Gujarat: Eight killed in blast at gas company మెడికల్ గ్యాస్ ప్లాంట్ లో పేలుడు.. 8 మంది మృతి..

Eight dead in blast at medical gas manufacturing plant in gujarat

gujarat blast, aims oxygen blast, dead in blast, vadodara aims oxygen pvt ltd, oxygen manufactuing company, vadodara blast, gujarat news, Crime

The incident occurred at around 11 am on Saturday with a loud explosion inside the oxygen gas plant of the company. As many as eight workers were killed on the spot and the sixth succumbed to his injuries on the way to a private hospital, where 10 other injured were rushed for treatment.

మెడికల్ గ్యాస్ ప్లాంట్ లో పేలుడు.. 8 మంది మృతి..

Posted: 01/11/2020 05:29 PM IST
Eight dead in blast at medical gas manufacturing plant in gujarat

గుజరాత్‌ వడోదరలోని పద్రా తాలుకాలో పేలుడు సంభవించింది. పద్రాలో గల మెడికల్ గ్యాస్‌ తయారీ పరిశ్రమలో ఎయిమ్స్‌ ఆక్సిజన్ ప్రైవేటు లిమిటెడ్ లో ఇవాళ మధ్యాహ్నం భారీ విస్పోటనం సంభవించింది. పెద్ద శబ్దంతో సంభవించిన ఈ పేలుడులో ఘటనాస్థలంలోనే ఎడుగురు మృతిచెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో క్షతగాత్రులు ప్రాణాలను వదిలాడు. దీంతో మొత్తం ఎనమిది మంది మరణించారు. కాగా, ఈ ఘటనలో మరో పది మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని, వారందరినీ చికిత్స నిమిత్తం అసుపత్రులకు తరలిస్తున్నామని చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్ లోని వడోదర నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో వున్న పద్రా అనే ప్రాంతంలో నెలకొన్న ఎయిమ్స్ ఆక్సిజన్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ.. పరిశ్రమలు, వైద్యరంగానికి అవసరమైన గ్యాస్ లను ఉత్పత్తి చేస్తోంది. కాగా ఇవాళ మధ్యాహ్నం అకస్మాత్తుగా భారీ శబ్దంతో విస్పోటనం సంభవించిందని పోలీసులు తెలిపారు. ఆక్సిజన్‌, నైట్రోజన్‌, ఆర్గాన్‌, కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఇతర వాయువులను కంపెనీ తయారు చేస్తుంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేపట్టింది. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles