Nirbhaya’s mother hits out on Indira Jaising ‘మీ వల్లే న్యాయం దక్కడం లేదు’: న్యాయవాదిపై నిర్భయ తల్లి పైర్..

How dare she nirbhaya s mother blasts indira jaising on forgive convicts remark

Nirbhaya's mother blasts Indira Jaising, Nirbhaya's mother on 'forgive convicts' remark, Nirbhaya's mother on death sentence, death penalty, December 16 gang rape, gang rape, indira jaising, nirbhaya, rajiv gandhi, sonia gandhi, National, crime

Nirbhaya's mother Asha Devi lashed out at senior advocate Indira Jaising for her suggestion that she should forgive the men on death row who were convicted for the 2012 gang rape of her daughter.

‘‘మీ వల్లే న్యాయం దక్కడం లేదు’’: న్యాయవాదిపై నిర్భయ తల్లి పైర్..

Posted: 01/18/2020 02:55 PM IST
How dare she nirbhaya s mother blasts indira jaising on forgive convicts remark

నిర్భయ దోషులను క్షమించమని కోరిన సీనియర్ మహిళా న్యాయవాది ఇందిరాజైసింగ్ పై నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమార్తెపై సామూహికంగా అత్యాచారం చేసి హతమార్చిన దోషులను క్షమించమని కోరేందుకు లాయర్ ఇందిరాజైసింగ్ ఎవరని, ఆమెకు ఎంత ధైర్యం అని నిర్భయ తల్లి ప్రశ్నించారు. ఇలాంటి వారి వల్లే అత్యాచార బాధితులకు న్యాయం జరగడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉరిశిక్షకు తాను వ్యతిరేకమని, నిర్భయ దోషులను ఆమె తల్లి ఆశాదేవి క్షమించాలని ఆమె కోరారు. ఈ విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీని ఆదర్శంగా తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా సూచించారు.

ఇందిర విజ్ఞప్తిపై స్పందించిన ఆశాదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె అలాంటి సలహా ఎలా ఇవ్వగలరని మండిపడ్డారు. అసలు తనకు సలహా ఇవ్వడానికి ఆమె ఎవరని ప్రశ్నించారు. ఉరి తీయాలని దేశమంతా కోరుకుంటుంటే, క్షమించమనేంత ధైర్యం ఆమె ఎలా చేయగలిగారని మండిపడ్డారు. గతంలో ఇందిరను చాలాసార్లు కలిసినా తన క్షేమ సమాచారాల గురించి ఎప్పుడూ అడగలేదని, ఇప్పుడు మాత్రం దోషుల తరపున వకాల్తా పుచ్చుకుని క్షమించమని కోరుతున్నారని ఆశాదేవి ఫైరయ్యారు.

నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో.. ప్రముఖ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్.. దోషులకు క్షమాభిక్ష పెట్టాలని నిర్భయ తల్లి ఆశాదేవికి  విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆమె భర్త, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషి అయిన నళినిని ఆమె క్షమించారని ఈ సందర్భంగా ఇందిర గుర్తు చేశారు. ఈ విషయంలో ఆశాదేవి పెద్ద మనసు చేసుకోవాలని కోరారు. తన కుమార్తె మరణాన్ని రాజకీయం చేస్తున్నారన్న ఆశాదేవి ఆవేదనలో అర్థం ఉందని, ఈ విషయంలో ఆమెకు తాను పూర్తి మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు.

అయితే, తాను ఉరిశిక్షలకు మాత్రం తాము పూర్తి వ్యతిరేకమని చెప్పిన ఆయన నిర్భయ తల్లి ఆశాదేవిని క్షమాబిక్ష పెట్టాలని కోరారు. దీంతో ఇందిరా జైస్వాల్ వినతిపై తీవ్రంగా స్పందించారు ఆశాదేవి. ఏడేళ్లుగా తమ కూతురుకు జరిగిన అన్యాయం విషయంలో తాను పోరాటం చేస్తుండగా, ఏ ఒక్కరోజు బాధితులమైన తమను పట్టించుకోని అమె.. ఇవాళ నేరగాళ్లకు మద్దతుగా గళం వినిపించడం.. నేరాన్ని ప్రోత్సహించడమేనని అన్నారు. తన కుమార్తె మరణానికి న్యాయం కావాలని ఓ పక్క పోరాడుతుంటే.. మరోవైపు ఇలాంటి న్యాయవాదులు దోషులకు అండగా నిలిచి వారికి సానుభూతిని మూటగట్టే చర్యలను చేపడుతున్నారని అమె దుయ్యబట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles