Pawan Kalyan condemns arrest of Chandrababu బాబు అరెస్టును ఖండించిన పవన్: రెచ్చగొట్టోద్దని వినతి

Pawan kalyan condemns arrest of chandrababu slams ycp govt

chandrababu, pawan kalyan, vijayawada, arrest, JAC leaders, Amaravati, Visakhapatnam, executive capital, legislative capital, judicial capital, Amaravati farmers, vanta varpu, Amaravati bandh, Jagan Mohan reddy, Andhra Pradesh vs Telangana, national interest, Vijayawada, farmers, Capital city, Amaravati, agitation, Andhra Pradesh, Politics

Actor-turned-politician, Jana Sena chief Pawan Kalyan condemned the arrest of Chandrababu Naidu and other JAC leaders. Pawa Kalyan alleged that the government is trying to suppress the farmers' fight with the support of police. He criticised that they are trying to make Amaravati as another Nandigram.

చంద్రబాబు అరెస్టును ఖండించిన పవన్: రెచ్చగొట్టోద్దని వినతి

Posted: 01/09/2020 11:16 AM IST
Pawan kalyan condemns arrest of chandrababu slams ycp govt

అమరావతి ప్రాంతంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను ఈ ప్రభుత్వం కావాలనే రెచ్చగొడుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన, పోలీసు బలంతో రైతుల ఉద్యమాన్ని అణచి వేయాలని జగన్ సర్కారు ప్రయత్నిస్తోందని అరోపించారు. ఇటువంటి చర్యలతో ఉద్యమం హింసాత్మకంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల నిర్బంధం, అరెస్ట్ లతో ఉద్యమాన్ని అణగదొక్కాలని చూస్తే, ఉద్యమం ఉద్ధృతం అవుతుందన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.

ఉద్యమ అణచివేతలో భాగంగానే నిన్న చంద్రబాబును అరెస్ట్ చేశారని విమర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో బస్సుయాత్రలకు అనుమతినిచ్చిన పోలీసులు.. యాత్రను చేపట్టేందుకు వెళ్తున్న నాయకులను మాత్రం అడ్డుకుంటారా.? అని ఎద్దేవా చేశారు. అమరావతి రైతులు శాంతియుతంగా చేస్తున్న నిరసనలను ఉద్రిక్తంగా మార్చి.. ఆ తరువాత హింసాత్మకంగా మార్చేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన అందోళన వ్యక్తం చేశారు.

అదే జరిగితే పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ లో జరిగినట్లుగానే అమరావతి రైతుల ఉద్యమం మారుతుందని ఆయన హెచ్చరించారు. అయితే అఖిలపక్ష నేతల సమావేశానికి హాజరయ్యేందుకు పాదయాత్రగా తరలివస్తున్న విపక్ష పార్టీల నేతలను వైసీపీ ప్రభుత్వం పోలీసులు బలగాలతో ఎక్కడికక్కడ అడ్డుకోవడాన్ని ఆయన తప్పబట్టారు. చంద్రబాబు పాదయాత్రను పోలీసులు విజయవాడలోని బెంజి సర్కిల్ వద్ద నిన్న అడ్డుకోవడంతో ఆయన అక్కడే రోడ్డుపై బైఠాయించారు. అనంతరం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని ఉండవల్లిలోని తన నివాసానికి తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా మూడున్నర గంటల పాటు అక్కడ ఉద్రిక్త వాతావరణం అలుముకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amaravati farmers  pawan kalyan  chandrababu  Vijayawada  Arrest  YS Jagan  Capitals  Andhra Pradesh  Politics  

Other Articles