railway station inaugurated by PM Modi gets 2 passengers daily ప్రధాని ప్రారంభించిన రైల్వేస్టేషన్ ఘనత ఇదే.!

Railway station pm modi inaugurated last year in odisha gets only two passengers a day

Bichhupali Railway station, Balangir-Bichhupali railway station, Odisha railway station, daily earning, PM Modi inaugurated railway station, East Coast Railway, Narendra Modi, East Coast Railway, Sonepur station, Sambalpur, Titalagarh, Bhawanipatna, Chief public relation officer, JP Mishra, Odisha

The Bolangir-Bichhupali station daily passenger turnover is two per day, and passenger earning is Rs 20,” the RTI reply by Sambalpur Division of East Coast Railway said while replying to an application filed by Bolangir-based RTI activist Hemanta Panda.

ప్రధాని ప్రారంభించిన రైల్వేస్టేషన్ ఘనత ఇదే.!

Posted: 01/17/2020 02:55 PM IST
Railway station pm modi inaugurated last year in odisha gets only two passengers a day

ఎంత చిన్న రైల్వే స్టేషన్ అయినా రోజు మొత్తం మీద ఒక్క ప్యాసింజర్ రైలైనా నడవాల్సిందే. సదరు స్టేషన్ లో అగి ప్రయాణికులను ఎక్కించుకుని వారి గమ్యస్థానాలకు చేర్చాల్సిందే. రైల్వే శాఖలో అత్యంత చిన్న రైల్వే స్టేషన్ తీసుకుని దాని నిర్వహణకు అయ్యే ఖర్చులను చూసుకున్నా.. ఏకంగా నెలకు మూడున్నర లక్షల రూపాయలు కేవలం జీతబెత్యాలకే సరిపోతుందని అంచనా. అయితే ఏ రైల్వేస్టేషన్ ను కొత్తగా ప్రారంభించినా.. ఆ స్టేషన్ నిర్వహణ ఖర్చులతో పాటు కాస్తో, కూస్తో లాభాన్ని కలుపుకుని ఏటా రూపాయలు కోటి రమారమి లేనిదే గిట్టుబాటు కాదు.

అయితే సాక్షాత్తు దేశ ప్రధాన మంత్రి, అందులోనూ డెబై ఏళ్లు స్వాతంత్ర భారతావనిలో ఏ పాలకులు ఇప్పటివరకు చేయని పనులను చక్కబెడుతూ.. తనదైన ముద్రను అన్నింటా వేస్తూ ముందుకు సాగుతున్న ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన రైల్వే స్టేషన్ అంటే ఇంకెలా వుండాలి. అలా ప్రారంబిస్తే చాలు.. ఇలా వడపోయలేనన్ని లాభాలు వచ్చితీరాల్సిందే. సరిగ్గా ఏడాది క్రితం ప్రధాని నరేంద్రమోడీ చేతులు మీదుగా ప్రారంభానికి నోచుకున్న రైల్వేస్టేషన్ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వుంది. నెలకు రూ.600లను ఆర్జించేందుకు ఏకంగా మూడున్నర లక్షలను వెచ్చిస్తున్నారంటే ఎంతటి ఘనత.

ప్రధాని మోడీ చేతులు మీదుగా ప్రారంభానికి నోచుకున్న రైల్వే స్టేషన్ లో రోజువారీగా రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య కేవలం ఇద్దరు. ఇద్దరి కోసమే ఒక రైల్వే స్టేషన్ నడుస్తోందంటే అశ్చర్యపోవాల్సిందే. ఇక సదరు రైల్వే స్టేషన్ కు ప్రతి రోజు వచ్చే ఆదాయం కేవలం రూ.20 అంటే విస్మయం కలగకమానదు. ఇద్దరంటే ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఆ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారట. ఇంతకీ ఆ స్టేషన్ ఉన్నది ఒడిశాలో. బొలంగిర్ జిల్లాలోని బిచ్చుపాలి రైల్వే స్టేషన్ దే ఈ ఘనత.

ఇటీవల ఓ సామాజిక కార్యకర్త ఆర్టీఐ చట్టం ద్వారా ఈ స్టేషన్ గురించిన సమాచారం రాబట్టారు. బిచ్చుపాలి రైల్వే స్టేషన్ నుంచి రోజు మొత్తం మీద ప్రయాణించేది ఇద్దరేనని, వారి ద్వారా రూ.20 ఆదాయం వస్తోందని అధికారులు తెలిపారు. బొలంగిర్ నుంచి బిచ్చుపాలికి రైల్వే లైన్ వేయడానికి, ఇక్కడ స్టేషన్ నిర్మించడానికి రూ.115 కోట్లు ఖర్చయింది. కానీ స్టేషన్ నిర్వహణకు రోజుకు ఎంత ఖర్చవుతుందో మాత్రం అధికారులు చెప్పలేదు. ఇక ఈ రైల్వేస్టేషన్ ను సోనిపూర్ రైల్వే స్టేషన్ తో అనుసంధానం చేసేవరకు పరిస్థితి ఇలానే వుంటుందని.. అయితే మరో ఏడాదిలో అనుసంధాన పనులు పూర్తవుతాయని ఈస్ట్ కోస్ట్ సీపీఆర్వో మిశ్రా తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles