AP Grama Sachivalayam Jobs Notification 2020 సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ

Ap grama sachivalayam jobs notification 2020

AP Sachivalayam, Gram Sachivalayam, Rural Development, Girija shankar, Recruitment, Vacancy, Jobs 2019, sarkari jobs

good news for the unemployed youth in AP. Panchayati Raj and Rural Development commissioner Girija Shankar has released a notification to fill up 16,207 vacant posts in Grama and Ward Sachivalayam.

సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ.! 16.200 పోస్టులు.!!

Posted: 01/11/2020 04:56 PM IST
Ap grama sachivalayam jobs notification 2020

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16207 పోస్టులను భర్తీచేసేందుకు ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. వీటిలో 14,061 పోస్టులు గ్రామ సచివాలయాల్లో, 2146 పోస్టులు వార్డు సచివాలయాల్లో భర్తీచేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్‌లో శనివారం నుంచి ఈ నెల 31 వరకూ దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. గ్రామ సచివాలయాల్లో.. పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్‌-5)-61 పోస్టులు, గ్రామ రెవెన్యూ అధికారి(గ్రేడ్‌-2)-246 ఖాళీలు వున్నాయని తెలిపింది.

వీటితో పాటు ఏఎన్‌ఎం/ఎంపీహెచ్‌ఎ్‌స్ (మహిళలు)(గ్రేడ్‌-3)-648, విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్లు-69, విలేజ్‌ హార్టీకల్చర్‌ అసిస్టెంట్‌-1782, విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌-2)-536, విలేజ్‌ సెరికల్చర్‌ అసిస్టెంట్‌ 43, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి-762, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌-2)-570, పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్‌-6) డిజిటల్‌ అసిస్టెంట్లు 1134, విలేజ్‌ సర్వేయర్‌ (గ్రేడ్‌-3) 1255, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌-97, పశుసంవర్థక అసిస్టెంట్లుగా 6,858 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చింది.
 
పట్టణ స్థానిక సంస్థల్లోని వార్డు సచివాలయాల్లో.. వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ-105, ఎమినిటీస్‌-371, శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌- 513, ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌- 100, ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌- 844, వెల్ఫేర్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ సెక్రటరీలుగా 213 పోస్టులను భర్తీ చేయనుంది. ఇతర వివరాలు గ్రామ, వార్డు సచివాలయ వెబ్‌సైట్‌లో చూడాలని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles