'Rapunzel' grows 20cm hair in a year, retains Guinness crown! పొడువాటి కురులతో గిన్నీస్ రికార్డు

Nilanshi patel breaks guinness world records with 190 cm long hair

Nilanshi Patel, Rapunzel, longest hair of indian woman, Longest hair, Gujarat,Guinness World Records, Guinness World Records, weird news

bad hair cut at the age of six prompted a Gujarat-based Nilanshi Patel to get her name registered in the Guinness World Records for the longest hair on a teenager with her locks measuring 190 centimeters.

యువతిని శిఖరాగ్ర స్థానాన నిలిపిన శిరోజాలు.. గిన్నీస్ రికార్డు..

Posted: 01/16/2020 02:52 PM IST
Nilanshi patel breaks guinness world records with 190 cm long hair

శిరోజాలే ఆ యువతని శిఖరాగ్రస్థానంలో నిలిపాయి. ఆమెకు సెలబ్రిటీ స్టేటస్ తో పాటు యువతులే ముందుకు వచ్చి అమెతో సెల్ఫీలు తీసుకునేలా చేశాయి. కేశాలంకరణ ఆమెకు అందంతో పాటు రెండో పర్యాయం కూడా అవార్డును అందుకునేలా చేసింది. అమె చిన్నతనంలో ఆరేళ్ల వయస్సులో వున్నప్పుడు చేసుకున్న బేబీ కట్.. అమెకు నచ్చలేదు. దీంతో అప్పటి నుంచి అమె తన శిరోజాలను కట్ చేయించకుండా అలాగే పెంచుకుంటూ వెళ్లింది. ఇక ఇప్పుడు అమె కన్నా అమె శిరోజాలే పోడుగ్గా వున్నాయి.

గుజరాత్‌ రాష్ట్రంలోని అరవల్లికి చెందిన నీలాన్షి పటేల్‌ అనే 17 ఏళ్ల యువతి పొడవైన జుట్టుతో టీనేజి విభాగంలో గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకుంది. అత్యంత పొడవైన జుట్టు ఉన్న టీనేజి యువతిగా ఆమెకు గిన్నీస్‌ బుక్‌లో స్థానం కల్పించారు. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చుదువుతున్న ఈ యువతి 2018లో 170.5 సెంటీ మీటర్ల పొడవాటి జుట్టుతో గతంలో ఓ టీనేజి యువతి పేరిట ఉన్న రికార్డును ... నీలాన్షి 190 సెంటీమీటర్ల పొడవైన జుట్టుతో బద్దలు కొట్టింది.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కడికి వెళ్లినా తనతో సెల్ఫీ తీసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని, ఇలా జట్టుతో సెలబ్రిటీగా గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని గిన్నీస్ రికార్డులు కూడా అందుకోవాలని తన అభిలాషను స్పష్టం చేసిన నీలాన్షి.. ఇక అడల్ట్ క్యాటగిరిలోనూ తన శిరోజాలకు గుర్తింపును తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పింది. తన శిరోజాలే తనకు అదనపు బలమని చెబుతున్న ఈ యువతి.. సాప్ వేర్ ఇంజనీర్ కావాలన్నది తన అకాంక్షగా చెప్పుకోచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles