Tainted CI surrenders before ACB in Hyderabad జూబ్లీహిల్స్ సిఐ బలవంతయ్య నివాసంపై ఏపీబి దాడులు

Acb raids ci s residence who caught in bribery case in hyderabad

CI Balavantaiah, SI Sudheer Reddy, Jubilee Hills Police Station, Bribery case, Hyderabad, CP Anjan kumar, Telangana, ACB, politics

The Anti-Corruption Bureau sleuths raided Jubilee Hills Circle Inspector Balavantaiah's house. The searches were also carried out at his brother's and relatives' homes simultaneously.

జూబ్లీహిల్స్ సిఐ బలవంతయ్య నివాసంపై ఏపీబి దాడులు

Posted: 01/11/2020 04:01 PM IST
Acb raids ci s residence who caught in bribery case in hyderabad

పరారీలో వుంటూ ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన జూబ్లీహిల్స్ సీఐ బలవంతయ్య నివాసంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. అతని నివాసంతో పాటు అతని సమీప బంధువుల ఇళ్లపై కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. స్టేషన్ బెయిల్ కోసం తన వద్దకు వచ్చిన ఓ వ్యక్తి నుంచి ఏకంగా 50 వేల రూపాయలతో పాటు రెండు స్కాచ్ బాటిళ్లను తన అదేశాల మేరకు తీసుకున్నట్లు జూబ్లిహిల్స్ ఎస్ఐ సుధీర్ రెడ్డి ఏసీబి అధికారులకు వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలసిందే.

మూడు రోజుల క్రితం ఏసీబి అధికారులకు రెడ్ హ్యాండెండ్ గా పోలిస్ స్టేషన్ లోనే చిక్కన ఎస్ఐ సుధీర్ రెడ్డి.. సిఐ అదేశాలతోనే తాను డబ్బును తీసుకున్నానని చెప్పిన నేపథ్యంలో ఇద్దరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో బల్వంతయ్య నివాసంపై ఏసీబి అధికారులు దాడులు నిర్వహించి సోదాలు చేస్తున్నారు. బల్వంతయ్య కేవలం రెండు నెలల క్రితం జూబ్లీహిల్స్ పోలిస్ స్టేషన్ కు వచ్చారని.. రెండు నెలల కూడా పూర్తికాకముందే తన అవినీతి అద్యాయానికి ఇకడ అనేక పుటలు వున్నాయన్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

జూబ్లీహిల్స్ లో సెటిల్ మెంట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. వచ్చి రావడంతోనే ఆయన వ్యాపారులతో పాటు మద్యం దుకాణాలు, పబ్ లు హోటళ్లు తదితరులను పిలిపించుకుని అక్రమలావాదేవీల గురించి ఒక అంతరంగిక అవగాహన కుదుర్చుకున్నారని సమాచారం. ఇక గతంలోనూ ఆయన ఇలాంటి చేతివాటం పనులకు పాల్పడ్డారని.. ఫలితంగా ఆదాయానికి మించిన ఆస్తులను సంపాదించారన్న అనుమానంతో ఏసీబీ అధికారులు బలవంతయ్య నివాసంతో పాటు ఆయన బంధువులు, మిత్రుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

అవినీతి ఆరోపణలపై జూబ్లీహిల్స్ సీఐ బలవంతయ్య నిన్న సస్పెండ్ చేశారు. ఆయనను విధుల నుంచి తప్పిస్తూ హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ఉత్తర్వూలు జారీ చేశారు. పరారీలో ఉన్న బలవంతయ్య అదుపులోకి తీసుకున్నారు.దీంతో సీఐ బలవంతయ్యపై కూడా కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బలవంతయ్య పరారయ్యాడు. సీఐ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సుధీర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఎస్ ఐ, సీఐలను హైదరాబాద్ సీపీ సస్పెండ్ చేశారు. పోలీసు శాఖలో ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నగరంలో లంచం డిమాండ్ చేస్తే 9490616555 నెంబర్ కు ఫోన్ చేసి..తనకు నేరుగా ఫిర్యాదు చేయాలని సీపీ అంజనీకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

2019, డిసెంబర్ 29న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కేసు నమోదు అయింది. ఆ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు వంశీ కృష్ణ వద్ద నుంచి మొత్తం రూ.50 వేలు, రెండు స్కాచ్ బాటిల్స్ ను కూడా ఎస్ ఐ సుధీర్ రెడ్డి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సివిల్ తగాదాలో ఎస్ ఐ సుధీర్ రెడ్డి ప్రమేయం ఉంది. అలాగే సీఐ బలవంతయ్య ఆదేశాల మేరకే ఆ డబ్బులు డిమాండ్ చేసి, డబ్బులు తీసున్నట్లు ఏసీబీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో సీఐ బలవంతయ్యలపై వేటు పడింది. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ ఐ సుధీర్ రెడ్డిపై కూడా వేటు పడింది. ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మెదక్ జిల్లా గజ్వేల్ ప్రాంతానికి చెందిన సుధీర్ 2014 బ్యాచ్‌కు చెందిన వాడు. జూబ్లీహిల్స్ పీఎస్‌లో 18 నెలల నుంచి పని చేస్తున్నారు. అడ్మిన్ ఎస్ఐ..విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా సివిల్ తగాదాల్లో లంచాలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ. 50 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందడంతో దాడి చేశారు. ఈ ఘటనలో సీఐ బలవంతయ్య పాత్ర కూడా ఉందని సుధీర్ రెడ్డి చెప్పారు. మూడు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh