villagers non co-operative movement to police అమరావతి గ్రామాల్లో పోలీసులకు సహాయ నిరాకరణ

Amaravati villagers non co operative movement to police

Indrakeeladri, kanakadurga devi, Vijayawada, padayatra, amaravati villagers, arrest, huge police force, netizens, farmer pleading help, Amaravati, Visakhapatnam, executive capital, legislative capital, judicial capital, Amaravati farmers, vanta varpu, Amaravati bandh, Jagan Mohan reddy, Andhra Pradesh vs Telangana, national interest, Vijayawada, farmers, Capital city, Amaravati, agitation, Andhra Pradesh, Politics

Huge police force in Amaravati, and lathi charge on women of the local village women create tension. Keeping this in view locals are decided to not to co-operate with police for lunch, meals, breakfast, tea, coffee, water bottles,

అమరావతి గ్రామాల్లో పోలీసులకు సహాయ నిరాకరణ

Posted: 01/11/2020 02:59 PM IST
Amaravati villagers non co operative movement to police

అమరావతిలోనే రాష్ట్ర రాజధానిని కొనసాగించాలని.. రాజధాని కోసం తమ భావితరాల బంగారు భవిష్యత్తు కోసం తాము చేసిన త్యాగాలను సహృద్భావంతో అర్థం చేసుకోవాలని కోరుతూ దీక్షలు, ధర్నాలు చేస్తున్న రైతులు ఇక ఉద్యమం మరింత ఉదృతంగా సాగే చర్యలకు పోలీసులు బ్రేకులు వేస్తున్న నేపథ్యంలో వారిని సహాయ నిరాకరణ చేయాలని సంకల్పించారు. ఈ మేరకు రాజధానిగా అమరావతి రైతులు నిర్ణయించుకున్నారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ అవలంభించిన ఉద్యమాన్ని రాజధాని కొనసాగింపు లో చేపట్టాలని పూనుకున్నారు.

తుళ్లూరు గ్రామంలో పోలీసులు కొన్ని రోజుల నుంచి అక్కడే పహారా కాస్తున్నారు. ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్లి, వచ్చే ప్రాంతం కాబట్టి.. ఈ ప్రాంతంలో ఆనయ కాన్వాయ్ కు అడ్డగించే చర్యలకు గ్రామస్థులు పూనుకోకుండా పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. అయితే క్రమంగా రాజధాని ప్రాంతంలో రైతులు ఉద్యమాన్ని చేపట్టడం.. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో నల్ల జెండాలు.. ప్లకార్డులు ప్రదర్శించడంతో ఉన్నతాధికారుల అదేశాలతో పోలీసు బలగాలు మరింతగా పెరిగాయి. దీంతో వారిలో అనేకమంది ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారే కావడంతో.. రాజధాని ప్రాంతంలోని హోటళ్లను ఆశ్రయిస్తున్నారు.

అహర్నిషలు అక్కడి రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో స్థానికంగా ఉండే హోటళ్లను ఆశ్రయించి అందులో లభ్యమయ్యే పలహారాలు, బోజనాలతో రోజులను వెల్లదీస్తున్నారు. అయితే ఉన్నాతాధికారుల నుంచి వచ్చే అదేశాల మేరకు వీరు ఎక్కడైతే తింటున్నారో.. అక్కడివారినే ప్రతినిత్యం నియంత్రిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల వెలగపూడిలో జరిగిన మహిళలపై దాడి, ఆ తరువాత మందడం మహిళలపై తమ జులుం ప్రదర్శించడంతో పాటు దాడి చేసి గాయపర్చిన క్రమంలో రైతులు పోలీసులకు సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ సహాయ నిరాకరణలో భాగంగా ఇకపై పోలీసులకు తమ హోటళ్లలో పలహారాలు, బోజనాలు, టీ, కాఫీలు, చివరకు నీళ్ల బాటిళ్లు కూడా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో పోలీసులు వాటర్, టిఫిన్లు బయటి నుంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, కొంతమంది పోలీసులకు స్థానికులే భోజనాలు పెడుతున్నారు. వారిని కొట్టిన పోలీసులకే స్థానికులు ఆహారం పెడతున్నారు. తాగటానికి నీళ్లు ఇస్తున్నారు. అపకారికి ఉపకారం చేయడం తెలుగువాడి గొప్పదనమని కొందరు ప్రశంసించగా, వాళ్లు మాత్రం ఏం చేస్తారు.. ఉన్నతాధికారులు అదేశాలను అమలు చేస్తారు. వారి ఇష్ట ప్రకారం ఏమీ చేయలేరుగా అంటూ వెనకేసుకువస్తున్నారు.

అయితే శుక్రవారం తుళ్లూరు, వెలగపూడి, మందడం గ్రామస్థులపై పోలీసుల ప్రదర్శించిన దౌర్జన్యం అంతా ఇంతా కాదు. మహిళలని..యువతులని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్లు కొట్టారు. రక్తాలు కారేలా కొట్టారు. కనకదుర్గమ్మ దేవాలయానికి ర్యాలీగా వెళ్లాలనుకున్న మహిళలపై తమ ప్రతాపాన్ని చూపారు. ఆడ, మగ, పిల్లా, పెద్ద అన్న తేడా లేకుండా మరీ దారుణంగా వ్యవహరించి వారిపై లాఠీలను జుళిపించారు. దీంతో మహిళలు, యువతులు పోలీసులపై ఎదురు తిరిగారు. దీంతో మహిళలపై కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ తరుణంలో పోలీసులకు సహాయనిరాకణ చేయాలని పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh