Hazipur killing final verdict on January 27 ‘హాజీపూర్’ కేసు: విచారణ ముగింపు.. తీర్పు రిజర్వు..

Final verdict in hazipur serial killer srinivas reddy case on january 27

verdict reserved in Hazipur case, verdict reserved in Hajipur case, hazipur case accused srinivas reddy, hajipur accused srinivas reddy, hazipur, hazipur case, hajipur, hazipur incident, hazipur well, hazipur news, hazipur public, hazipur serial killer, Srinivas Reddy, Crime

The POSCO court which heard the case pertaining to Hazipur serial killings on Friday said that the final verdict will be declared on January 27. While three cases have been filed against the accused Srinivas Reddy in the rape and murder of three girls, arguments in one of the cases have been closed on January 8.

హాజీపూర్ సీరియల్ కిల్లర్ కేసు: విచారణ ముగింపు.. తీర్పు రిజర్వు..

Posted: 01/17/2020 05:27 PM IST
Final verdict in hazipur serial killer srinivas reddy case on january 27

తెలుగురాష్ట్రాలలో సంచలనం రేపిన హాజీపూర్ వరుస హత్యల కేసులో విచారణ ముగిసింది. ఈ నెల 27న తీర్పు వెలువరించనున్నట్లు పోక్సో కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. హాజీపూర్ హత్యల కేసుకు సంబంధించి కొంతకాలంగా విచారణ జరుగుతోంది. జనవరి 6, 7 తేదీల్లో ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించగా... 8న డిఫెన్స్ న్యాయవాది వాదనలు వినిపించారు. జనవరి 8న ఒక హత్యకేసుకు సంబంధించి వాదనలు విన్న కోర్టు.. మరో రెండు కేసుల్లో వాదనలను వినేందుకు ఇవాళ్టికి వాయిదా వేసింది.

ఈ క్రమంలోనే హజీపూర్ సీరియల్ కిల్లర్ కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కోంటున్న శ్రీనివాస్ రెడ్డిని ఇవాళ నల్గొండ మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానంలోని పోక్సో కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. కాగా, ఈ కేసులో మరో ఇద్దరి మృతులకు సంబంధించిన వాదనలు వినాల్సివున్నప్పటికీ డిఫెన్స్ తరపు న్యాయవాది మాత్రం ఎలాంటి వాదనలు వినిపించలేదు. దీంతో మిగిలిన ఇద్దరి తరపున వాదనలు వినాల్సిన అవసరం లేకుండానే ఈ నెల 27న ఈ కేసులో తుది తీర్పును వెలువరించనున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ లో ముగ్గురు మైనర్ బాలికల హత్యలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. శ్రావణి, కల్పన, మనీషాను అత్యాచారం చేసి చంపేశాడు. మూడేళ్లలో ముగ్గురు బాలికలను కిరాతకంగా హత్య చేశాడు. మరో మహిళ హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో 600 మందికి పైగా సాక్షులను విచారించడంతో పాటు నిందితుడు శ్రీనివాస్ వాంగ్మూలం కూడా కోర్టు తీసుకుంది. ఇక ప్రాసిక్యూషన్, డిఫెన్స్ వాదనలు పూర్తడవంతో విచారణను ముగించింది. అయితే జనవరి 27న ఎలాంటి తీర్పు వస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles