no tension in getting approval for building house plan ఇంటి పర్మీషన్ కోసం ఇక నో టెన్షన్.. అంతా అన్ లైన్..

No tension in getting approval for building house plan

telangana municipal act, new municipal act telangana, building permission, house paln approval, town planning section, revenue section, ghmc, hyderabad new, telangana latest news

Unlike just past days, now there is no tension in getting approval for building house plan with telangana government new muncipal act, which approves all housing plans online.

ఇంటి పర్మీషన్ కోసం ఇక నో టెన్షన్.. అంతా అన్ లైన్..

Posted: 01/17/2020 06:59 PM IST
No tension in getting approval for building house plan

సొంతఇంటి కల సాకరం చేసుకోవాలంటే.. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అనే నానుడి తప్పకుండా గుర్తుకు వస్తుంది. ఇల్లు అన్న పదం ప్రారంభమైనప్పటి నుంచి ప్లాన్ డ్రాయింగ్ మొదలు పెడితే అక్కడి నుంచి గృహప్రవేశం చేసే వరకు అన్ని ఇబ్బందులే. ఒకటి డబ్బుతో.. మరోకటి పర్యవేక్షణతో.. ఇలా నిత్యం పనే.. శ్రమలేకుండా బిల్డర్లు ఇచ్చామా.. ఇక మన పని అయినట్లే. ఎందుకంటే వారు వినియోగించే వస్తువుల్లో నాణ్యత మనకు తెలియదు. వారి పర్యవేక్షణకు పూర్తిగా మార్కులు వేసి నిబ్బరంగానూ వుండలేము. ఇక ముందుగా బిల్డింగ్ ప్లాన్ అమోదించుకోవడానికి టౌన్ ప్లానింగ్ అధికారుల చుట్టూ.. వారి కార్యాలయాల చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయాల్సిందే.

అయితే ఇదంతా గతం.. ఇకపై అంతా అన్ లైన్ అంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు నూతనంగా తీసుకువచ్చిన మున్సిపల్ చట్టంతో తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇళ్ల నిర్మాణ అనుమతుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు కొత్త మునిసిపల్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ద్వారా.. ఇంటి అనుమతులు సులభంగా మంజూరు కానున్నాయి. 75 గజాల్లోపు స్థలంలో జీ+1 ఇంటి నిర్మాణానికి అనుమతులు తీసుకోనక్కర్లేదు. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించి కేవలం ఒక్క రూపాయి చెల్లిస్తే.. ఇల్లు నిర్మించుకునే సదుపాయం ఉంది. ఇల్లు కట్టాక మునిసిపాలిటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా పొందాల్సిన అవసరం లేదు.

64 చదరపు అడుగులు నుంచి 500 చదరపు అడుగుల లోపు విస్తీర్ణంలో పది మీటర్ల ఎత్తులో ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే.. ఆన్‌లైన్‌లో సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పిస్తే వెంటనే అనుమతులు వస్తాయి. అటు.. 200 చదరపు అడుగుల లోపు లేదా 7 మీటర్ల లోపు భవనాలను కట్టేవారు 10శాతం బిల్డప్ ఏరియాను కూడా తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ తప్పుడు వివరాలు నమోదు చేస్తే నోటీసులు ఇవ్వకుండానే ఇల్లును కూల్చేస్తారు. ఇదిలా ఉండగా, 500 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ, 10 మీటర్ల లేదా అధిక ఎత్తులో ఇల్లు నిర్మించుకోవాలనుకున్న వాళ్లు ఆన్‌లైన్‌లో 21 రోజుల్లోనే అనుమతి పొందవచ్చు. అయితే.. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు నిర్మిస్తే మూడేళ్ళ జైలు, భారీ జరిమానా తప్పదని చట్టం చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Model diksha singh to contest up panchayat elections 2021

  ఉత్తర్ ప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో గ్లామర్ డోసు..!

  Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more

 • Anand mahindra fulfills promise tn s famous idli amma gets new home workspace

  ఇడ్లీ బామ్మకు ఇల్లు కట్టించిన పారిశ్రామిక వేత్త

  Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more

 • Elangana mlas took drugs at bengaluru party police probe reveals

  బెంగళూరు డ్రగ్స్ కేసు: తెలంగాణలో బయటపడిన లింకులు

  Apr 03 | బెంగళూరు డ్రగ్స్‌ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more

 • Himanta biswa sarma pleads to revoke ban after ec bars him from campaigning

  హిమాంత తరువాత సుశాంతపై కూడీ ఈసీ బదిలీ వేటు

  Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more

 • Bjp lodges complaint against udhayanidhi stalin for remark against pm modi

  ప్రధాని మోదీపై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..

  Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more

Today on Telugu Wishesh