jsp leader nagababu interesting tweets on ys jagan జగన్ రెడ్డి గారూ అంటూ నాగబాబు ఆసక్తికర ట్వీట్..

Janasena leader nagababu tweets and special request to ap cm ys jagan

nagababu, janasena, twitter, tweets, pawan kalyan, cm ys jagan, amaravati, YS Rajashekar Reddy, YCP MLAs, Andhra Pradesh, latest news

Janasena party leader and mega brother Nagababu made interesting tweets on Andhra Pradesh CM YS Jagan and also pleases with special suggestion to him, that atleast try to be like former CM YS Rajashekar Reddy.

పవన్ బాటలోనే నాగబాబు.. జగన్ రెడ్డి గారూ అంటూ ఆసక్తికర ట్వీట్..

Posted: 01/18/2020 01:31 PM IST
Janasena leader nagababu tweets and special request to ap cm ys jagan

మెగా బ్రదర్, జనసేన సీనియర్ నాయకులు తన సోదరుడు జనసేనాని పవన్ కల్యాణ్ బాటలోనే పయనిస్తున్నారు. పవన్ కల్యాణ్ తరహాలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ ను జగన్ రెడ్డి గారూ అంటూ సంబోధిస్తూ.. ఆయనకు ఓ సూచనను చేశారు. అలాగే పనిలోపనిగా ఓ వినతిని కూడా కోరారు. అట్ ది సేమ్ టైం.. తన బలగాన్ని నియంత్రణలో పెట్టుకోవాలని కూడా సలహా ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రముఖంగా వినిసిస్తున్న రాజధాని సమస్యనే ఆయన ఎక్కుబెడుతూ.. గత కొద్దిరోజులుగా నాగబాబు ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తున్నారు.

అమరావతి రైతుల ఆందోళనలు, కాకినాడలో జనసేన పార్టీ నేతలపై దాడి జరిగిందంటూ స్పందిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల తీరుపై మండిపడ్డారు. అలాగే జనసేన-బీజేపీ పొత్తుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా ఇవాళ తన సోషల్ మీడియాలో ట్వీట్లు పోస్ట్ చేశారు. ఆయన ట్వీట్ల సారాంశం సాగిందిలా.. డియర్ జగన్ రెడ్డిగారు.. ఇది నా రిక్వెస్ట్.. ప్లీజ్ మీ తప్పుల్ని సరిద్దుకోండి. వచ్చే నాలుగున్నరేళ్లు పాలన కొనసాగించాలి అని అన్నారు.

అంతేకాదు వైసీపికి 151మంది ఎమ్మెల్యేల బలం ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఇంతటి బలాన్ని అందించిన ప్రజలకు మీరు ప్రజారంజక పాలన అందించాలని అభిలాషించారు. 'మీరు సుపరిపాలన అందించాలనుకుంటే.. రాష్ట్రాన్ని గందరగోళంలో పడేయొద్దు.. మీరు గందరగోళపడొద్దు.. ఇది తన రిక్వెస్ట్ అంటూ తన వినతి సీఎం జగన్ ముందు పెట్టారు మెగా బ్రదర్ నాగబాబు. ఇక మరో ట్వీట్ లో ‘ఇప్పటికీ మీకు (జగన్) తప్పుల్ని సరిచేసుకునేందుకు సమయం ఉంది. మీరు తప్పులు చేయాలని మేము అనుకోము.. వాటి నుంచి మేము ప్రయోజనాలు పొందాలి అనుకోము’ అని అన్నారు.

జనసేన పార్టీకి అలాంటి సముచిత ఆలోచనలతో ముందుకు వెళ్తొందే కానీ.. ఎక్కడ కుంచిత ప్రయోజనాల కోసం వేచిచూడదన్నారు. మీ ఎమ్మెల్యేలను మీరు కంట్రోల్ చేసుకోండి.. వారు మీ విజయాన్ని నాశనం చేస్తున్నారు’అంటూ మరో ట్వీట్ చేశారు. ‘మిమ్మల్ని, మీ నిర్ణయాలను విమర్శించే అవకాశాన్ని మాకు ఇవ్వొద్దు. మీరు దీన్ని మావైపు నుంచి వచ్చిన ఓ సలహాగా, ఛాలెంజ్‌గా తీసుకోండి. ప్లీజ్ మీరు ఏపీ ప్రజలందర్ని ఒకే విధంగా చూడండి.. పరిపాలించండి. కనీసం మీ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారిలా ఉండటానికి ప్రయత్నించండి’ అన్నారు జనసేన పార్టీ నేత నాగబాబు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles