Protester at pro-CAA rally assaults Rajgarh DC బీజేపి కార్యకర్తకు ఢిప్యూటీ కలక్టర్ చెంపదెబ్బ .!

Dc priya verma slaps unruly bjp workers during caa supporting rally

priya verma, pro caa rally, priya verma, rajgarh dc rally slaps, priya verma bjp, priya verma pro caa rally, madhya pradesh, Politics

A pro-CAA rally, organised by the BJP at Rajgarh in Madhya Pradesh, took a violent turn on Sunday when participants allegedly attacked police and officials present following which the administrative officials took on the 'unruly' crowd.

ITEMVIDEOS: బీజేపి కార్యకర్త చెంపచెల్లుమనింపించిన ఢిప్యూటీ కలక్టర్.!

Posted: 01/20/2020 02:17 PM IST
Dc priya verma slaps unruly bjp workers during caa supporting rally

సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం)కు అనుకూలంగా భారతీయ జనతా పార్టీ (బీజేపి) పిలుపునిచ్చిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. పోలీసులు చాకచక్యంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఉద్రిక్తతలు చల్లారాయి. ఈ ర్యాలీలో ఓ బీజేపి కార్యకర్త డిఫ్యూటీ కలెక్టర్ అధికారిపై అనుచితంగా ప్రపర్తించడంతో ఆయనకు అమె అక్కడే చుట్టూ బీజేపి శ్రేణులుండగానే బుద్దిచెప్పింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ జిల్లా ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ జిల్లా ప్రధాన రహదారిపై పౌరసత్వ సవరణ చట్టానికి సానుకూలంగా బీజేపీ చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. ర్యాలీకి ముందస్తు అనుమతి లేకపోవడంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో బీజేపి కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోనికి తీసుకువచ్చేందుకు ఘటనాస్థలానికి చేరుకున్న డిప్యూటీ కలక్టర్ ప్రియావర్మ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు.

విషయం తెలుసుకున్న ప్రియావర్మ అక్కడికి రాగా, ఓ వ్యక్తి, ఆమెను జుట్టుపట్టుకుని లాగి, దాడి చేశాడు. ఆ వెంటనే పోలీసులు ఆమెను రక్షించగా, కాసేపటికే తన జుట్టును లాగిన వ్యక్తిని ప్రియావర్మ గుర్తించారు. మహిళపై అసభ్యకరంగా ప్రవర్తిస్తావా? అంటూ, అతని చెంప చెల్లుమనిపించారు. ఒకటి కాదు రెండు మూడు పర్యాయాలు అమె అతన్ని చెంపదెబ్బలు కొట్టారు. దీంతో అక్కడికి చేరకున్న బీజేపి శ్రేణులు సదరు కార్యకర్తను అక్కడి నుంచి తప్పించి.. ఢిప్యూటీ కలక్టర్ పై తిరగబడ్డారు.

క్షణాల్లో పోలీసులు అమెకు రక్షణగా చేరుకున్నారు. దీంతో డిఫ్యూటీ కలక్టర్ ప్రియా వర్మపై బీజేపి నేతలు, కార్యకర్తల తిరుగుబాటును అడ్డుకోగలగడంలోసఫలీకృతులయ్యారు. కాగా, ఈ డిప్యూటీ కలక్టర్ పై దాడి ఘటనకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనకు దారితీసిన కారణాలపై నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఇప్పడీ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh