Amaravati capital protest continues on Day 30 30వ రోజు కొనసాగుతున్న అమరావతి రైతుల దీక్ష

Tdp mla balakrishna to sit on dharna in support of amaravati farmers on 30th day

YS Jagan, Amaravati, Amaravati farmers, mandadam, Tulluru, tents, agitations, tension, Tension, Temples, joint action committee, YS Jagan, Capitals, Visakhapatnam, kurnool, committee report, executive capital, legislative capital, judicial capital, Amaravati farmers, vanta varpu, Amaravati bandh, Jagan Mohan reddy, Andhra Pradesh vs Telangana, national interest, Vijayawada, farmers, Capital city, Amaravati, agitation, Andhra Pradesh, Politics

As protests continued over the idea of three capitals in Andhra Pradesh, Telugu actor and Hindupur TDP MLA Balakrishna will sit on dharna and tour the villages of Amaravati to express solidarity with the farmers over the ongoing agitation.

30వ రోజు కొనసాగుతున్న అమరావతి రైతుల దీక్ష

Posted: 01/16/2020 12:31 PM IST
Tdp mla balakrishna to sit on dharna in support of amaravati farmers on 30th day

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న దీక్షలు 30 రోజుకు చేరుకున్నాయి. అమరావతి పరిధిలోని 29గ్రామాల్లో ఎక్కడా చూసినా ఆయా గ్రామాల ప్రజలు నిరసనలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అమరావతి ముద్దు, మూడు రాజధానులు వద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. పండుగ శోభతో కళకళలాడాల్సిన పల్లెలు బోసిపోయి కనిపిస్తున్నాయి. పండుగ వాతావరణం తమ భావితరాలకు అందించడానికే తాము పండుగలకు కూడా దూరంగా వుంటూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని రైతులు పేర్కోన్నారు.

రాజధాని పరిధిలోని 29 గ్రామాల పరిధిలో ఎక్కడ చూసినా ఇదే చిత్రం కనిపిస్తోంది. దీనికి తోడు  పండుగులకు ఇంటికొచ్చిన బంధువులు కూడా వారితో కలసి టెంట్లలో కూర్చోని నిరసన తెలియజేస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. తుళ్లూరు, వెలగపూడి, మందడం సహా రాజధాని గ్రామాలైన అమరావతిలో నిరసనలు కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరులో రైతుల మహా ధర్నా, వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.

నెల రోజులుగా తాము చేస్తున్న దీక్షలకు మహిళలు, రైతులు, యువకులు, విద్యార్థుల నుంచి సంఘీభావం లభించిందని, వారు కూడా తమకు మద్దతుగా నిరసన దీక్షల్లో పాల్గొంటున్నారని రైతులు తెలిపారు. సినీ ప్రముఖుల నుంచి కూడా తమకు సంఘీభావం లభించిందని పలువురు సినీనటులు కూడా తమకు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. కాగా, ముఫై రోజులు గడుస్తున్నా తమ దీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.  

అమరావతి ప్రాంత రైతులు నిర్వహిస్తోన్న దీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం చలించక పోవడం దుర్మార్గం అని రైతులు మండిపడ్డారు. మూడు రాజధానుల నిర్ణయం అర్థ రహితమని, తెలివి తక్కువ ప్రతిపాదనలను వెనక్కి తీసుకొవాలని డిమాండ్ చేశారు. 24 గంటల పాటు చేపట్టిన రైతుల నిరహార దీక్షను గురువారం ఉదయం 10 గంటలకు ఐకాస ప్రతినిధులు నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ రోజు దీక్షా శిబిరాన్ని సందర్శించి తన సంఘీభావాన్ని తెలియజేయనున్నారు.

రాజధాని రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయంలో ఇందుకు ఏర్పాట్లు చేశారు. హైపవర్‌ కమిటీకి సూచనలు, సలహాలు, అభ్యంతరాలు తెలపవచ్చని మంత్రులు సూచించారు. ఇప్పటి వరకూ 3100 మంది రైతులు తమ అభిప్రాయాలను తెలిపినట్లు అధికారులు చెప్పారు. ఈ నెల 17 వరకు రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించారు. భూములు ఇచ్చిన రైతులు తమ విజ్ఞప్తులు ఇవ్వాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కమిషనర్‌ పేరిట ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amaravati farmers  mandadam  Tulluru  tents  agitations  tension  joint action committee  Andhra Pradesh  Politics  

Other Articles