Amaravati capital protest: Nara Lokesh bike rally on Day 31 అధికార పార్టీ నేతలది విష ప్రచారం: నారా లోకేష్

Nara lokesh slams ruling party on fake report of iit madras

Amaravati farmers, mandadam, Tulluru, Nara Lokesh, Narayana, Mangalagiri, Bike Rally, IIT Madras, joint action committee, national interest, Vijayawada, farmers, Capital city, Amaravati, agitation, Andhra Pradesh, Politics

As protests continued over the idea of three capitals in Andhra Pradesh, rumours created by few stating that the soil of Amaravati is not safe to build big structures, In this contest farmers mailed to IIT Madras seeking the information, and got back that its fake report by the IIT authorities.

అధికార పార్టీ నేతలది విష ప్రచారమే: బైక్ ర్యాలీలో నారా లోకేష్

Posted: 01/17/2020 03:43 PM IST
Nara lokesh slams ruling party on fake report of iit madras

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న దీక్షలు 31వ రోజుకు చేరుకున్నాయి. అమరావతి పరిధిలోని 29గ్రామాల్లో ఎక్కడా చూసినా ఆయా గ్రామాల ప్రజలు నిరసనలు కార్యక్రమాలు చేపడుతున్నారు. మూడు రాజధానులు ప్రతిపాదనను వద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు.  అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా కొనసాగించేందుకు వారు ఎంతవరకైనా కదులుతామని చెప్పిన రైతులు తాజాగా అమరావతి ప్రాంతంలో నిర్మాణాలపై వచ్చిన అసత్య కథనంపై కూడా తాడో పేడో తేల్చుకున్నారు.

రాష్ట్రంలోని అధికార పార్టీ పెద్దలు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు తమ స్థాయిలో అమరావతి రైతులు కదిలారు. అమరావతిలో నిర్మాణాలు సురక్షితం కాదంటూ.. వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారం అబద్ధమని తేలిపోయేలా చేశారు. రైతుల ఉద్యమంతో పాటు వారి ఈ మెయిల్ పై స్పందించిన మద్రాస్‌ ఐఐటీ తాము ఎలాంటి నివేదిక ఇవ్వలేదంటూ స్పష్టంచేసింది. అసలేం జరిగిందీ..? రాజధాని అమరావతి ప్రాంతంలోని భూములు భారీ నిర్మాణాలకు సురక్షితం కాదంటూ మద్రాస్ ఐఐటీ పేరుతో ఓ అసత్య ఈ మెయిల్ ప్రచారంలో వుంది.

దీంతో అమరావతి రైతులకు మద్రాస్‌ ఐఐటీ పెద్దలు ఈ విషయంలో స్పష్టతను ఇవ్వాలని కోరుతూ ఇ-మెయిల్ పంపారు. అమరావతిలో నిర్మాణాలు సురక్షితం కాదని తాము చెప్పలేదని మద్రాస్‌ ఐఐటీ స్పష్టం చేసింది. అక్కడి నేలలో బలం లేదని నివేదిక ఇచ్చామనడం అబద్ధమని అందులో తెలిపింది. అసలు ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని ఎవరో తమ పేరున చేయడం కూడా హేయకరమని, దానిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఐఐటీ మద్రాసు అధికారులు పేర్కోన్నారు. తాము రిపోర్ట్ ఇచ్చామనడాన్ని ఐఐటీ పెద్దలు తీవ్రంగా ఖండించారు. ఇప్పుడీ ఇ-మెయిల్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

అమరావతిపై నెగెటివ్ ప్రచారం చేయాలనుకున్న ప్రభుత్వ వ్యూహం మరోసారి బెడిసి కొట్టిందని అమరావతి జేఏసీ నేతలు అన్నారు. అమరావతిలో నిర్మాణాలకు ఎక్కువ ఖర్చు అవుతుందని.. భారీ నిర్మాణాలు కష్టమంటూ ఐఐటీ-మద్రాస్‌ పేరుతో మంత్రులు చేసిన ప్రకటనలు అవాస్తవం అని తేలిపోయిందని రైతులు అంటున్నారు. ఇక ఇదే అంశమై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ అధికార పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాంటి నివేదిక ఏదీ తాము ఇవ్వలేదని ఐఐటీ మద్రాస్ తేల్చి చెప్పిందని ఆయన పేర్కొన్నారు.

దీంతో అమరావతిపై వైసీపీ చేస్తున్నదంతా విష ప్రచారమేనని తేటతెల్లమైందన్నారు. ‘ఒక అమరావతి, వైసీపీ 10 అబద్ధాలు’ పేరుతో ట్వీట్ చేసిన లోకేశ్.. వైసీపీని ఎండగట్టారు. ప్రజా రాజధాని అయిన అమరావతి గురించి నిజాలు చెప్పేలోపు.. వైసీపీ చెప్పే అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తున్నాయని అన్నారు. అమరావతిని చంపేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు అన్నీ ఇన్నీ కావని మండిపడ్డారు. ఐఐటీ మద్రాస్ వివరణతో నిజాలను ఎక్కువకాలం దాయలేమన్న విషయం జగన్‌కు అర్థమై ఉంటుందన్నారు. ఈ సందర్భంగా చేసిన ట్వీట్‌లో అమరావతిపై వైసీపీ వివిధ సందర్భాల్లో చేసిన విమర్శలను అంశాల వారీగా లోకేశ్ ప్రస్తావించారు.

మంగళగిరి జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. పాత మంగళగిరి సీతారామ ఆలయం నుంచి….. పాత బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు… ర్యాలీలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గోన్నారు. వీరితోపాటు.. టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.మూడు రాజధానులు ప్రతిపాదనను వద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు.  అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా కొనసాగించేందుకు వారు ఎంతవరకైనా కదులుతామని చెప్పిన రైతులు తాజాగా అమరావతి ప్రాంతంలో నిర్మాణాలపై వచ్చిన అసత్య కథనంపై కూడా తాడో పేడో తేల్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh