IT raids at locatons of actress Rashmika హీరోయిన్ రష్మిక నివాసంపై ఐటీ దాడులు

It raids kannada actress rashmika mandanna s house

rashmika mandanna, rashmika mandanna IT raid, income tax raid rashmika, rashmika IT raid, GST Raids, Lavanya Tripati, Anasuya Bharadwaj, Suma Kanakala, Pankatham Vamsi, Haarika and Hassine creations, sitara Entertainments, Tollywood, movies, Entertainment

Income Tax officials are conducting a search-and-seizure operation at the residence of actor Rashmika Mandanna in Virajpet, Kodagu district.

మహేశ్ హీరోయిన్ నివాసంపై ఐటీ దాడులు..

Posted: 01/16/2020 01:16 PM IST
It raids kannada actress rashmika mandanna s house

టాలీవుడ్‌ ప్రముఖులే లక్ష్యంగా ఇటు అదాయపన్ను శాఖ అధికారులతో పాటు అటు జీఎస్టీ అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సినీప్రముఖులే టార్గెట్ గా ఈ దాడులు జరుగుతున్న ఈ దాడులు అటు నిర్మాతలు, దర్శకులతో పాటు హీరోయిన్లను కూడా టార్గెట్ చేస్తున్నాయి. సినీప్రముఖులకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు పలు పర్యాయాలుగా సోదాలు చేస్తున్నారు. వీరితో పాటు ఇటీవల ప్రముఖ బిల్డర్స్, స్టీల్ వ్యాపారులు, ఫైనాన్స్ సంస్థలపై కూడా ఇవాళ దాడులు కొనసాగిన విషయం తెలిసిందే.

తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రం హీట్ కావడంతో మంచి జోరుమీదున్న కథానాయిక రష్మికకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. అమె నివాసంలో ఆదాయపన్నుశాఖ అధికారులు సోదాలు చేపట్టారు. కర్ణాటక రాష్ట్రంలోని కొడుగు జిల్లా విరాజ్ పేటలోని ఆమె నివాసంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ ఉదయం 7.30 గంటల ప్రాంతంలో సోదాలు ప్రారంభమయ్యాయి. రష్మిక ఆదాయ లెక్కలను పరిశీలిస్తున్నారు. దీనిపై రష్మిక మేనేజర్‌ స్పందిస్తూ.. ఇలాంటి ఐటీ దాడులు సహజమే అన్నారు.

గీతా ఆర్ట్స్ 2 నిర్మించిన గీతా గోవిందం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రి ఇచ్చిన రష్మిక.. తాజాగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలై, దూసుకెళ్తున్న తరుణంలో అదాయశాఖ అధికారులు ఆమెకు షాకిచ్చారు. ఆమె నివాసంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. మరోపక్క రష్మిక, నితిన్‌ జంటగా నటించిన ‘భీష్మ’ ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  మరోపక్క అల్లు అర్జున్‌-సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో నటించబోతున్నారు. కార్తితో కలిసి ఓ తమిళ సినిమాలోనూ రష్మిక నటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rashmika mandanna  IT raid  income tax  GST Raids  Lavanya Tripati  Anasuya  Suma  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh