police doesnt allow Amaravati farmers to protest అమరావతి రైతుల దీక్షను అడ్డుకున్న పోలీసులు..

High tension in amaravati as police doesnt allow farmers to protest

YS Jagan, Amaravati, Amaravati farmers, mandadam, Tulluru, tents, agitations, tension, Tension, Temples, joint action committee, YS Jagan, Capitals, Visakhapatnam, kurnool, committee report, executive capital, legislative capital, judicial capital, Amaravati farmers, vanta varpu, Amaravati bandh, Jagan Mohan reddy, Andhra Pradesh vs Telangana, national interest, Vijayawada, farmers, Capital city, Amaravati, agitation, Andhra Pradesh, Politics

Tension prevailed in the capital region of Amaravati as the police doesn't allow farmers of Mandadam, Tulluru and other villagers to protest against the government decision. police didnt permit villagers to wear Tents. which created tension.

అమరావతి రైతుల దీక్షను అడ్డుకున్న పోలీసులు..

Posted: 01/11/2020 10:53 AM IST
High tension in amaravati as police doesnt allow farmers to protest

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న దీక్షలు 25 రోజుకు చేరుకున్న నేపథ్యంలో పోలీసులు వారిపై మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. అమరావతి గ్రామాల పరిధిలో ఎక్కడా నిరసనలు కార్యక్రమాలు చేపట్టకుండా చర్యలు తీసుకుంటున్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల పరిధిలో 144 సెక్షన్, సెక్షన్ 30 అమల్లో వున్నాయని.. దీంతో ఎక్కడా ఎలాంటి దీక్షలకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెబుతున్నారు. దీంతో రాజధాని గ్రామాల్లో అప్రకటిత కర్ప్యూ వాతావరణం అలుముకుంది.

పోలీసులు హెచ్చరికలను లక్షపెట్టకుండా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు మందడం, తుళ్లూరు గ్రామాల ప్రజలు సిద్దంకాగా, పోలీసులు గ్రామస్థులు వేసిన టెంట్ ను తొలగించారు. టెంట్ వేయవద్దని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇది క్రమంగా ఉద్రిక్తతకు దారితీసింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన తమను ప్రభుత్వం పోలీసుల సాయంతో రోడ్డుమీదకు ఈడుస్తుందని వాపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. పోలీసులు కూడా సహృదయంతో తమను అర్థం చేసుకోవాలని కోరారు.

అటు వెలగపూడిలో నిన్న ఉదయం శివాలయానికి పోలీసులు వేసిన తాళం ఇవాళ తీయకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యదూపదీఫ నైవేద్యాలను కూడా నోచుకోకుండా.. నిత్యాభిషేక ప్రియుడైన శివయ్యను కూడా పోలీసులు ఆలయ దిగ్భంధం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక గ్రామస్థులెవరూ ఇళ్లలోంచి భయటకురాకూడదని హెచ్చరికలు చేసిన పోలీసులు గ్రామాల్లో కవాతు నిర్వహించారు. ఈ మేరకు మైక్ ల ద్వారా ప్రచారం చేస్తూ రైతులను భయాందోళనకు గురిచేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amaravati farmers  mandadam  Tulluru  tents  agitations  tension  joint action committee  Andhra Pradesh  Politics  

Other Articles