్న అందోళనలు, నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో అమరావతిలో క్యాబినెట్ భేటి, ప్రత్యేక అసెంబ్లీకి ఏర్పాటు చేసిన క్రమంలో అమరావతి గ్రామాల ప్రజలు తమ గళాన్ని వినిపించేందుకు గట్టిగా ప్రయత్నం చేశారు. ఇవాళ అమరావతి పరిరక్షణ సమితి, జేఏసీ నేతలతో పాటు టీడీపీ పార్టీ కూడా ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది.

దీంతో భారీ స్థాయిలో ఎక్కడికక్కడ మోహరించిన పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా నేతలను గృహనిర్భంధంలోకి తీసుకున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంచణీయ ఘటన చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. గ్రామాల నుంచి ప్రజలు కూడా బయటకు రాకుండా కంచెలను ఏర్పాటు చేసినా..  పోలీసు ఆంక్షలు, కాకీ కవాతులు, ముళ్ల కంచెలను లెక్క చేయకుండా సచివాలయం రెండో గేటు సమీపానికి రైతులు దూసుకొచ్చారు.

మందడం నుంచి పొలాల మీదుగా చిన్నా పెద్దా అక్కడికి తరలివచ్చారు. దారివెంబడి ఉన్న ముళ్ల చెట్లను దాటుకొని భారీగా తరలివచ్చారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. జాతీయ జెండాను చేతబట్టిన రైతులు, మహిళలు పోలీసుల చర్యను నిరసిస్తూ పంట కాల్వలో దిగి నిరసన చేపట్టారు. ప్రాణ సమానమైన భూములను రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేస్తే.. ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అంటూ మండిపడ్డారు.

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పట్ల పోలీసులు అనుచిత వైఖరి

అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి భారీగా రైతులు తరలివస్తున్నారు. అసెంబ్లీ కాంప్లెక్స్‌ను నలువైపులా రైతులు చుట్టుముట్టారు. దీంతో రైతులపై పోలీసులు విరుచుకుపడ్డారు. అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు లాఠీఛార్జికి దిగారు. మరోవైపు పోలీసుల ఆంక్షలు తెంచుకుని రైతులు నలువైపులా సచివాలయాన్ని ముట్టడించారు. సచివాలయం మెయిన్‌ గేట్‌ దగ్గరకు రాజధాని రైతులు చేరుకున్నారు. రైతులు సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకుంటున్నారు.

దీంతో రైతలు, పోలీసులు మధ్య తోపులాట జరిగింది. సచివాలయం ఎదుట కాలువలోకి దిగి రైతులు, మహిళల నిరసనకు దిగారు. మీడియా దూరంగా వెళ్లిపోవాలంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. రైతులు, నేతలపై పోలీసులు విరుచుకుపడ్డారు. అసెంబ్లీ పరిసరాల్లో రైతులపై లాఠీఛార్జీ చేశారు. ఈ క్రమంలో రైతులకు మద్దతుగా వచ్చిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై కూడా పోలీసులు దాడికి దిగారు. పోలీసులు గల్లా చొక్కాను చించారు. పోలీసుల ఆంక్షలు లెక్కచేయకుండా సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు రైతులు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles