Tension prevails in Amaravati surrounding villages అట్టుడుకుతోన్న అమరావతి.. భారీగా పోలీసుల మోహరింపు

Tension prevails in amaravati as ap cabinet apporves three capitals

Amaravati, Tension, Amaravati farmers, high power committe, ap cabinet, mandadam, tension, Tension, Temples, joint action committee, YS Jagan, Capitals, Visakhapatnam, kurnool, committee report, executive capital, legislative capital, judicial capital, vanta varpu, Amaravati bandh, Jagan Mohan reddy, Andhra Pradesh vs Telangana, national interest, Vijayawada, farmers, Capital city, Amaravati, agitation, Andhra Pradesh, Politics

Tension prevails in Amaravati villages as Andhra Pradesh Cabinet approves high power committee report which states decentralisation of ruling making visakhapatnam the executive capital and amaravathi as legislative capital.

అట్టుడుకుతోన్న అమరావతి.. భారీగా పోలీసుల మోహరింపు

Posted: 01/20/2020 01:05 PM IST
Tension prevails in amaravati as ap cabinet apporves three capitals

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆయ ప్రాంత రైతులు చేస్తున్న అందోళనలు, నిరసన కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతిలో క్యాబినెట్ భేటి, ప్రత్యేక అసెంబ్లీకి ఏర్పాటు క్రమంలో అధికార, విపక్ష సభ్యులు రాకతో భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. ఎక్కడ ఎలాంటి అవాంచణీయ ఘటన చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అమరావతి జేఏసీ, టీడీపీ పార్టీలు ఛలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో ఆ ప్రాంతం అట్టుడుకుతోంది.

అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో టీడీపీ, అమరావతి జేఏసీలు ఛలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో  పోలీసులు ముందస్తుచర్యలను చేపట్టారు. అమరాపతి రాజధాని పరిరక్షణ సమతి సభ్యులతో పాటు జేఏసీ నేతలను, వీరితో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలను, నాయకులను గృహనిర్భంధంలోకి తీసుకున్నారు. ఈ చర్యలను ఖండించిన చంద్రబాబు.. ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం కాలరాస్తుందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల పౌర హక్కులకు విఘాతం కలుగుతుందని మండిపడ్డారు.

అయితే అసెంబ్లీ సమావేశాలకు ఎలాంటి అవాంతరాలు కలుగకుండా అమరావతిని పోలీసలు వలయం చుట్టముట్టి పహారా కాస్తోంది. ఓ వైపు పోలీసుల పహారా.. మరోవైపు రాజధాని గ్రామాల్లో రగులుతున్న ఆగ్రహం నేపథ్యంలో అమరావతి పరిసరాల్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఆ పరిసరాల్లో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు యాక్టివ్ గా ఉండే టీడీపీ నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసారు. రాజధాని గ్రామాల్లో ఆంక్షలు విధించారు. ప్రతీ దారిలోనూ పోలీసులు భారీగా కనిపిస్తున్నారు. ప్రకాశం బ్యారేజి మీద సామాన్యలు రాకపోకల పైన నిఘా పెట్టారు. షాడో టీంలు గస్తీ కాస్తుండగా, అసెంబ్లీ ప్రాంగణంలో కూడా ముందస్తు చర్యలు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles