Porsche 911 car owner slapped a fine of Rs 27.68 lakh ఈ ఖరీదైన కారుపై దేశంలోనే అత్యధిక జరిమానా.!

Porsche owner slapped rs 27 68 lakh fine for not having valid documents

Regional Transport Office, Ahmedabad, Ahmedabad traffic police, porsche car, ahmedabad police, gujarat, Motor Vehicle Act, highest fine, Crime

The RTO at Ahmedabad has slapped a fine of Rs 27.68 lakh on the owner of a Porsche car for not having the required documents with him. Ahmedabad Police said that the vehicle was detained during a routine check as the driver failed to produce the required papers.

ఈ ఖరీదైన కారుపై దేశంలోనే అత్యధిక జరిమానా.!

Posted: 01/08/2020 08:12 PM IST
Porsche owner slapped rs 27 68 lakh fine for not having valid documents

ట్రాఫిక్ పోలీసులు నియమనిబంధనలను పాటించని సమయంలో వాటిపై జరిమానాలు విధిస్తుంటారు. అయితే అప్పుడప్పుడూ అధికారులు జారీచేసే విద్యుత్ బిల్లుల మాదిరిగా గెండెలు అదిరిపోయేలా లక్షల రూపాయాల జరిమానా పడితే.. ఇక ఆ వాహన యజమాని పరిస్థితి ఏంటి.? అయితే ఇక్కడ ఈ కారుకు పడిన జరిమానాతో ఓ మధ్యతరగతి ఫ్లాట్ తో పాటు బుల్లి కారు కూడా కొనుక్కోవచ్చు. ఏంటీ ఇదంతా కారుపై విధించిన జరిమానాతోనే.? అంటూ అశ్చర్యపోతున్నారా.? ఔనండీ ఇది నిజంగా రికార్డు స్థాయి జరిమానా.

దేశంలో అత్యంత అల్పంగా వున్న అత్యంత ఖరీదైన కారు యజమానికి ట్రాఫిక్ పోలీసులు, ఆనక ఆర్టీవో అధికారులు విధించిన జరిమానా వెరసి దేశంలోనే అత్యధిక జరిమానా పడిన కారుగా రికార్డు అందుకున్న ఈ కారు పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నంబర్ ప్లేట్, ఇతర ధ్రువపత్రాలు లేకుండా రోడ్లెక్కిన.. దాదాపు రూ.2 కోట్ల విలువైన పోర్షే 911 స్పోర్ట్స్ కారుపై గత ఏడాది నవంబర్లో అహ్మదాబాద్ ట్రాఫిక్ పోలీసులు రూ.9.80 లక్షలు జరిమానా విధించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన జరిగిన ఆరు వారాల తర్వాత ఈ ఫెనాల్టీ విషయంలో పోలీసులు ఓ అప్‌డేట్ ఇచ్చారు.

ఈ ఫైన్‌ను గుజరాత్ ఆర్టీవో తాజాగా రూ.27.68 లక్షలకు పెంచారు. దేశంలో అత్యధికంగా విధించిన ఫైన్లలో ఇదొకటని పోలీసు శాఖ తెలిపింది. ఎంత ఫైన్ వేస్తే మాత్రం మరీ రూ.27.68 లక్షలు ఎలా అవుతుందని అనుకుంటున్నారా..? జనవరి 7, 2020 నుంచి 2033 ఆగష్టు 28 వరకు మోటార్ బ్యాలెన్స్ ట్యాక్స్ రూపంలో మోటార్ వెహికిల్ ట్యాక్స్ రూ.16 లక్షలు.. దానిపై వడ్డీ రూ.7.68 లక్షలు విధించారు. పెనాల్టీ లేదా అదనపు ఫీజు రూపంలో మరో రూ.4 లక్షలు.. మొత్తం కలుపుకొని రూ.27.68 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. డాక్యుమెంట్లేవీ లేకపోవడంతో.. పోర్షే కారు యజమానికి భారీ జరిమానా విధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles