Incredible Footage Shows Water Flowing Upwards మహాద్భుతం: సముద్రంపై ఏర్పడిన టొర్నాడో

Incredible footage shows water flowing upwards

Faroe Islands, Faroe Islands incredible video, water flowing upwards, defy gravity, Samy Jacobsen, Faroe Islands spectacular video, water spout, tornado on water, denmark, ireland, norway, spectacular news, viral video

An incredible video, captured in Faroe Islands, shows a column of water flowing upwards to defy gravity. Samy Jacobsen, 41, was walking along the cliffs off Suouroy in the Faroe Islands when he came across the extraordinary sight,

ITEMVIDEOS: మహాద్భుతం: సముద్రం నుంచి కొండపైకి నీరు..

Posted: 01/10/2020 05:03 PM IST
Incredible footage shows water flowing upwards

అదో ఫేరోయి ద్వీపం.. డెన్మార్క్ దేశానికి హృదయంలా వున్న ఈ ప్రాంతంలో సముద్రం కూడా వుంది. అయితే ఇక్కడి సముద్రంలోని నీరు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ప్రవహించింది. సుడిగాలి మాదిరిగా ఆకాశంలోకి నీరు చిమ్ముతోంది. కొండ శిఖరంపై వరకు ఒకే దారతో నీరు చిమ్ముతోంది. ఈ అరుదైన అద్భుతమైన దృశ్యం ఫెరోయి ద్వీపంలోని స్యూరోయ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అదే సమయంలో అక్కడికి వెళ్లిన శామీ జాకబ్సెన్ (41) అనే వ్యక్తి ఈ దృశ్యాన్ని ఆసక్తిగా గమనించాడు.

కొండ ప్రాంతాల గుండా ఈ ప్రాంతానికి చేరుకుని ఆ మహాద్భుత దృశ్యాలను తన మొబైల్ ఫోన్ లో బంధించాడు. ఆ వీడియోలో కొండ అంచున సముద్రంలోని అలల తాకిడికి సుడిగుండం మాదిరిగా ఏర్పడింది. దీని ప్రభావంతో అల నుంచి నీళ్లు గాల్లోకి చిమ్ముతూ కొండ శిఖరం కొనపై పడుతున్నాయి. దీనిపై వాతావరణ నిపుణులు నీళ్లతో కూడిన సుడిగుండంగా విశ్వసిస్తున్నారు. ఒక పిల్లర్ మాదిరిగా గాల్లోకి నీళ్లు విరజిమ్ముతోందని అంటున్నారు.

నీళ్లలో ఏర్పడిన సుడిగుండం ప్రభావంతోనే గాలి కింది నుంచి రౌండుగా తిరుగుతూ పైకి వస్తోందని చెబుతున్నారు. ఆ గాలి పీడనంతో పాటు నీళ్లు కూడా అలానే పైకి ఎగసిపడుతున్నాయన్నారు. అక్కడి ప్రాంతమంతా భారీ జల్లులతో వాతావరణమంతా ఒక మాదిరిగా మారిపోవడంతోనే ఇలా సముద్రంలోని నీరు గాల్లోకి ఎగిసిపడుతున్నట్టు తెలిపారు. సాధారణంగా నీళ్లు పెద్దఎత్తున గాల్లోకి చిమ్మాలంటే దానికి కింది నుంచి అధిక స్థాయిలో పీడనం కావాలి. అప్పుడే నీరు గాల్లోకి చిమ్మడం జరుగుతుంది.

మహాద్భుతం అని ఈ విచిత్రాన్ని కొనియాడుతున్న తరుణంలో గత ఏడాది సెప్టెంబర్ 22న ఒడిశాలో కూడా ఇలాంటి విచిత్రానికి నెలవయ్యింది. రాష్ట్రంలోని చిల్కా సరస్సు దేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా పేరు పొందింది. వివిధ పక్షి జాతులతో జీవ వైవిధ్యానికి నెలవుగా ప్రసిద్ధి పొందింది. ఈ లేక్‌ను చూడడానికి ఏటా వేలాదిమంది యాత్రికులు తరలివస్తుంటారు. అలా వచ్చిన పర్యాటకులకు టోర్నోడో సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. అదెలా అంటే నీరు ఆకాశం నుంచి భూమ్మీదకు పడుతుంది కానీ. అకస్మాత్తుగా ఏర్పడిన టోర్నడో సరస్సులో నుంచి నీరు ఒక్కసారిగా ఆకాశంలోకి వెళ్లడాన్ని యాత్రికులు ఆసక్తిగా తిలకించి సరికొత్త అనుభూతిని పొందారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Telangana govt proposes to conduct eamcet in sept second week

  తెలంగాణ ఎంసెట్ పరీక్షలకు తేదీల ఖరారు..

  Aug 11 | కరోనా నేపథ్యంలో మూతపడిన విద్యాలయాలు ఎప్పుడు తెరుచుకుంటాయా.? అని పాఠశాల యాజమాన్యాలు ఎదురుచూస్తున్న తరుణంలో.. తెలంగాణ ప్రభుత్వం వారి  ఎదురుచూపులపై నీళ్లు చల్లింది. అయతే ఈసెట్, పాలీసెట్, ఎంసెట్ పరీక్షలను ఎప్పుడు నిర్వహించే విషయమై... Read more

 • Rebel rajasthan congress mla bhanwar lal sharma meets cm ashok gehlot

  రాజస్థాన్ సంక్షోభం: గెహ్లాట్ కు జైకొట్టిన బన్వర్ లాల్ శర్మ

  Aug 10 | రాజస్థాన్ లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన రసకందాయ పరిస్థితి క్రమంగా సద్దుమణుగుతోంది. ఇప్పటికే ఈ పరిస్థితులను ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో.. ఆయనకు అసమ్మతి... Read more

 • Coronavirus in ap 7665 new covid 19 cases state tally crosses 2 35 lakh mark

  ఏపీలో కరోనా విజృంభన: 24 గంటల్లో 7665 కేసులు.. 80 మరణాలు

  Aug 10 | ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందలాది మందిని తన ప్రభావానికి గురిచేస్తూ ఏకంగా రెండు లక్షల... Read more

 • Margadarsi chits and finance case sc issues notices to ramoji rao

  ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావుకు సుప్రీంకోర్టు నోటీసులు

  Aug 10 | ఏళ్ల క్రితం సంచలనంగా మారిన మార్గదర్శి కేసు మరోమారు వెలుగులోకి వచ్చింది. ఈ కేసును విచారించనున్న నేపథ్యంలో ఈనాడు సంస్థల అధినేత (చైర్మన్) రామోజీరావుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.... Read more

 • Former president pranab mukherjee tested positive for covid 19

  మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్.!

  Aug 10 | యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 7 లక్షల 32 వేల మందిని కబళించి వేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన నిఫుణులు, అనేక మంది ప్రముఖులను కూడా కబళించింది. ఎందరెందరో... Read more

Today on Telugu Wishesh